మెరిసిన సెర్గియో పెరెజ్ | Force India at the third position | Sakshi
Sakshi News home page

మెరిసిన సెర్గియో పెరెజ్

Published Mon, Jun 20 2016 12:32 AM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

మెరిసిన సెర్గియో పెరెజ్

మెరిసిన సెర్గియో పెరెజ్

ఫోర్స్ ఇండియాకు మూడో స్థానం
రోస్‌బర్గ్‌కే టైటిల్
►  యూరోపియన్ గ్రాండ్‌ప్రి

 
 
 బాకు (అజర్‌బైజాన్): ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తోన్న ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ మరోసారి మెరిశాడు. ఆదివారం జరిగిన యూరోపియన్ గ్రాండ్‌ప్రి రేసులో పెరెజ్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో ఫోర్స్ ఇండియా డ్రైవర్ టాప్-3లో నిలువడం ఇది రెండోసారి కావడం విశేషం. మొనాకో గ్రాండ్‌ప్రి రేసులోనూ పెరెజ్ మూడో స్థానాన్ని పొందాడు. మరోవైపు ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన నికో రోస్‌బర్గ్ (మెర్సిడెస్) ఆద్యంతం ఆధిపత్యం కనబరిచి విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో ఐదో విజయాన్ని సాధించాడు. 51 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 32 నిమిషాల 52.366 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ-1గం:33ని:09.062 సెకన్లు) రెండో స్థానంలో నిలువగా... పెరెజ్ (ఫోర్స్ ఇండియా-1గం:33ని:17.607 సెకన్లు) మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మొత్తం 22 మంది డ్రైవర్లలో నలుగురు (అలోన్సో, వెర్లిన్, కార్లోస్ సెయింజ్, క్వియాట్) మధ్యలోనే వైదొలిగారు.

 


 సీజన్‌లో ఎనిమిది రేసులు ముగిశాక రోస్‌బర్గ్ 141 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. హామిల్టన్ (మెర్సిడెస్-117 పాయింట్లు), వెటెల్ (ఫెరారీ-96 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి జులై 3న జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement