ఫార్ములావన్ (ఎఫ్1) ఇటాలియన్ గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ వెర్‌స్టాపెన్‌ను అదృష్టం వరించింది. మోంజాలో శనివారం జరిగిన క్వాలిఫయింగ్ స్ప్రింట్ రేస్‌లో విజేతగా నిలిచిన బొటాస్ (మెర్సిడెస్)కు గ్రిడ్ పెనాల్టీ పడటంతో రెండో స్థానంలో నిలిచిన వెర్‌స్టాపెన్‌కు పోల్ పొజిషన్ లభించింది. దాంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును వెర్‌స్టాపెన్ తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు.
తాజా సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కు ఇది ఎనిమిదో పోల్ కాగా... ఓవరాల్‌గా 11వది. 18 ల్యాప్‌ల పాటు జరిగిన క్వాలిఫయింగ్ స్ప్రింట్ రేస్‌ను బొటాస్ 27 నిమిషాల 54.078 సెకన్లలో పూర్తి చేశాడు. అయితే ఈ రేసు కోసం అతడు నిబంధనలకు విరుద్ధంగా నాలుగో ఇంజిన్‌ను తీసుకోవడంతో గ్రిడ్ పెనాల్టీ విధించారు. దాంతో బొటాస్ ఆదివారం జరిగే రేసును చివరి నుంచి ఆరంభిస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment