
కశ్యప్ శుభారంభం
కాలగ్రి (కెనడా): గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేస్తున్న భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ కెనడా గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో కశ్యప్ 21–11, 21–9తో డానియల్ లా టొర రీగల్ (పెరూ)పై గెలుపొందాడు.
భారత్‌కే చెందిన రెండో సీడ్ హెచ్‌ఎస్ ప్రణయ్‌తోపాటు సారంగ్ లఖాని, కరణ్ రాజన్, అభిషేక్ యెలెగార్ కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.