ముల్హింమ్ ఎన్ డెర్ రూర్:భారత్ స్టార్ షట్లర్, ప్రపంచ రెండో ర్యాంకు క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జర్మన్ గ్రాండ్ ప్రి గోల్డ్ ఓపెన్ నుంచి వైదొలిగింది. ఫిట్ నెన్ సమస్య కారణంగా మంగళవారం నుంచి ఆరంభకానున్న జర్మన్ ఓపెన్కు సైనా దూరమైంది. గతేడాది చీలమండ గాయానికి గురైన సైనా.. పూర్తి ఫిట్ నెస్ను సాధించే పనిలో పడింది.
త్వరలో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ జరుగనున్న నేపథ్యంలో అప్పటికి గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలని సైనా భావిస్తోంది. దీంతో మహిళల బ్యాడ్మింటన్ జట్టుకు పివి సింధు సారథ్యం వహించనుంది. మరోవైపు పురుషుల బ్యాడ్మింటన్కు భారత్ తరపున కిడాంబి శ్రీకాంత్ నాయకత్వం వహించనున్నాడు.