Rosbarg
-
వెటెల్ నిరీక్షణ ముగిసె...
►27 రేసుల తర్వాత తొలి విజయం ►ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం మెల్బోర్న్: ఒకటా... రెండా...మూడా... ఏకంగా 27 రేసుల నిరీక్షణ ముగిసింది. హామిల్టన్, రోస్‌బర్గ్ దాటికి ఏడాదిన్నర కాలంగా ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయిన నాలుగుసార్లు ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. 2017 ఫార్ములావన్ సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వెటెల్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన 57 ల్యాప్‌ల ఈ రేసులో వెటెల్ గంటా 24 నిమిషాల 11.670 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 2015 సెప్టెంబరులో సింగపూర్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన తర్వాత వెటెల్ ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇదే కావడం విశేషం. ఓవరాల్‌గా వెటెల్ కెరీర్లో ఇది 43వ టైటిల్. మరోవైపు 2007 తర్వాత ఫెరారీ జట్టు డ్రైవర్‌కు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి టైటిల్ లభించడం గమనార్హం. వరుసగా నాలుగో ఏడాది ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. హామిల్టన్ గంటా 24 నిమిషాల 21.645 సెకన్లలో గమ్యానికి చేరుకున్నాడు. 17వ ల్యాప్ వరకు ఆధిక్యంలో ఉన్న హామిల్టన్ టైర్లు మార్చుకోవడానికి విరామం తీసుకోగా... రెండో స్థానంలో ఉన్న వెటెల్ ముందుకు దూసుకెళ్లాడు. అక్కడి నుంచి వెటెల్‌ను అందుకోవడంలో మిగతా డ్రైవర్లు వెనుకబడ్డారు. మెర్సిడెస్ జట్టుకే చెందిన బొటాస్ మూడో స్థానాన్ని, ఫెరారీ డ్రైవర్ కిమీ రైకోనెన్ నాలుగో స్థానాన్ని పొందారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో, ఒకాన్ పదో స్థానంలో నిలిచి పాయింట్ల ఖాతా తెరిచారు. మొత్తం 20 మంది డ్రైవర్లు బరిలోకి దిగగా... ఏడుగురు డ్రైవర్లు రేసును పూర్తి చేయలేక మధ్యలోనే వైదొలిగారు. సీజన్‌లోని తదుపరి రేసు చైనా గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 9న జరుగుతుంది. గమ్యం చేరారిలా (టాప్–10): 1. వెటెల్ (ఫెరారీ; 1గం:24ని:11.670 సెకన్లు), 2. హామిల్టన్ (మెర్సిడెస్; 1:24:21.645), 3. బొటాస్ (మెర్సిడెస్; 1:24:22.920), 4. రైకోనెన్ (ఫెరారీ; 1:24:34.063), 5. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్; 1:24:40.497), 6. మసా (విలియమ్స్; 1:25:35.056), 7. పెరెజ్ (ఫోర్స్ ఇండియా; +1 ల్యాప్), 8. సెయింజ్ (ఎస్టీఆర్; +1 ల్యాప్), 9. క్వియాట్ (ఎస్టీఆర్; +1 ల్యాప్), 10. ఒకాన్ (ఫోర్స్ ఇండియా; +1 ల్యాప్). -
నువ్వా... నేనా!
హామిల్టన్‌కు ‘పోల్ పొజిషన్’ నేడు అబుదాబి గ్రాండ్‌ప్రి అబుదాబి: ఫార్ములాన్-2016 సీజన్ అంతిమ దశకు చేరుకుంది. సీజన్‌లోని చివరిదైన రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో ఓవరాల్ విజేత ఎవరో తేలనుంది. శనివారం జరిగిన క్వాలిఫరుుంగ్ సెషన్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూరుుస్ హామిల్టన్ (మెర్సిడెస్) అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 38.755 సెకన్లలో ముగించి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. హామిల్టన్ సహచరుడు నికో రోస్‌బర్గ్ ఒక నిమిషం 39.058 సెకన్లలో ల్యాప్‌ను ముగించి రెండో స్థానంలో నిలిచాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి, రోస్‌బర్గ్ రెండో స్థానం నుంచి మొదలుపెడతారు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో రోస్‌బర్గ్ (367 పారుుంట్లు), హామిల్టన్ (355 పారుుంట్లు) మధ్య 12 పారుుంట్ల తేడా ఉంది. ఆదివారం జరిగే రేసులో రోస్‌బర్గ్ టాప్-3లో నిలిస్తే చాంపియన్‌గా అవతరిస్తాడు. హామిల్టన్‌కు టైటిల్ దక్కాలంటే అతను గెలవడంతోపాటు రోస్‌బర్గ్ టాప్-3లో ఉండకూడదు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, సెర్గియో పెరెజ్ 7, 8 స్థానాల నుంచి రేసును ప్రారంభిస్తారు. -
‘మెక్సికన్’ విజేత హామిల్టన్
మెక్సికన్ సిటీ: ఫార్ములావన్ మెక్సికన్ గ్రాండ్ ప్రిలో లూరుుస్ హామిల్టన్ (మెర్సిడెస్)విజయం సాధించాడు. 71 ల్యాప్‌ల రేసును ఈ బ్రిటన్ డ్రైవర్ 1 గంట 40 నిమిషాల 31.042 సెకన్లలో పూర్తి చేశాడు. మెర్సిడెస్‌కే చెందిన రోస్‌బర్గ్ రెండు, రెడ్‌బుల్ డ్రైవర్ రికియార్డో మూడో స్థానంలో రేసును పూర్తి చేశారు. హామిల్టన్‌కు ఇది ఈ సీజన్లో ఎనిమిదో విజయం కాగా... కెరీర్లో 51వ గెలుపు. రెడ్‌బుల్‌కే చెందిన వెర్స్టాపెన్, ఫెరారీ రేసర్ వెటెల్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఈ రేసులో అనేక వివాదాలు చోటు చేసుకున్నారుు. వెర్స్టాపెన్, వెటెల్ రేసు మధ్యలో ఢీకొట్టుకున్నారు. రేసు ముగిశాక వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలిచి పొడియం మీదకు వెళ్లాడు. అరుుతే తనకు ఐదు సెకండ్ల పెనాల్టీ విధించి వెటెల్ మూడోస్థానంలో నిలిచినట్లు ప్రకటించారు. ఆ తర్వాత మూడు గంటలకు రేసు మొత్తాన్ని మరోసారి పరీక్షించాక మరో కొత్త సంఘటన బయటపడింది. రెడ్‌బుల్ డ్రైవర్ రికియార్డోను వెటెల్ ప్రమాదకరంగా అడ్డుకున్నట్లు భావించి తనపై పది సెకండ్లు పెనాల్టీ విధించారు. దీంతో తను మూడు నుంచి ఐదో స్థానానికి పడిపోగా... రికియార్డో మూడు, వెర్స్టాపెన్ నాలుగో స్థానంలో నిలిచారు. ఫోర్స్ ఇండియా రేసర్లు హల్కెన్‌బర్గ్ ఏడో స్థానంలో, పెరెజ్ పదో స్థానంలో రేసును పూర్తి చేశారు. డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో ప్రస్తుతం రోస్‌బర్గ్ 349 పారుుంట్లతో, హామిల్టన్ 330 పారుుంట్లతో ఉన్నారు. నవంబరు 13న జరిగే బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిలో రోస్‌బర్గ్ టైటిల్ గెలిస్తే ఈ ఏడాది ఫార్ములావన్ చాంపియన్‌గా నిలుస్తాడు. ఒకవేళ హామిల్టన్ అందులో గెలిస్తే సీజన్లో చివరి రేస్ (అబుదాబి, నవంబరు 27) వరకు ఫలితం కోసం ఎదురుచూడాలి. కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌ను ఇప్పటికే మెర్సిడెస్ (679) గెలుచుకుంది. -
రోస్‌బర్గ్‌దే పైచేయి...
ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం మోంజా (ఇటలీ): సహచరుడు లూరుుస్ హామిల్టన్ చేసిన తప్పిదాన్ని పూర్తిస్థారుులో సద్వినియోగం చేసుకున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్లో ఏడో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి రేసులో రోస్‌బర్గ్ 53 ల్యాప్‌లను గంటా 17 నిమిషాల 28.089 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ రేసు మొదలైన రెండో క్షణంలోనే ఆరో స్థానానికి పడిపోయాడు. దాంతో తొలి ల్యాప్‌లోనే రోస్‌బర్గ్ ఆధిక్యంలోకి వెళ్లాడు. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలిసారి ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్‌కు మూడో స్థానం దక్కింది. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లకు ఈ రేసు కలిసొచ్చింది. పెరెజ్ ఎనిమిదో స్థానంలో, హుల్కెన్‌బర్గ్ పదో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి ఈనెల 18న జరుగుతుంది. -
రోస్‌బర్గ్ ‘సిక్సర్’...
సీజన్లో ఆరో విజయం తొలిసారి బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం టాప్-5లో ఫోర్స్ ఇండియా డ్రైవర్లు స్పా-ఫ్రాంకోర్చాంప్స్ (బెల్జియం): క్వాలిఫయింగ్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్లో ఆరో విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో ఈ జర్మన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 44 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన రోస్‌బర్గ్ గంటా 44 నిమిషాల 51.058 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. తద్వారా తన కెరీర్లో తొలిసారి బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్‌ను సాధించాడు. 21వ స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానాన్ని పొందగా... రికియార్డో (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలిచాడు. పదో ల్యాప్‌లో మాగ్నుసెన్ (రెనౌ) కారు ప్రమాదానికి గురి కావడంతో పది నిమిషాలపాటు రేసును నిలిపివేశారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ నాలుగో స్థానంలో, సెర్గియో పెరెజ్ ఐదో స్థానంలో నిలిచి మొత్తం 22 పాయింట్లను సొంతం చేసుకున్నారు. ఈ ఫలితంతో కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్‌లో ఫోర్స్ ఇండియా జట్టు 103 పాయింట్లతో నాలుగో స్థానానికి ఎగబాకింది. సీజన్‌లోని తదుపరి రేసు ఇటలీ గ్రాండ్‌ప్రి సెప్టెంబరు 4న జరుగుతుంది. -
మెరిసిన సెర్గియో పెరెజ్
► ఫోర్స్ ఇండియాకు మూడో స్థానం ► రోస్బర్గ్కే టైటిల్ ► యూరోపియన్ గ్రాండ్‌ప్రి బాకు (అజర్బైజాన్): ఈ సీజన్లో నిలకడగా రాణిస్తోన్న ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ మరోసారి మెరిశాడు. ఆదివారం జరిగిన యూరోపియన్ గ్రాండ్‌ప్రి రేసులో పెరెజ్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో ఫోర్స్ ఇండియా డ్రైవర్ టాప్-3లో నిలువడం ఇది రెండోసారి కావడం విశేషం. మొనాకో గ్రాండ్‌ప్రి రేసులోనూ పెరెజ్ మూడో స్థానాన్ని పొందాడు. మరోవైపు ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన నికో రోస్‌బర్గ్ (మెర్సిడెస్) ఆద్యంతం ఆధిపత్యం కనబరిచి విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో ఐదో విజయాన్ని సాధించాడు. 51 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 32 నిమిషాల 52.366 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ-1గం:33ని:09.062 సెకన్లు) రెండో స్థానంలో నిలువగా... పెరెజ్ (ఫోర్స్ ఇండియా-1గం:33ని:17.607 సెకన్లు) మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మొత్తం 22 మంది డ్రైవర్లలో నలుగురు (అలోన్సో, వెర్లిన్, కార్లోస్ సెయింజ్, క్వియాట్) మధ్యలోనే వైదొలిగారు. సీజన్లో ఎనిమిది రేసులు ముగిశాక రోస్‌బర్గ్ 141 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. హామిల్టన్ (మెర్సిడెస్-117 పాయింట్లు), వెటెల్ (ఫెరారీ-96 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి జులై 3న జరుగుతుంది. -
వెర్స్టాపెన్ సంచలనం
పిన్న వయస్సులో ఎఫ్1 టైటిల్ నెగ్గిన డ్రైవర్‌గా రికార్డు బార్సిలోనా: ఫార్ములావన్‌లో ఆదివారం పెను సంచలనం నమోదైంది. స్పెయిన్ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ జట్టుకు చెందిన 18 ఏళ్ల మాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. తద్వారా ఫార్ములావన్‌లో పిన్న వయస్సులో టైటిల్ సాధించిన క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. దాంతో వెటెల్ (21 ఏళ్ల 74 రోజులు; 2008లో ఇటలీ గ్రాండ్‌ప్రి) పేరిట ఉన్న ఈ రికార్డు తెరమరుగైంది. 66 ల్యాప్‌లు ఉన్న స్పెయిన్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ గంటా 41 నిమిషాల 40.017 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా నిలిచాడు. రైకోనెన్ (ఫెరారీ), వెటెల్ (ఫెరారీ) వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లలో పెరెజ్ ఏడో స్థానాన్ని సంపాదించగా... హుల్కెన్‌బర్గ్ 20వ ల్యాప్‌లో వైదొలిగాడు. మెర్సిడెస్ జట్టు స్టార్ డ్రైవర్లు హామిల్టన్, రోస్‌బర్గ్ తొలి ల్యాప్‌లోనే పరస్పరం ఢీకొట్టుకొని తప్పుకున్నారు. -
విజేత రోస్‌బర్గ్
సాఖిర్: బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో మెర్సిడెస్ జట్టుకు చెందిన నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన రేసులో రోస్‌బర్గ్ 57 ల్యాప్‌లను గంటా 33 నిమిషాల 34.696 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలోనూ రోస్బర్గ్కు టైటిల్ లభించింది. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ (మెర్సిడెస్) తొలి ల్యాప్‌లోనే వెనుకబడిపోయాడు. చివరికి మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. కిమీ రైకోనెన్ (ఫెరారీ)కు రెండో స్థానం లభించింది. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు టాప్-10లో నిలువలేకపోయారు. హుల్కెన్‌బర్గ్ 15వ, పెరెజ్ 16వ స్థానాలతో సరిపెట్టుకున్నారు. సీజన్‌లోని తదుపరి రేసు చైనా గ్రాండ్‌ప్రి ఈనెల 17న జరుగుతుంది. -
రోస్‌బర్గ్ బోణీ
► ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం ► హామిల్టన్‌కు రెండో స్థానం మెల్బోర్న్: ఫార్ములావన్ కొత్త సీజన్లోనూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో తొలి రెండు స్థానాలు మెర్సిడెస్ జట్టు డ్రైవర్లకే దక్కాయి. ఆదివారం జరిగిన ఈ రేసులో నికో రోస్‌బర్గ్ విజేతగా నిలువగా... ప్రస్తుత ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 57 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 48 నిమిషాల 15.565 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సాధించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ గంటా 48 నిమిషాల 23.625 సెకన్లలో లక్ష్యానికి చేరి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన రోస్‌బర్గ్ 23వ ల్యాప్‌లో ఆధిక్యంలోకి వచ్చి ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. రోస్బర్గ్కు 25 పాయింట్లు లభించాయి. 18 నెలల తర్వాత హామిల్టన్‌ను కాదని మరో డ్రైవర్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి రావడం ఇదే తొలిసారి. ఫోర్స్ ఇండియా జట్టుకు మిశ్రమ ఫలితాలు లభించాయి. హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానాన్ని పొందగా... మరో డ్రైవర్ పెరెజ్ 13వ స్థానంలో నిలిచాడు. ఈ రేసులో ఆరుగురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. తదుపరి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 3న జరుగుతుంది.