మెక్సికో: మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా వన్ రేసులో జర్మనీకి చెందిన నికో రోస్బర్గ్ విజేతగా నిలిచాడు. ఈ ఏడాదిలో రోస్బర్గ్కు ఇది నాలుగో విజయం కాగా, అతడి కెరీర్లో 12 వ విజయం. మెర్సిడేజ్ టీమ్మేట్, మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హమిల్టన్ రెండవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ తాజా విజయంతో మెర్సిడేజ్ జట్టు 17 రేసుల్లో 10 రేసులను ఒకటీ, రెండు స్థానాలతో గెలుచుకుంది. విజయం అనంతరం రోస్బర్గ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది అత్యుత్తమ వేదికను గెలుచుకున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు.
మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత రోస్బర్గ్
Published Mon, Nov 2 2015 9:21 AM | Last Updated on Sun, Sep 3 2017 11:54 AM
Advertisement
Advertisement