
పారిస్: మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ సీజన్‌లో మూడో టైటిల్ సాధించాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి రేసులో ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన హామిల్టన్... నిర్ణీత 53 ల్యాప్‌లను గంటా 30 నిమిషాల 11.385 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. అతని కెరీర్‌లో ఇది 65వ టైటిల్.
వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, రైకోనెన్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ రేసును పూర్తి చేయలేకపోయారు. సీజన్‌లోని తదుపరి రేసు ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి జూలై 1న జరుగుతుంది.