
రొమేనియా స్టార్ సిమోనా హలెప్ మూడోసారి టొరంటో ఓపెన్ డబ్ల్యూటీఏ మాస్టర్స్–1000 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో హలెప్.. బ్రెజిల్‌కు చెందిన బీట్రిజ్ హదాద్ మయాస్‌పై 6-3, 2-6, 6-3 తేడాతో విజయం సాధించింది. సెమీస్‌లో జెస్సికా పెగూలా (అమెరికా)పై 2–6, 6–3, 6–4తో పోరాడి నెగ్గిన హలెప్.. ఫైనల్లోనూ అదే పోరాట పటిమ కనబర్చి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
తుది సమరంలో తొలి సెట్ సునయాసంగా గెలిచిన హలెప్.. రెండో సెట్‌లో ప్రత్యర్ధి నుంచి ఊహించని పోరాటం ఎదురుకావడంతో తడబడి 2-6తో చేజార్చుకుంది. అయితే కీలకమైన మూడో సెట్‌లో ప్రత్యర్ధికి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. తద్వారా మూడో కెనాడిన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2016, 2018లో హలెప్ ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment