మోనికా సంచలనం | Monica Puig Makes Olympic History, Winning Puerto Rico's First Gold Medal | Sakshi
Sakshi News home page

మోనికా సంచలనం

Published Mon, Aug 15 2016 2:43 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

మోనికా సంచలనం

మోనికా సంచలనం

పుయెర్టోరికోకు తొలి స్వర్ణం
 మహిళల టెన్నిస్ సింగిల్స్‌లో సంచలనం నమోదయింది. పుయెర్టోరికో క్రీడాకారిణి మోనికా ప్యూగ్ స్వర్ణం గెలుచుకుంది. జర్మనీ టెన్నిస్ స్టార్ అంజెలిక్ కెర్బర్‌తో జరిగిన ఫైనల్లో 6-4, 4-6, 6-1 తేడాతో గెలిచిన మోనికా.... పుయెర్టోరికోకు ఒలింపిక్స్ చర్రితో తొలి స్వర్ణం అందించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, ప్రస్తుత ప్రపంచ నెంబర్-2 అయిన కెర్బర్‌ను పూర్తిగా నిలువరించింది. మ్యాచ్ గెలవగానే ‘ఓహ్ మైగాడ్’ అని గట్టిగా అరిచి ఉద్వేగంతో ఏడ్చింది.
 
 పుయెర్టోరికో జాతీయ పతాకంతో సెంటర్ కోర్ట్ అంతా తిరిగింది. మోనికా విజయంతో పుయెర్టోరికోలో సంబరాలు అంబరాన్నంటాయి. ఇప్పటి వరకు పుయెర్టోరికోకు ఎనిమిది ఒలింపిక్స్ పతకాలు రాగా అందులో రెండు రజతాలు, ఆరు కాంస్యాలున్నాయి. కాగా, పెట్రో క్విటోవా మహిళ సింగిల్స్ కాంస్యాన్ని అందుకుంది. ప్లేఆఫ్‌లో అమెరికన్ మాడిసన్‌పై 7-5, 2-6, 6-2తో విజయం సాధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement