రోస్‌బర్గ్‌దే పైచేయి...
ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
మోంజా (ఇటలీ): సహచరుడు లూరుుస్ హామిల్టన్ చేసిన తప్పిదాన్ని పూర్తిస్థారుులో సద్వినియోగం చేసుకున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్‌లో ఏడో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి రేసులో రోస్‌బర్గ్ 53 ల్యాప్‌లను గంటా 17 నిమిషాల 28.089 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ రేసు మొదలైన రెండో క్షణంలోనే ఆరో స్థానానికి పడిపోయాడు.
దాంతో తొలి ల్యాప్‌లోనే రోస్‌బర్గ్ ఆధిక్యంలోకి వెళ్లాడు. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలిసారి ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్‌కు మూడో స్థానం దక్కింది. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లకు ఈ రేసు కలిసొచ్చింది. పెరెజ్ ఎనిమిదో స్థానంలో, హుల్కెన్‌బర్గ్ పదో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి ఈనెల 18న జరుగుతుంది.