Italian Grand Prix race
-
వెర్స్టాపెన్ను వరించిన అదృష్టం... సీజన్లో ఎనిమిదో ‘పోల్’
ఫార్ములావన్ (ఎఫ్1) ఇటాలియన్ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ వెర్స్టాపెన్ను అదృష్టం వరించింది. మోంజాలో శనివారం జరిగిన క్వాలిఫయింగ్ స్ప్రింట్ రేస్‌లో విజేతగా నిలిచిన బొటాస్ (మెర్సిడెస్)కు గ్రిడ్ పెనాల్టీ పడటంతో రెండో స్థానంలో నిలిచిన వెర్‌స్టాపెన్‌కు పోల్ పొజిషన్ లభించింది. దాంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును వెర్స్టాపెన్ తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. తాజా సీజన్లో వెర్‌స్టాపెన్‌కు ఇది ఎనిమిదో పోల్ కాగా... ఓవరాల్‌గా 11వది. 18 ల్యాప్‌ల పాటు జరిగిన క్వాలిఫయింగ్ స్ప్రింట్ రేస్‌ను బొటాస్ 27 నిమిషాల 54.078 సెకన్లలో పూర్తి చేశాడు. అయితే ఈ రేసు కోసం అతడు నిబంధనలకు విరుద్ధంగా నాలుగో ఇంజిన్‌ను తీసుకోవడంతో గ్రిడ్ పెనాల్టీ విధించారు. దాంతో బొటాస్ ఆదివారం జరిగే రేసును చివరి నుంచి ఆరంభిస్తాడు. -
రోస్‌బర్గ్‌దే పైచేయి...
ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం మోంజా (ఇటలీ): సహచరుడు లూరుుస్ హామిల్టన్ చేసిన తప్పిదాన్ని పూర్తిస్థారుులో సద్వినియోగం చేసుకున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఈ సీజన్లో ఏడో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి రేసులో రోస్‌బర్గ్ 53 ల్యాప్‌లను గంటా 17 నిమిషాల 28.089 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మరోవైపు ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన హామిల్టన్ రేసు మొదలైన రెండో క్షణంలోనే ఆరో స్థానానికి పడిపోయాడు. దాంతో తొలి ల్యాప్‌లోనే రోస్‌బర్గ్ ఆధిక్యంలోకి వెళ్లాడు. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తొలిసారి ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్‌కు మూడో స్థానం దక్కింది. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లకు ఈ రేసు కలిసొచ్చింది. పెరెజ్ ఎనిమిదో స్థానంలో, హుల్కెన్‌బర్గ్ పదో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు సింగపూర్ గ్రాండ్‌ప్రి ఈనెల 18న జరుగుతుంది.