
కాటలోనియా (స్పెయిన్): ఈ సీజన్‌లో తన జోరు కొనసాగిస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ రెండోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శని వారం జరిగిన స్పెయిన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 16.173 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు.
ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ బ్రిటన్ డ్రైవర్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన బొటాస్ రెండో స్థానం నుంచి రేసును మొదలు పెడతాడు. వెటెల్, రైకోనెన్ వరుసగా మూడు, నాలుగు స్థానాల నుంచి ఆరంభిస్తారు. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు ఒకాన్ 13వ... పెరెజ్ 15వ స్థానం నుంచి రేసును ప్రారంభిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment