హామిల్టన్‌కే ‘పోల్’
నేడు ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి
స్పీల్‌బెర్గ్ (ఆస్ట్రియా): ఈ సీజన్‌లో తన జోరు కొనసాగిస్తున్న లూయిస్ హామిల్టన్ ఏడోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ క్వాలిఫయింగ్ సెషన్‌లో హామిల్టన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 08.455 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మెర్సిడెస్‌కే చెందిన రోస్‌బర్గ్ రెండో స్థానం నుంచి, వెటెల్ మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ ఐదో స్థానం నుంచి, సెర్గియో పెరెజ్ 16వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. తాజా ప్రదర్శనతో హామిల్టన్ అత్యధికసార్లు ‘పోల్ పొజిషన్’ సాధించిన డ్రైవర్ల జాబి తాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. 45 ‘పోల్స్’తో హామిల్టన్, వెటెల్ (ఫెరారీ) సం యుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. తొలి రెండు స్థానాల్లో షుమాకర్ (68), సెనా (65) ఉన్నారు.
నేటి ప్రధాన రేసు
సాయంత్రం గం. 5.25 నుంచి
స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం