caribbean
-
హైతీ ప్రధాని రాజీనామా
పోర్టు ఆవ్ ప్రిన్స్: కరేబియన్ దేశం హైతీ ప్రధానమంత్రి ఆరియల్ హెన్రీ ఎట్టకేలకు పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. రాజధానిలోని 80శాతం పైగా సాయుధ ముఠాల చేతుల్లోకి వెళ్లిపోవడం, పలు ప్రభుత్వ కార్యాలయాలను ముఠాలు ఆక్రమించడం, అంతర్జాతీయంగా ఒత్తిళ్లు పెరగడంతో హెన్రీ ఈ మేరకు నిర్ణయించినట్లుగా భావిస్తున్నారు. హెన్రీ ప్రస్తుతం పొరుగుదేశం పోర్టోరికోలో ఉన్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం పోర్టు ఆవ్ ప్రిన్స్‌లోని విమానాశ్రయంలో ల్యాండయ్యేందుకు సాయుధ ముఠాలు అంగీకరించకపోవ డంతో దేశం వెలుపలే ఉండిపోయారు. 2021లో అప్పటి అధ్యక్షుడు జొవెనెల్ను సాయుధులు ఇంట్లో ఉండగా∙ చంపారు. అప్పటి నుంచి హెన్రీ ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
హైతీలో తీవ్ర అరాచకం
పోర్ట్ ఆవ్ ప్రిన్స్: కరేబియన్ దేశం హైతీలో అరాచకం రాజ్యమేలుతోంది. రాజధాని పోర్ట్ ఆవ్ ప్రిన్స్‌లోని జైలుపై సాయుధ దుండగులు ఆదివారం దాడులు చేశారు. అంతకుముందు పలు పోలీస్‌స్టేషన్లపైనా దాడులు చేశారు. జైలుపై దాడి ఘటనలో 12 మంది చనిపోగా, సుమారు 3,700 మంది ఖైదీలు పరారయ్యారు. అయితే, అధ్యక్షుడు మెయిజెను హత్య చేసిన కొలంబియా మాజీ సైనికులు సహా సుమారు 100 మంది ఖైదీలు జైలులోని తమ బ్యారక్‌లలోపలే ఉండిపోయారని సీఎన్ఎన్ తెలిపింది. బయటికొస్తే సాయుధ ముఠాలు చంపేస్తాయని వారంతా భయపడుతున్నట్లు పేర్కొంది. కాగా, రాజధాని పోర్ట్ ఆవ్ ప్రిన్స్ నగరాన్ని గుప్పెట పెట్టుకున్న ప్రధాన సాయుధ ముఠా ప్రధానమంత్రి ఆరియల్ హెన్రీ గద్దె దిగాలంటూ డిమాండ్ చేసింది. 2021లో అధ్యక్షుడు జొవెనెల్ మొయిజెను ఆయన నివాసంలో హత్య చేయడం వెనుక ఈ ముఠాయే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదివారం 72 గంటల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 2023లో హైతీలో సాయుధ ముఠాల హింసాత్మక చర్యల కారణంగా 8,400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస అంచనా. -
సాగర విలాసం.. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద నౌక
అది ప్రపంచంలోకెల్లా అతి పెద్ద విహార నౌక. పేరు ఐకాన్ ఆఫ్ ద సీస్. పొడవు 365 మీటర్లు. బరువు 2.5 లక్షల టన్నుల పై చిలుకు. 20 డెక్కులు, ప్రపంచంలోకెల్లా అతి పెద్ద వాటర్ పార్కు, స్విమింగ్ పూల్స్ వంటి లెక్కలేనన్ని ఆకర్షణలు దాని సొంతం. ఒక్క మాటలో చెప్పాలంటే అదో మినీ ప్రపంచం. కళ్లు చెదిరే స్థాయిలో సర్వ సదుపాయాలున్న ఈ లగ్జరీ క్రూయిజ్ ఆదివారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేసింది. జనవరి 10న అమెరికాలో మియామీ బీచ్‌లో అంగరంగ వైభవంగా జలప్రవేశం చేసింది. ఆదివారం నుంచే వారం రోజుల పాటు తొలి పర్యటనకు బయల్దేరుతోంది. కరీబియన్ దీవుల్ని చుడు తూ ప్రయాణం సాగనుంది. ఈ ట్రిప్‌కు టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడైనట్టు నిర్మాణ సంస్థ రాయల్ కరేబియన్ ప్రకటించింది. ఈ భారీ నౌకలో విశేషాలెన్నో... ► ఈ నౌక నిర్మాణానికి 200 కోట్ల డాలర్లకు పైగా ఖర్చయిందట. ఫిన్లండ్‌లోని మెయర్ తుర్క్ షిప్‌యార్డులో దీని నిర్మాణం జరిగింది. ► ఈ విలాస నౌక టైటానిక్ కంటే ఏకంగా ఐదు రెట్లు పెద్దది. ► ఇందులో ఏకంగా 7,960 మంది హాయిగా ప్రయాణించవచ్చు. 2,350 మంది సిబ్బందితో కలిపి దాదాపు 10 వేల మందికి పైగా పడతారు! ► 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతి పెద్ద వాటర్ పార్కు ఈ నౌక సొంతం. ► 16, 17 అంతస్తులను పూర్తిగా వాటర్ పార్కుకే కేటాయించారు. ► వాటిలో లెక్కలేనన్ని వాటర్ గేమ్స్‌ను ఆస్వాదించవచ్చు. ఒళ్లు గగుర్పొడిచే అడ్వెంచర్ గేమ్స్ కూడా ఉన్నాయట. ఇక ఏడు సువిశాలమైన స్విమ్మింగ్ పూల్స్ అదనపు ఆకర్షణ. ► మరీ గుండెలు తీసిన బంట్లయితే 20వ అంతస్తు నుంచి నేరుగా సముద్రంలోకి డైవింగ్ చేయడం వంటి పలు సాహసాలు కూడా చేయవచ్చు. ► ప్రత్యేకంగా రూపొందించిన ఐస్ ఎరీనాలో స్కేటింగ్ కూడా చేయవచ్చు! మినీ గోల్ఫ్ కోర్సూ ఉంది. ► పలు థీమ్ పార్కులు, సువిశాలమైన 40 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత రుచులన్నింటినీ ఆస్వాదించవచ్చు. వీటిలో 21 కాంప్లిమెంటరీ తరహావి. వాటిలో ఏం తిన్నా, తాగినా అంతా ఉచితమే. ► అత్యాధునిక సినిమా థియేటర్లలో సినిమాలు మొదలుకుని లైవ్ మ్యూజిక్ షోల దాకా అన్నీ అందుబాటులో ఉంటాయి. ► 55 అడుగుల ఎత్తైన ఇండోర్ జలపాతం నౌకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ► ఈ నౌకను పూర్తిగా కలియదిరిగి చూసేందుకే కనీసం 10 రోజులు పడుతుందట! ► ఆదివారం మొదలయ్యే తొలి ప్రయాణం కరేబియన్ దీవుల్లో బహమాస్, హోండురస్ల గుండా ఏడు రాత్రులు, ఆరు పగళ్లు సాగుతుంది. ► ఈ నౌక ప్రధానంగా లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)తో నడుస్తుంది. ► 90 శాతానికి పైగా తాగునీటి అవసరాలను ఆర్వో పద్ధతిలో సముద్ర జలాల ద్వారానే తీర్చుకుంటుంది. ► ఐకాన్ ఆఫ్ ద సీస్లో ప్రయాణానికి ఔత్సాహికులు ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. 2022 అక్టోబర్‌లో దీని తొలి ఫొటోలు బయటికి వచి్చనప్పటి నుంచే జనాలు విపరీతంగా ఆసక్తి చూపడం మొదలైంది. టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో పెట్టీ పెట్టడంతోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ► నిజానికిది రెండేళ్ల క్రితమే అందుబాటులోకి రావాల్సిందట. కరోనా కారణంగా ఆలస్యమైంది. ► ఇందులో రకరకాల ప్యాకేజీల్లో 2,805 గదులు, విశాలమైన లగ్జరీ కుపేలు అందుబాటులో ఉంటాయి. ► వాటి ఖరీదు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే! అతి తక్కువ ప్యాకేజీయే 3 వేల డాలర్ల (దాదాపు రూ.2.5 లక్షల) నుంచి మొదలవుతుంది. 2 లక్షల డాలర్లు, అంతకు మించిన ప్యాకేజీలూ ఉన్నాయి! ► ఐకాన్ ఆఫ్ ద సీస్‌ను కూడా తలదన్నే స్థా యిలో స్టార్ ఆఫ్ ద సీస్ పేరుతో మరో అతి విలాసమైన నౌకను నిర్మిస్తామని రా యల్ కరేబియన్ ఇప్పటికే ప్రకటించింది. ► దీనికి ముందు అతి పెద్ద లగ్జరీ నౌకగా రికార్డుకెక్కిన వండర్ ఆఫ్ ద సీస్‌ను కూడా రాయల్ కరేబియనే నిర్మించింది. దాని బరువు 2.35 లక్షల టన్నులు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హైతీలో 1,297కు చేరిన భూకంప మరణాలు
లెస్ కేయాస్ (హైతీ): కరీబియన్ దేశం హైతీలో శనివారం సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య ఆదివారానికి 1,297కు చేరింది. దాదాపు 5,700 మంది గాయపడగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. క్షతగాత్రులతో అక్కడి ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. మరోవైపు తీవ్ర తుపాను ప్రమాదం ఉందని ఆ దేశ వాతావరణ విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరోనా, అధ్యక్షుడి హత్య, సాయుధ ముఠాల ఘర్షణలు వంటి సమస్యలతో అల్లాడుతున్న హైతీకి భూకంపం, భారీ వర్షాలు పరిస్థితులను మరింత జఠిలం చేశాయి. -
హైతీని కుదిపేసిన భూకంపం
పోర్ట్ ఆవ్ ప్రిన్స్: కరీబియన్ దేశం హైతీలో శనివారం సంభవించిన తీవ్ర భూకంపంలో మృతుల సంఖ్య 724కు పెరిగింది. వందలాదిగా నివాసాలు ధ్వంసం కావడంతో మరో 2,800 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదు కాగా, అనంతర ప్రకంపనల భయంతో ప్రజలు ఇళ్లు వదిలి వీధుల్లోనే జాగారం చేస్తున్నారు. భూకంపంతో తీర పట్టణం లెస్‌కెస్‌తోపాటు గ్రాండ్ అన్స్, నిప్స్ ప్రాంతాల్లో తీవ్రంగా నష్టం వాటిల్లింది. స్థానిక ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. హైతీ ప్రధాని హెన్రీ నెల రోజులపాటు దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆదివారం రాత్రికి మరణాల సంఖ్య 724కు చేరిందని అధికారులు ప్రకటించారు. ఆస్పత్రులు, పాఠశాలలు, కార్యాలయాలు, చర్చిలు కలిపి 860 వరకు ధ్వంసం కాగా, మరో 700 భవనాలకు నష్టం వాటిల్లిందన్నారు. సహాయ సిబ్బంది, స్థానికులు కలిసి శిథిలాల కింద చిక్కుకున్న అనేక మందిని వెలికి తీయగలిగారు. ఇలా ఉండగా, మరో రెండు రోజుల్లో తుపాను ‘గ్రేస్’ హైతీని తాకనుందనే హెచ్చరికలతో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. -
రహానే శతకం
♦ కోహ్లి, ధావన్ అర్ధ సెంచరీలు ♦ భారత్ 310/5 ♦ విండీస్‌తో రెండో వన్డే పోర్ట్ ఆఫ్ స్పెయిన్: కరీబియన్ పర్యటనలో ఓపెనర్ అజింక్యా రహానే చెలరేగుతున్నాడు. తొలి వన్డేలో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న అతను ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో శతకం (104 బంతుల్లో 103; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) బాదాడు. అతడికి తోడు కెప్టెన్ కోహ్లి (66 బంతుల్లో 87; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శిఖర్ ధావన్ (59 బంతుల్లో 63; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించగా భారత్ 43 ఓవర్లలో ఐదు వికెట్లకు 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. జోసెఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. ఓపెనర్లు మెరిశారు: వరుసగా రెండో వన్డేలోనూ ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రహానే, ధావన్ మరోసారి దుమ్ము రేపే ఆరంభాన్ని అందించారు. ప్రారంభం నుంచే ఎదురుదాడికి దిగిన ఈ జోడి ఓవర్‌కు ఆరు పరుగుల రన్‌రేట్‌తో దూసుకెళ్లింది. మూడో ఓవర్లోనే రహానే సిక్స్ బాదగా ఆ తర్వాత ఓవర్లో ధావన్ వరుసగా రెండు ఫోర్లతో పాటు... హోల్డర్ వేసిన ఎనిమిదో ఓవర్లో మూడు ఫోర్లతో మెరిశాడు. 12వ ఓవర్లోనూ మూడు ఫోర్లతో చెలరేగిన ధావన్ 49 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అయితే స్పిన్నర్ నర్స్ బౌలింగ్‌లో కవర్స్ వైపు డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించిన ధావన్ క్రీజు వదిలి ముందుకు వచ్చి స్టంప్ అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. వీరిద్దరి మధ్య వరుసగా ఆరోసారి 50 ప్లస్ పరుగుల భాగస్వామ్యం నెలకొనడం విశేషం. ఆ వెంటనే రహానేతో జత కట్టిన కెప్టెన్ కోహ్లి కూడా ధాటిగా బ్యాటింగ్ చేశాడు. ఏమాత్రం ప్రభావం చూపని విండీస్ బౌలింగ్‌ను ఈ జోడి కూడా సులువుగానే ఎదుర్కొంది. రహానే 102 బంతుల్లో బౌండరీ ద్వారా విండీస్‌పై తొలి, కెరీర్లో మూడో శతకాన్ని నమోదు చేసుకున్నాడు. అయితే మరో రెండు పరుగుల అనంతరం రహానేను కమిన్స్ బౌల్డ్ చేయడంతో రెండో వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. పాండ్యా (4), యువరాజ్ (14) వికెట్లు కూడా త్వరగానే పడినా అటు కోహ్లి బాదుడు మాత్రం ఆగలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రహానే (బి) కమిన్స్ 103; ధావన్ (స్టంప్డ్) హోప్ (బి) నర్స్ 63; కోహ్లి (సి) నర్స్ (బి) జోసెఫ్ 87; హార్దిక్ పాండ్యా (సి) కమిన్స్ (బి) జోసెఫ్ 4; యువరాజ్ (సి) హోప్ (బి) హోల్డర్ 14; ధోని నాటౌట్ 13; జాదవ్ నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (43 ఓవర్లలో 5 వికెట్లకు) 310. వికెట్ల పతనం: 1–114, 2–211, 3–223, 4–254, 5–285. బౌలింగ్: జోసెఫ్ 8–0–73–2; హోల్డర్ 8.5–0–76–1; నర్స్ 9–0–38–1; బిషూ 9–0–60–0; కమిన్స్ 8–0–57–1; కార్టర్ 0.1–0–2–0. -
ప్రియురాలి బర్త్‌డే కోసం కరీబియన్‌కు..
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత లియోనార్డో డికాప్రియో కరీబియన్ దీవుల్లో ప్రత్యక్షం అయ్యారు. ఆయన తన గర్ల్‌ఫ్రెండ్, మోడల్ నైనా అగ్దాల్ (25) పుట్టిన రోజు వేడుకల అక్కడే ఘనంగా జరిపారు. మార్చి 26న ఆమె పుట్టిన రోజు కావడంతో కొంతమంది స్నేహితులతో కలిసి లియోనార్డోప్రత్యేక విమానంలో వెళ్లినట్లు ఓ ఆంగ్ల వెబ్సైట్ పేర్కొంది. ‘ఆయన ఇప్పుడే విమానంలో వెళ్లారు. అయితే, ఆ విమానం ఆయనది కాదు’ అని కూడా ఆ సైట్ పేర్కొంది. ఎంజెలీనాతో విడిపోయిన తర్వాత డికాప్రియో గత ఏడాది (2016) జూలై నుంచి నైనాతో ఆయన డేటింగ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఆయన 42వ పుట్టిన రోజు వేడుకలో ఫ్రాన్స్‌లోని ఓ దీవిలోగల రిసార్ట్‌లో ఇద్దరు కలిసి ఉన్నారు. -
భీకర తుపాన్.. 50 మందికి పైగా మృతి
-
భీకర తుపాన్.. 50 మందికి పైగా మృతి
పోర్ట్ ఆ ప్రిన్స్: కరీబియన్ దీవులపై హరికేన్ విరుచుకుపడింది. దీంతో 50 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ ఘటన కరీబియన్ దీవులలోని హైతీ తీరంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక అధికారుల కథనం ప్రకారం.. హైతీ మాథ్యూ అని పిలువబడే భీకరమైన తుపాన్ హైతీ దక్షిణాన ఉన్న రోచ్ ఎ బటియు నగరాన్ని తాకింది. ఈ నగరం మొత్తం తీరప్రాంతం కావడంతో తుపాన్ దాటికి జనం విలవిల్లాడిపోయారు. ఈ హైతీ తుపాన్ కారణంగా గత రెండు రోజులుగా 23గా ఉన్న మృతుల సంఖ్య 50కి చేరుకుందని అధికారులు భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగి అవకాశాలున్నాయని తెలిపారు. లెస్ కాయెస్ నుంచి టిబురాన్, పెర్రె లూయిస ఆస్టిన్ నగరాలు హరికేన్స్ వల్ల తీవ్రంగా నష్టపోయాయి. -
ఖేల్ కహానీ
అథ్లెటిక్స్ అందుబాటులో ఉన్న స్వర్ణాలు 47 రకరకాల క్రీడాంశాల సమాహారమే అథ్లెటిక్స్. ట్రాక్ అండ్ ఫీల్డ్, రోడ్, ఫీల్డ్ ఈవెంట్స్, వాకింగ్‌లో పోటీలు జరుగుతాయి. సమయం, కొలతలు, ఎత్తు, దూరం, ఫినిషింగ్ పొజిషన్లాంటి లెక్కలతో విజేతలను నిర్ణయిస్తారు. రిలే రేసులు మినహా మిగతా పోటీలన్నీ వ్యక్తిగత విభాగాల్లోనే జరుగుతాయి. ఏథెన్స్ (1896) ఒలింపిక్స్‌తో ఈ పోటీలకు కాస్త వెలుగు వచ్చింది. అప్పట్లో అథ్లెట్లు పరుగులు తీస్తుంటే లైన్ పక్కన నిల్చొని జడ్జీలు నిశితంగా పరిశీలించేవారు. అయితే ఆధునిక పోటీలకు సంబంధించిన నియమ నిబంధనలు వెస్ట్రన్ యూరోపియన్, నార్త్ అమెరికా నిర్దేశించాయి. తర్వాతి కాలంలో ఈ అథ్లెటిక్స్ను ప్రపంచ మొత్తం విస్తరింపజేశాయి. ఒలింపిక్స్‌లో మిగతా పోటీలతో పోలిస్తే అథ్లెటిక్స్‌కు చాలా ప్రత్యేకత ఉంటుంది. క్షణాల్లో తారుమారయ్యే ఫలితాలు, వాయువును మించిన వేగంతో దూసుకుపోయే అథ్లెట్లు, సింహంలా ఆమాంతం లంఘించే నేర్పర్లు, ఆకాశం అంచుల దాకా ఎగిరే జంపింగ్‌లు, అలసట లేకుండా కిలో మీటర్లు పరుగెత్తడం, సింగిల్ నైట్‌తో స్టార్లుగా మారే క్రీడాకారులు దీనిలోనే ఎక్కువగా కనిపిస్తారు. అథ్లెటిక్స్‌లో ప్రధానంగా 100 మీటర్ల పరుగుకు ప్రపంచంలో వ్యాప్తంగా ఎనలేని క్రేజ్ ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఒక్క ఈవెంట్ ఫలితాలే దేశాల చరిత్రను మార్చిన సందర్భాలు ఉన్నాయి. కరీబియన్లు కత్తులు షార్ట్ డిస్టెన్స్ పరుగులో కరీబియన్లు, అమెరికన్ల హవా ఎక్కువగా ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్‌లో మాత్రం ఆఫ్రికా అథ్లెట్ల హవా కొనసాగుతోంది. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో అమెరికా అథ్లెట్ల ఆధిపత్యం కనబడుతుంది. పోల్‌వాల్ట్, హైజంప్‌లో రష్యా పటిష్టంగా ఉంటుంది. షాట్‌పుట్, డిస్కస్ త్రో, ట్రిపుల్ జంప్, స్టీపుల్ ఛేజ్‌లో కొన్ని చిన్న దేశాలు కూడా విశేషమైన ప్రతిభను చూపుతున్నాయి. ఒకరిద్దరిపై స్వల్ప ఆశలు ఈసారి రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెటిక్స్ బృందం జాబితా పెద్దగానే ఉంది. పురుషుల్లో 20 మంది, మహిళల్లో 17 మంది తమ పతక అవకాశాలను పరీక్షించుకోనున్నారు. 100, 200, 800, 4ఁ400, మారథాన్, 20, 50 కి,మీ, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, 3వేల మీటర్ల స్టీపుల్ చేజ్లో మన అథ్లెట్లు తమ ప్రతిభ పాటవాలను చూపెట్టనున్నారు. వికాస్ గౌడ, సీమా అంటిల్ (డిస్కస్ త్రో), రంజిత్ మహేశ్వరి (ట్రిపుల్ జంప్), కవితా రౌత్, జైశా, సుధా సింగ్‌ల మారథాన్ బృందంలపై పతకం ఆశలు కొద్దిగా పెట్టుకోవచ్చు. -
లలిత్ మోదీ.. బ్రిటన్ టూ కరీబియన్!
లండన్:ఆర్థిక నేరారోపణలతో భారత్ నుంచి బ్రిటన్‌కు పారిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మాజీ చైర్మన్ లలిత్ మోదీ చట్టం నుంచి తప్పించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. భారత్ లో అతనిపై ఉచ్చు బిగుసుకోవడంతో బ్రిటన్ నుంచి కరీబియన్‌కు వెళ్లి అక్కడ పౌరసత్వాన్ని పొందేందుకు యత్నిస్తున్నారు. దీనిలో భాగంగా సెయింట్ లూసియా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ పెట్టుబడుల స్కీమ్ ద్వారా కరీబియన్ పౌరసత్వాన్ని పొందాలని భావిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత తక్కువ మొత్తంలో పన్ను చెల్లించే వెసులుబాటు సెయింట్ లూసియాలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. దాంతో పాటు సెయింట్ లూసియానాలో బ్యాంకింగ్ స్టాండర్డ్స్ అత్యంత గోప్యత కల్గి ఉండటం కూడా అక్కడ పౌరసత్వంపై మోదీ ఆసక్తి కనబరచడానికి మరో కారణం. తన కుటుంబంతో కలిసి సెయింట్ లూసియా పౌరసత్వానికి మోదీ దరఖాస్తు చేసినట్లు జాతీయ మీడియాలో వెలుగు చూసింది. కాగా, వివాదాస్పద లలిత్ మోదీ తమ దేశ పౌరసత్వానికి దరఖాస్తు చేయడంపై సెయింట్ లూసియా ఇంటర్ పోల్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అతనిపై ఏ విధమైన క్రిమినల్ కేసులు లేవని స్పష్టత వచ్చిన పక్షంలోనే తమ దేశ పౌరసత్వాన్ని ఇవ్వాలని సెయింట్ లూసియా భావిస్తోంది. -
1.13 లక్షల కోట్ల సంపదను కనుగొన్నారు..!
300 ఏళ్ల క్రితం కరీబియన్ సముద్రంలో మునిగిన స్పానిష్ నౌకను కొలంబియా గుర్తించింది. ఇందులో బంగారం, వెండి, రత్నాలతో కూడిన దాదాపు 1.13 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపద బయటపడింది. కొలంబియా అధ్యక్షుడు జాన్ మాన్యుల్ శాంటోస్ ఈ విషయాన్ని ప్రకటించారు. 'శుభవార్త. శాన్ జోస్ నౌకను మనం గుర్తించాం' అని శాంటోస్ ట్వీట్ చేశారు. సముద్రంలో అన్వేషణ బృందంతో కూడిన వీడియోను పోస్ట్ చేశారు. 1708లో జరిగిన యుధ్దంలో బ్రిటిష్ యుద్ధ నౌకలు.. శాన్ జోస్ నౌకను ధ్వంసం చేశాయి. కొలంబియా తీరంలో బయటపడిన ఈ సంపదపై అంతర్జాతీయ వివాదం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. శాన్ జోస్ కోసం అమెరికాకు చెందిన సీ సర్చ్ ఆర్మడా అనే సంస్ధ చాలా సంవత్సరాల నుంచి అన్వేషిస్తోంది. సముద్రంలో శాన్ జోస్ ఉన్న ప్రాంతాన్ని 1981లో కనుగొన్నామని ఎస్ఎస్ఏ వెల్లడించింది. ఎస్ఎస్ఏ గుర్తించిన సముద్ర ప్రాంతంలోకి కొలంబియా ప్రభుత్వం అక్రమంగా జొరబడిందని ఆరోపించింది. శాన్ జోస్ నౌకలో ఉన్న సంపద ఎవరికి చెందాలన్న విషయంపై న్యాయ పోరాటం నడుస్తోంది. ఎస్ఎస్ఏ ఇప్పటికే దీనిపై అమెరికా, కొలంబియా కోర్టుల్లో దావా వేసింది. సంపదను ఎస్ఎస్ఏకు, కొలంబియా ప్రభుత్వానికి చెరో 50 శాతం పంచాలని బరాన్క్విలా సర్క్యూట్ కోర్టు తీర్పు చెప్పినట్టు ఎస్ఎస్ఏ చెబుతోంది. కొలంబియా సుప్రీం కోర్టు కూడా ఈ తీర్పును సమర్థించినట్టు వెల్లడించింది. సంపదలో 35 శాతం ఇస్తామని, నౌక మునిగివున్న సముద్ర అంతర్భాగంలోకి అమెరికన్లను వెళ్లకుండా చూడాలన్న 1984 ఒప్పందాన్ని కొలంబియా ఉల్లంఘించిందని ఎస్ఎస్ఏ ఆరోపించింది. సంపద విలువ 4 నుంచి 17 బిలియన్ల డాలర్లు ఉండవచ్చని, అయితే కచ్చితంగా ఎంత విలువ చేస్తుందన్న విషయం ఎవరికీ తెలియదని ఎస్ఎస్ఏ పేర్కొంది. కాగా కొలంబియా సాంస్కృతిక శాఖ మంత్రి మరియన కొర్డొబో మాట్లాడుతూ.. కోర్టు తీర్పులన్నీ తమ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని చెప్పారు. ఇంతకీ ఈ సంపద ఎవరికి చెందుతుందో? -
అమ్మకానికి పౌరసత్వం..
డబ్బులకు కటకటలాడుతున్న కొన్ని కంట్రీలు నిధుల సమీకరణ కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం అత్యంత చౌకగా తమ దేశ పౌరసత్వాన్ని ఇచ్చేస్తామంటున్నాయి. తమ పాస్‌పోర్టు తీసుకుంటే బోలెడన్ని ప్రయోజనాలు ఉంటాయంటూ ఊదరగొడుతున్నాయి. మన దగ్గర ఒక మోస్తరు సిటీలో కాస్త మెరుగైన ఇల్లు కొనుక్కోవాలంటే.. అరవై, డెబ్భై లక్షల పైచిలుకు అవుతోంది. దాదాపు అంతే మొత్తానికి కొన్ని కరీబియన్, యూరోపియన్ దేశాలు ఏకంగా పౌరసత్వాన్నే ఇచ్చేస్తున్నాయి. తాజాగా యూరోపియన్ దేశం మాల్టా .. ఇలాగే సుమారు రూ. 5.5 కోట్లు కట్టిన వారికి తమ దేశ పౌరసత్వం ఇచ్చేస్తామంటూ ప్రకటించడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇంత డబ్బు కట్టి మాల్టా పాస్‌పోర్టు తీసుకున్న వారికి .. యూరోపియన్ యూనియన్‌లో 27 దేశాల్లో ఎక్కడైనా నివసించేందుకు అధికారాలు లభిస్తాయట. ఆఖరికి యూరోపియన్ పార్లమెంటు సభ్యులు అయ్యేందుకు కూడా హక్కులు లభిస్తాయట. ఇంత కన్నా చౌక ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 1. సుమారు 73,000 మంది జనాభా ఉండే డొమినికా కేవలం రూ. 60 లక్షలకు పౌరసత్వం ఇస్తోంది. దీనికోసం ఆ దేశానికి ప్రత్యేకంగా వెళ్లనక్కర్లేదు.. అక్కడే ఉండాలన్న నిబంధన కూడా ఉండదు. ఈ దేశం పాస్‌పోర్టు పొందిన వారు 50 దేశాలకు వీసా సమస్య లేకుండా వెళ్లొచ్చు. 2. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ది కూడా ఇదే ధోరణి. తమ దేశ చక్కెర మిల్లుల్లో రిటైరయిన ఉద్యోగుల నిధి కోసం దాదాపు రూ. 1.5 కోట్లు విరాళమిస్తే అక్కడి పౌరసత్వం ఇస్తామంటోంది. ఈ దేశ పాస్పోర్టుతో 139 దేశాలకు వీసాల్లేకుండా వెళ్లొచ్చు. 3. హంగరీలో రూ. 2 కోట్లతో ప్రత్యేక బాండు కొనుక్కుంటే నివసించేందుకు పర్మిట్ దొరుకుతుంది. 4. పోర్చుగల్‌లో రూ. 4 కోట్లు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తే రెసిడెన్సీ పర్మిట్ లభిస్తుంది. 5. ఇటీవల కొన్నాళ్ల కిందటి దాకా గ్రామీణ ప్రాంతాల్లో సుమారు రూ. 58 లక్షలతో ప్రాపర్టీ కొన్నా, సిటీల్లో రూ. 1.1 కోట్లు పెట్టి రియల్టీ కొన్నా లాత్వియా తమ దేశంలో అయిదేళ్లు నివసించేందుకు పర్మిట్ ఇచ్చేది. ప్రస్తుతం ఈ మొత్తాన్ని రూ. 2 కోట్ల పైచిలుకు పెంచేసింది. ఇలాగే, అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రియా తదితర దేశాలు కూడా తమ దేశంలో ఇన్వెస్ట్ చేస్తే పౌరసత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. కానీ, మిగతా చిన్నా, చితకా దేశాలతో పోలిస్తే వీటిలో నిబంధనలు, ఇన్వెస్ట్ చేయాల్సిన డబ్బు చాలా భారీ స్థాయిలో ఉంటుంది. -
విజయం దిశగా కివీస్
హామిల్టన్: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో కరీబియన్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ (6/91) మ్యాజిక్‌ను చూపిస్తే... విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్ (4/23), టిమ్ సౌతీ (3/12) చుక్కలు చూపారు. దీంతో ఇరుజట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు (శనివారం) ఆటలో మొత్తం 17 వికెట్లు నేలకూలాయి. ఫలితంగా ఈ మ్యాచ్‌లో కివీస్ విజయం దిశగా పయనిస్తోంది. విండీస్ నిర్దేశించిన 122 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. ఫుల్టన్ (4), రూథర్‌ఫోర్డ్ (0) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 156/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 117.3 ఓవర్లలో 349 పరుగులకు ఆలౌటైంది. దీంతో కరీబియన్ జట్టుకు 18 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. టేలర్ (264 బంతుల్లో 131; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) వరుసగా మూడోది, కెరీర్లో 11వ సెంచరీ సాధించాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 31.5 ఓవర్లలో కేవలం 103 పరుగులకే కుప్పకూలింది. స్యామీ (24) టాప్ స్కోరర్. వాగ్నేర్కు 2, అండర్సన్‌కు ఒక్క వికెటు దక్కింది.