రోజర్స్ కప్ లో సానియా జోడి ఓటమి
టొరంటో: రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మిర్జా జోడి పోరాటం ముగిసింది. ఇక్కడ జరిగిన మహిళల డబుల్స్ సెమీస్ లో సానియా మిర్జా-మార్టినా హింగిస్ జోడి 6-3, 6-2 తేడాతో కరోలైన్ గార్సియా-క్యాథరినా ద్వయం చేతిలో ఓటమి చవిచూసింది. భారత్-స్విస్ జంట మొదటి సెట్లో రెండు డబుల్ ఫాల్ట్స్ చేశారు. ఆ తర్వాత మూడు అవకాశాలు వచ్చినా వాటిని చేజార్చుకున్నారు. రెండు బ్రేక్ పాయింట్లను సాధించి కరోలైన్-క్యాథరినా ద్వయం తొలి సెట్ కైవసం చేసుకుంది.
రెండో సెట్లోనూ సానియా జంట డబుల్ ఫాల్ట్స్, అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నారు. దీంతో కెనడా ఓపెన్ టోర్నమెంట్లో వీరి పోరు సెమీస్ లోనే ముగిసి ఇంటి దారి పట్టాల్సి వచ్చింది. మ్యాచ్ లో మొత్తం 54 పాయింట్లు సాధించి సెమీస్ గెలిచి కరోలైన్-క్యాథరినా ఫైనల్లోకి ప్రవేశించారు.