యూఎస్ ఓపెన్:స్టీఫెన్స్ వర్సెస్ కీస్ | Sloane Stephens and Madison Keys Reach US Open Final | Sakshi
Sakshi News home page

యూఎస్ ఓపెన్:స్టీఫెన్స్ వర్సెస్ కీస్

Published Fri, Sep 8 2017 2:23 PM | Last Updated on Sun, Sep 17 2017 6:36 PM

యూఎస్ ఓపెన్:స్టీఫెన్స్ వర్సెస్ కీస్

యూఎస్ ఓపెన్:స్టీఫెన్స్ వర్సెస్ కీస్

న్యూయార్క్:యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. ఈసారి ఇద్దరు అమెరికా అమ్మాయిలు స్లోన్ స్టీఫెన్స్ -మాడిన్సన్ కీస్లు తుది పోరులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి సెమీ ఫైనల్లో స్లోన్ స్టీఫెన్స్ 6-1, 0-6, 7-5 తేడాతో అమెరికాకే చెందిన తొమ్మిదో సీడ్ వీనస్ విలియమ్స్ పై విజయం సాధించి ఫైనల్లోకి చేరగా, రెండో సెమీ ఫైనల్లో మాడిన్ సన్ కీస్ 6-1,6-2 తేడాతో తన సహచర క్రీడాకారిణి వాండవేగేపై విజయం సాధించి తుది బెర్తును ఖాయం చేసుకున్నారు.

దాంతో స్టీఫెన్-కీస్ ల మధ్య ఆదివారం తుది పోరు జరగనుంది. ఈ ఇద్దరి ముఖాముఖి పోరులో స్టెఫెన్స్ 1-0 ఆధిక్యంలో ఉన్నారు. వీరిద్దరూ ఒక గ్రాండ్  స్లామ్ ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. కాగా, ఇద్దరు అమెరికా టెన్నిస్ ప్లేయర్స్ యూఎస్ ఓపెన్ ఫైనల్లో తలపడటం దాదాపు 15 ఏళ్ల  తరువాత ఇదే తొలిసారి. చివరిసారి 2002లో సెరెనా విలియమ్స్-వీనస్ విలియమ్స్ లు ఫైనల్లో తలపడ్డారు. ఆ పోరులో సెరెనా టైటిల్ ను సొంతం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement