హామిల్టన్: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో కరీబియన్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ (6/91) మ్యాజిక్‌ను చూపిస్తే... విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్ (4/23), టిమ్ సౌతీ (3/12) చుక్కలు చూపారు. దీంతో ఇరుజట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు (శనివారం) ఆటలో మొత్తం 17 వికెట్లు నేలకూలాయి. ఫలితంగా ఈ మ్యాచ్‌లో కివీస్ విజయం దిశగా పయనిస్తోంది. విండీస్ నిర్దేశించిన 122 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. ఫుల్టన్ (4), రూథర్‌ఫోర్డ్ (0) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు 156/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 117.3 ఓవర్లలో 349 పరుగులకు ఆలౌటైంది. దీంతో కరీబియన్ జట్టుకు 18 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. టేలర్ (264 బంతుల్లో 131; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) వరుసగా మూడోది, కెరీర్‌లో 11వ సెంచరీ సాధించాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 31.5 ఓవర్లలో కేవలం 103 పరుగులకే కుప్పకూలింది. స్యామీ (24) టాప్ స్కోరర్. వాగ్నేర్‌కు 2, అండర్సన్‌కు ఒక్క వికెటు దక్కింది.
విజయం దిశగా కివీస్
Published Sun, Dec 22 2013 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM
Advertisement