కెనడా ఓపెన్ సెమీ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ పీవీ సింధుకు చుక్కెదురైంది. ఆదివారం ఉదయం జరిగిన సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన అకానే యమగుచి చేతిలో 14-21,15-21 తేడాతో సింధు ఓటమి పాలైంది. రెండు గేమ్స్‌లోనూ సింధుపై యమగుచి అధిపత్యం చెలాయించింది. కాగా యమగుచి చేతిలో సింధు ఓడిపోవడం వరుసగా ఇది రెండో సారి కావడం గమనార్హం.
సింగపూర్ ఓపెన్-2023లో తొలిరౌండ్‌లోనే సింధును ఈ జపాన్ స్టార్ షెట్లర్ ఓడించింది. ఇక గాయం నుంచి కోలుకున్న తర్వాత సింధు మునుపటిలా ప్రదర్శన చేయలేకపోతోంది. తాజాగా బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లోనూ మూడు స్ధానాలు దిగజారి 15వ ర్యాంక్‌లో సింధు నిలిచింది.
ఫైనల్లో లక్ష్య సేన్
ఇక పీవీ సింధు నిరాశపరిచినప్పటికీ మరో భారత షెట్లర్ లక్ష్య సేన్ మాత్రం అదరగొట్టాడు. కెనడా ఓపెన్ ఫైనల్లోకి లక్ష్య సేన్ అడుగుపెట్టాడు. సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన కెంటా నిషిత్మోటోను 21-17, 21-14 వరుస గేమ్‌లలో ఓడించి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ విజయంతో లక్ష్య సేన్ దాదాపు ఏడాది తర్వాత బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్‌కు చేరుకున్నాడు.
చదవండి: ఆసియా క్రీడలకు భారత టీటీ జట్టులో శ్రీజ.. జట్ల వివరాలివే
Comments
Please login to add a commentAdd a comment