రాజధానిలోని జైలుపై దాడి.. 3,700 మంది ఖైదీల పరారీ
ప్రధాని గద్దె దిగాలంటూ సాయుధ గ్రూపుల డిమాండ్
పోర్ట్ ఆవ్ ప్రిన్స్: కరేబియన్ దేశం హైతీలో అరాచకం రాజ్యమేలుతోంది. రాజధాని పోర్ట్ ఆవ్ ప్రిన్స్‌లోని జైలుపై సాయుధ దుండగులు ఆదివారం దాడులు చేశారు. అంతకుముందు పలు పోలీస్‌స్టేషన్లపైనా దాడులు చేశారు. జైలుపై దాడి ఘటనలో 12 మంది చనిపోగా, సుమారు 3,700 మంది ఖైదీలు పరారయ్యారు. అయితే, అధ్యక్షుడు మెయిజెను హత్య చేసిన కొలంబియా మాజీ సైనికులు సహా సుమారు 100 మంది ఖైదీలు జైలులోని తమ బ్యారక్‌లలోపలే ఉండిపోయారని సీఎన్‌ఎన్ తెలిపింది.
బయటికొస్తే సాయుధ ముఠాలు చంపేస్తాయని వారంతా భయపడుతున్నట్లు పేర్కొంది. కాగా, రాజధాని పోర్ట్ ఆవ్ ప్రిన్స్ నగరాన్ని గుప్పెట పెట్టుకున్న ప్రధాన సాయుధ ముఠా ప్రధానమంత్రి ఆరియల్ హెన్రీ గద్దె దిగాలంటూ డిమాండ్ చేసింది. 2021లో అధ్యక్షుడు జొవెనెల్ మొయిజెను ఆయన నివాసంలో హత్య చేయడం వెనుక ఈ ముఠాయే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదివారం 72 గంటల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 2023లో హైతీలో సాయుధ ముఠాల హింసాత్మక చర్యల కారణంగా 8,400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస అంచనా.
Comments
Please login to add a commentAdd a comment