Womens tennis singles
-
భారత కొత్త నంబర్‌వన్‌గా శ్రీవల్లి రష్మిక
మహిళల టెన్నిస్ సింగిల్స్ విభాగంలో భారత కొత్త నంబర్‌వన్ ప్లేయర్‌గా హైదరాబాద్‌కు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక అవతరించింది. సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) ర్యాంకింగ్స్‌లో 22 ఏళ్ల రష్మిక రెండు స్థానాలు పడిపోయి 302వ స్థానంలో నిలిచింది. మూడు నెలలుగా భారత నంబర్‌వన్‌గా ఉన్న తెలంగాణ ప్లేయర్ సహజ యామలపల్లి ఏకంగా 18 స్థానాలు పడిపోయి 304వ ర్యాంక్‌కు చేరుకోవడం రషి్మకకు కలిసొచి్చంది. భారత్‌కే చెందిన అంకిత రైనా 306వ ర్యాంక్‌లో, వైదేహి 405వ ర్యాంక్‌లో ఉన్నారు. -
హలెప్ హ్యాట్రిక్.. మూడోసారి కెనడా ఓపెన్ నెగ్గిన రొమేనియా స్టార్
రొమేనియా స్టార్ సిమోనా హలెప్ మూడోసారి టొరంటో ఓపెన్ డబ్ల్యూటీఏ మాస్టర్స్–1000 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో హలెప్.. బ్రెజిల్‌కు చెందిన బీట్రిజ్ హదాద్ మయాస్పై 6-3, 2-6, 6-3 తేడాతో విజయం సాధించింది. సెమీస్‌లో జెస్సికా పెగూలా (అమెరికా)పై 2–6, 6–3, 6–4తో పోరాడి నెగ్గిన హలెప్.. ఫైనల్లోనూ అదే పోరాట పటిమ కనబర్చి టైటిల్‌ను కైవసం చేసుకుంది. తుది సమరంలో తొలి సెట్ సునయాసంగా గెలిచిన హలెప్.. రెండో సెట్లో ప్రత్యర్ధి నుంచి ఊహించని పోరాటం ఎదురుకావడంతో తడబడి 2-6తో చేజార్చుకుంది. అయితే కీలకమైన మూడో సెట్లో ప్రత్యర్ధికి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. తద్వారా మూడో కెనాడిన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2016, 2018లో హలెప్ ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచింది. -
చాంపియన్ సహజ
గురుగ్రామ్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి చాంపియన్‌గా అవతరించింది. గురుగ్రామ్‌లో ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల సహజ 6–3, 7–6 (7/5)తో మూడో సీడ్ విక్టోరియా (స్లొవేకియా)పై విజయం సాధించింది. సహజ కు 3,935 డాలర్ల (రూ. 3 లక్షల 10 వేలు) ప్రైజ్ మనీ 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
30 సార్లు లైంగిక వేధింపులకు గురయ్యాను.. మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సంచలన ఆరోపణలు
ప్రపంచ మాజీ నంబర్ 2 టెన్నిస్ క్రీడాకారిణి, రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనలిస్ట్ అయిన ఆండ్రియా జేగర్ (అమెరికా) సంచలన వ్యాఖ్యలు చేశారు. 1980వ సంవత్సరంలో మహిళా టెన్నిస్ అసోసియేషన్ స్టాఫ్ మెంబర్ ఒకరు తనపై 30కి పైగా సందర్భాల్లో లైంగికంగా దాడులకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు టెన్నిస్ అసోసియేషన్‌కు చెందిన మరో ప్రముఖుడు తనకు మద్యం తాగించి అసభ్యంగా ప్రవర్తించాడని 57 ఏళ్ల ఆండ్రియా జేగర్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఆండ్రియా జేగర్ 1980వ దశకంలో మహిళల టెన్నిస్‌లో స్టార్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. భుజం గాయం కారణంగా కెరీర్ అర్ధంతరంగా ముగియకముందు ఆమె 10కి పైగా టైటిళ్లు సాధించింది. జేగర్.. 1982 ఫ్రెంచ్ ఓపెన్, 1983 వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. జేగర్.. ప్రముఖ మహిళల టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా సమకాలీకురాలు. చదవండి: వామ్మో కట్టెముక్కను విరిచినట్లు.. బ్యాట్‌ను సింపుల్‌గా -
ఫ్రెంచ్ ఓపెన్‌లో పెను సంచలనం.. తొలి రౌండ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్‌కు పరాభవం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో రెండో రోజు పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ బార్బరా క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ప్రపంచ 97వ ర్యాంకర్, 19 ఏళ్ల ఫ్రాన్స్ అమ్మాయి డియాన్ పారీ 1–6, 6–2, 6–3తో క్రిచికోవాపై సంచలన విజయం సాధించి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఈ ఓటమితో ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన మూడో డిఫెండింగ్ చాంపియన్‌గా క్రిచికోవా నిలిచింది. గతంలో అనస్తాసియా మిస్కినా (రష్యా–2005), ఎలెనా ఒస్టాపెంకో (లాత్వియా–2019) మాత్రమే టైటిల్ సాధించిన తర్వాత ఏడాది తొలి రౌండ్లోనే ఓడిపోయారు. మరోవైపు ప్రపంచ మాజీ నంబర్‌వన్, 38వ ర్యాంకర్ నయోమి ఒసాకా (జపాన్) కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయింది. 28వ ర్యాంకర్ అనిసిమోవా (అమెరికా) 7–5, 6–4తో మూడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ విజేత నయోమి ఒసాకాను ఓడించింది. టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్) 6–2, 6–0తో సురెంకో (ఉక్రెయిన్)పై నెగ్గింది. పురుషుల సింగిల్స్‌లో 13 సార్లు చాంపియన్ నాదల్ (స్పెయిన్) తొలి రౌండ్లో 6–2, 6–2, 6–2తో థాంప్సన్ (ఆస్ట్రేలియా)పై గెలిచి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. 2015 విజేత వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–2, 3–6, 6–7 (2/7), 3–6తో ముటెట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. -
మోనికా సంచలనం
పుయెర్టోరికోకు తొలి స్వర్ణం మహిళల టెన్నిస్ సింగిల్స్‌లో సంచలనం నమోదయింది. పుయెర్టోరికో క్రీడాకారిణి మోనికా ప్యూగ్ స్వర్ణం గెలుచుకుంది. జర్మనీ టెన్నిస్ స్టార్ అంజెలిక్ కెర్బర్తో జరిగిన ఫైనల్లో 6-4, 4-6, 6-1 తేడాతో గెలిచిన మోనికా.... పుయెర్టోరికోకు ఒలింపిక్స్ చర్రితో తొలి స్వర్ణం అందించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, ప్రస్తుత ప్రపంచ నెంబర్-2 అయిన కెర్బర్‌ను పూర్తిగా నిలువరించింది. మ్యాచ్ గెలవగానే ‘ఓహ్ మైగాడ్’ అని గట్టిగా అరిచి ఉద్వేగంతో ఏడ్చింది. పుయెర్టోరికో జాతీయ పతాకంతో సెంటర్ కోర్ట్ అంతా తిరిగింది. మోనికా విజయంతో పుయెర్టోరికోలో సంబరాలు అంబరాన్నంటాయి. ఇప్పటి వరకు పుయెర్టోరికోకు ఎనిమిది ఒలింపిక్స్ పతకాలు రాగా అందులో రెండు రజతాలు, ఆరు కాంస్యాలున్నాయి. కాగా, పెట్రో క్విటోవా మహిళ సింగిల్స్ కాంస్యాన్ని అందుకుంది. ప్లేఆఫ్‌లో అమెరికన్ మాడిసన్‌పై 7-5, 2-6, 6-2తో విజయం సాధించింది.