
టొరంటో: కెనడియన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో శుభారంభం చేసింది. అమెరికా ప్లేయర్ మాడిసన్ కీస్‌తో జతకట్టిన సానియా తొలి రౌండ్లో 6–4, 3–6, 10–6తో అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్)–జిల్ టెయిక్‌మన్ (స్విట్జర్లాండ్) జంటపై విజయం సాధించింది. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా జోడీ... టాప్‌సీడ్ వెరొనిక కుడెర్మెటోవా (రష్యా)– ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం) జంటతో తలపడుతుంది.
మరో వైపు మాంట్రియల్ ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్‌లో భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న జోడీ కూడా ప్రిక్వార్టర్స్ చేరింది. తొలి రౌండ్లో బోపన్న–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) ద్వయం 7–6 (7/5), 4–6, 10–6తో డెనిస్ షపొవలోవ్ (కెనడా)– కరెన్ కచనొవ్ (రష్యా) జంటపై గెలిచింది. ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ పొలండ్‌కు చెందిన జెలిన్‌స్కీ–హుర్కాజ్ జంటతో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment