Haiti
-
పేలిన ఆయిల్ ట్యాంకర్.. 25 మందికిపైగా మృతి
పోర్ట్ అవ్ ప్రిన్స్:హైతీలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతున్న ఇంధన ట్యాంకర్ పేలిపోయింది.తీర నగరం మిరాగానేలో శనివారం(సెప్టెంబర్14) ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మందికిపైగా దుర్మరణం పాలవ్వగా 50 మందికిపైగా గాయపడ్డారు. రోడ్డుపై వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ టైరు తొలుత పంక్చర్ అయింది. దీంతో ఆయిల్ కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ సమయంలో పేలుడు జరిగడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. పేలుడులో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం హెలికాప్టర్లో తరలించారు.ప్రమాద స్థలాన్ని ప్రధాని గ్యారీ కొనల్ పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ‘ఇది చాలా భయంకర ప్రమాదం. తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అత్యవసర బృందాలు పనిచేస్తున్నాయి’అని తెలిపారు. హైతీలో కొన్ని ప్రాంతాలు మిలిటెంట్ గ్యాంగుల ఆధీనంలో ఉండటంతో అత్యవసర వస్తువుల రవాణాకు రోడ్డు మార్గం కంటే నౌకలను ఎక్కువగా వాడుతుండడం గమనార్హం. ఇదీ చదవండి.. చమురు ట్యాంకర్‌కు మంటలు -
బోటులో అగ్నిప్రమాదం.. 40 మంది హైతీ పౌరులు మృతి
పోర్ట్ ఓ ప్రిన్స్ : హైతీ నుంచి 80 మంది శరణార్థులతో వెళుతున్న బోటు అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సమారు 40 మంది మృతి చెందారు. మరో 40 మందిని హైతీ రక్షక దళం కాపాడింది.హైతీలోని సెయింట్ మైఖేల్ నార్త్ నుంచి బయలుదేరిన ఈ పడవ కాయ్‌కోస్, టర్క్స్ ఐలాండ్‌కు వెళుతోంది. పడవలో ఉన్నవారు క్యాండిల్స్ వెలిగించారు.దీంతో ఈ మంటలు బోటులో ఉన్న పెట్రోల్ డ్రమ్ములకు అంటుకోవడంతో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. హైతీ గత కొంత కాలంగా సామాజిక, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో పౌరులు దేశం విడిచి వలస వెళుతున్నారు. -
ఇంటర్వ్యూ కోసం వెళ్తే.. కిడ్నాప్ చేశారు
ఈరోజుల్లో యూట్యూబర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. కొందరు జెన్యూన్‌గా సబ్ స్క్రైబర్లను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. మరికొందరు మాత్రం రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో.. కాస్త ఫేమ్ సంపాదించుకున్న ఓ యూట్యూబర్ సాహసం ప్రదర్శించబోయి చిక్కుల్లో పడ్డాడు. జార్జియాకు చెందిన యూట్యూబర్ అడిసన్ పీయెర్రె మాలౌఫ్(యూట్యూబ్‌లో YourFellowArab/Arab). ప్రపంచంలో ప్రమాదకరమైన ప్రాంతాలుగా పేరున్న చోట్లకు వెళ్తూ.. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తుల్ని ఇంటర్వ్యూలు చేస్తూ ఆ వీడియోలతో 1.4 మిలియన్ సబ్స్కయిబర్లను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో.. కరేబియన్ దేశం హైతీలో ఓ ముఠా నాయకుడ్ని ఇంటర్వ్యూ చేయాలని డిసైడ్ అయ్యాడు. మావోజో అనే ముఠా నాయకుడు జిమ్మీ ‘బార్బీక్యూ’ చెరిజైర్కు హైతీలోనే కరడుగట్టిన గ్యాంగ్ లీడర్‌గా పేరుంది. అలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి అడిసన్ వెళ్లాడు. ఇందుకోసం హైతీలో ఓ స్థానిక టూరిస్ట్ సాయం తీసుకున్నాడు. అయితే.. ఆ గ్యాంగ్ ఉండే ప్రాంతానికి వెళ్లగానే వాళ్లిద్దరినీ తుపాకులతో 400 మంది చుట్టుముట్టారు. వదిలిపెట్టాలంటే 6 లక్షల డాలర్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. this is the last footage arab uploaded for me before he got kidnapped pic.twitter.com/vRbYdarPn1 — masih (@VFXmasih) March 29, 2024 తన దగ్గరున్న 40 వేల డాలర్లను వాళ్లకు ఇచ్చేసి విడిచిపెట్టమని అడిసన్ బతిమాలాడట. అయితే ఆ ముఠా అవి లాగసుకుని.. మిగతాది ఇస్తేనే రిలీజ్ చేస్తామని షాకిచ్చింది ఆ గ్యాంగ్. దీంతో తన స్నేహితుల కాంటాక్ట్ కోసం అడిసన్ ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో.. మార్చి 14వ తేదీన అడిసన్ను మావోజో ముఠా కిడ్నాప్ చేయగా, రెండు వారాలు ఆలస్యంగా ఆ విషయం బయటి ప్రపంచానికి తెలిసిందే. తోటి యూట్యూబర్ ఒకరు ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని విడిపించేందుకు అవసరమైన డబ్బును సమీకరించేందుకు కొందరు యూట్యూబర్లు ముందుకు వచ్చారు. -
Haiti crisis: నేర ముఠాల గుప్పిట్లో హైతీ!
ఒక నేర ముఠా ఒక ప్రాంతాన్ని తన అధీనంలోకి తీసుకుని అరాచకం సృష్టిస్తే భద్రతాబలగాలు రంగంలోకి దిగి ఉక్కుపాదంతో అణచేయడం చాలా దేశాల్లో చూశాం. కానీ ఒక దేశం మొత్తమే నేర ముఠాల గుప్పెట్లోకి జారిపోతే ఎలా? హైతీ దేశ దుస్థితి చూస్తూంటే యావత్ ప్రపంచమే అయ్యో పాపం అంటోంది. పోర్ట్ ఎ ప్రిన్స్ రాజధానిసహా దేశాన్నే గడగడలాడిస్తున్న గ్యాంగ్‌లకు అసలేం కావాలి?. కెన్యా సాయం కోసం వెళ్లి రాజధాని ఎయిర్పోర్ట్ నేరముఠాలవశం కావడంతో స్వదేశం తిరిగిరాలేక అమెరికాలో చిక్కుకుపోయిన దేశ ప్రధాని ఏరియల్ హెన్రీ చివరకు పదవికి రాజీనామా చేశారు. దీంతో దేశ ప్రజల పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఇళ్ల నుంచి బయటకురావడానికే జనం భయపడుతున్నారు. హైతీలో ప్రధాన గ్యాంగ్‌లు ఎన్ని? హైతీలో దాదాపు 200 వరకు నేరముఠాలు ఉన్నాయి. అయితే మాజీ పోలీస్ అధికారి జిమ్మీ ‘బార్బెక్యూ’ చెరీజియర్ నేతృత్వంలోని జీ9 ఫ్యామిలీ అండ్ అలీస్ అలయన్స్, గేబ్రియల్ జీన్ పెర్రీ నేతృత్వంలోని జీపెప్ నేరముఠాలు ప్రధానమైనవి. ఇవి ప్రజలను హింసిస్తూ దేశాన్ని నరకానికి నకళ్లుగా మార్చేశాయి. రాజధాని సమీప ప్రాంతాలపై పట్టుకోసం చాన్నాళ్లుగా ఈ రెండు వైరి వర్గముఠాలు ప్రయత్నిస్తున్నాయి. ఎంతో మందిని సజీవ దహనం చేశాడని జిమ్మీని స్థానికంగా బార్బెక్యూ అని పిలుస్తుంటారు. నరమేధం, దోపిడీ, ఆస్తుల ధ్వంసం, లైంగిక హింసకు జీ9, జీపెప్ నేరముఠాలు పాల్పడ్డాయి. దీంతో ఈ ముఠా లీడర్ల లావాదేవీలు, కార్యకలాపాలపై ఐరాస, అమెరికా ఆంక్షలు విధించాయి. దీంతో రెండు గ్యాంగ్‌లు ఉమ్మడిగా ఒక ఒప్పందం చేసుకున్నాయి. కలిసి పనిచేసి ప్రధానిని గద్దెదింపేందుకు కుట్ర పన్నాయి. అసలు ఇవి ఎలా పుట్టుకొచ్చాయి? మురికివాడల్లో దారుణాలు చేశాడన్న ఆరోపణలపై జిమ్మీని పోలీస్ ఉద్యోగం నుంచి తీసేశాక నేరసామ్రాజ్యంలో అడుగు పెట్టాడు. దేశంలోని రాజకీయ పార్టీలు, నేతలు, పారిశ్రామికవేత్తలు తమ అనైతిక పనులకు అండగా ఉంటారని ఇలాంటి చిన్న చిన్న నేరగాళ్లను అక్కున చేర్చుకుని పెద్ద ముఠా స్థాయికి ఎదిగేలా చేశారు. 2021 జులైలో హత్యకు గురైన హైతీ మాజీ అధ్యక్షుడు జొవెనెల్ మొయిసెకు చెందిన పార్టీ హైతియన్ టెట్ కాలే(పీహెచ్‌టీకే)తో జిమ్మీకి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఒకానొక దశలో జిమ్మీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని మొయిసె భావించారు. జీపెప్ ముఠా సైతం విపక్ష పార్టీలతో అంటకాగింది. దీంతో ఆర్థికంగా, ఆయుధపరంగా రెండు ముఠాలు బలీయమయ్యాయి. హింస ఎప్పుడు మొదలైంది? హైతీ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ ‘పాపా డాక్’ డ్యువేలియర్, అతని కుమారుడు జీన్‌క్లాడ్ డ్యువేలియర్‌ల 29 ఏళ్ల నియంతృత్వ పాలనాకాలంలోనే ఈ గ్యాంగ్‌లు పురుడుపో సుకున్నాయి. డ్యువేరియర్లు ఒక సమాంతర మిలటరీ(టోంటోన్స్ మకౌటీస్)ని ఏర్పాటు చేసి వైరి పార్టీల నేతలు, వేలాది మంది సామాన్య ప్రజానీకాన్ని అంతమొందించారు. ‘హైతీలో నేరముఠాలకు దశాబ్దాల చరిత్ర ఉంది. కానీ ఇప్పుడున్న నేరముఠాల వైఖరి గతంతో పోలిస్తే దారుణం’ అని వర్జీనియా విశ్వవిద్యాలయ అధ్యాపకుడు, హైతీ వ్యవహారాల నిపుణుడు రాబర్ట్ ఫాటన్ విశ్లేషించారు. నేతలనూ శాసిస్తారు బెదిరింపులు, కిడ్నాప్‌లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా లతో నేరముఠాలు ఆర్థికంగా బలపడ్డాయి. ఆయుధాలను సమకూర్చుకున్నారు. గత వారం రాజధానిలోని రెండు జైళ్లపై అధునాతన డ్రోన్లతో దాడికి తెగబడ్డాయి. శిక్ష అనుభవిస్తున్న వేలాది మంది కరడుగట్టిన నేరగాళ్లను విడిపించుకు పోయారు. సాయుధముఠాలు ఇప్పుడు ఏకంగా రాజకీయపార్టీలు, నేతలనే శాసిస్తున్నాయి. పరిపాలన వాంఛ అక్రమ మార్గాల్లో సంపదను మూటగట్టుకున్న నేర ముఠాలు ఇప్పుడు రాజ్యాధికారంపై కన్నేశాయి. 2021లో దేశాధ్యక్షుడు మొయిసె హత్యానంతరం వీటి రాజకీయ డిమాండ్లు ఎక్కువయ్యాయి. ముఠాలు ప్రధాని హెన్రీని గద్దె దింపాయి. దేశాన్ని పాలిస్తానని బార్బెక్యూ జిమ్మీ పరోక్షంగా చెప్పాడు. అంతర్జాతీయంగా తన పేరు మార్మోగాలని విదేశీ మీడియాకు ఇంటర్వ్యూలిచ్చాడు. విదేశీ జోక్యం వద్దని, విదేశీ బలగాలు రావద్దని హుకుం జారీచేశాడు. ప్రస్తుత సంక్షోభాన్ని ఒంటిచేత్తో పరిష్కరిస్తానని ప్రకటించాడు. రాజకీయ శక్తులుగా ఎదిగితేనే తమ మనుగడ సాధ్యమని ముఠాలు భావిస్తున్నాయి. సంకీర్ణ బలగాలు వస్తున్నాయా? కెన్యా నేతృత్వంలోని సంకీర్ణ బలగాలను హైతీకి పంపించి సంక్షోభానికి ఫుల్స్టాప్ పెట్టాలని అమెరికాసహా పలుదేశాలు నిర్ణయించాయి. ఐరాస ఇందుకు అంగీకారం తెలిపింది. అయితే కెన్యా కోర్టుల జోక్యంతో ప్రస్తుతానికి ఆ బలగాల ఆగమనం ఆగింది. హైతీ ప్రధాని రాజీనామా నేపథ్యంలో నూతన ప్రభుత్వ కొలువు కోసం కౌన్సిల్ ఏర్పాటు, అన్ని భాగస్వామ్యపక్షాల సంప్రతింపుల ప్రక్రియ ముగిసేదాకా వేచిచూసే ధోరణిని అవలంబిస్తామని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో చెప్పారు. మరి కొద్దిరోజుల్లోనే ఎన్నికల కోసం కౌన్సిల్ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. మన వాళ్లను వెనక్కి రప్పిస్తాం: భారత విదేశాంగ శాఖ హైతీలో దాదాపు 90 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. వీరిలో డాక్టర్లు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు ఉన్నారు. 60 మంది ఇప్పటికే హైతీకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. హైతీలో భారతీయ రాయబార కార్యాలయం, కాన్సులేట్ లేవు. దీంతో సమీపాన ఉన్న డొమినికన్ రిపబ్లిక్ రాజధాని శాంటో డొమినిగోలోని ఇండియన్ మిషన్ ద్వారా హైతీలోని భారతీయులతో మోదీ సర్కార్ సంప్రతింపులు జరుపుతోంది. వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ శుక్రవారం ఢిల్లీలో చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హైతీ ప్రధాని రాజీనామా
పోర్టు ఆవ్ ప్రిన్స్: కరేబియన్ దేశం హైతీ ప్రధానమంత్రి ఆరియల్ హెన్రీ ఎట్టకేలకు పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. రాజధానిలోని 80శాతం పైగా సాయుధ ముఠాల చేతుల్లోకి వెళ్లిపోవడం, పలు ప్రభుత్వ కార్యాలయాలను ముఠాలు ఆక్రమించడం, అంతర్జాతీయంగా ఒత్తిళ్లు పెరగడంతో హెన్రీ ఈ మేరకు నిర్ణయించినట్లుగా భావిస్తున్నారు. హెన్రీ ప్రస్తుతం పొరుగుదేశం పోర్టోరికోలో ఉన్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం పోర్టు ఆవ్ ప్రిన్స్‌లోని విమానాశ్రయంలో ల్యాండయ్యేందుకు సాయుధ ముఠాలు అంగీకరించకపోవ డంతో దేశం వెలుపలే ఉండిపోయారు. 2021లో అప్పటి అధ్యక్షుడు జొవెనెల్ను సాయుధులు ఇంట్లో ఉండగా∙ చంపారు. అప్పటి నుంచి హెన్రీ ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
హైతీలో తీవ్ర అరాచకం
పోర్ట్ ఆవ్ ప్రిన్స్: కరేబియన్ దేశం హైతీలో అరాచకం రాజ్యమేలుతోంది. రాజధాని పోర్ట్ ఆవ్ ప్రిన్స్‌లోని జైలుపై సాయుధ దుండగులు ఆదివారం దాడులు చేశారు. అంతకుముందు పలు పోలీస్‌స్టేషన్లపైనా దాడులు చేశారు. జైలుపై దాడి ఘటనలో 12 మంది చనిపోగా, సుమారు 3,700 మంది ఖైదీలు పరారయ్యారు. అయితే, అధ్యక్షుడు మెయిజెను హత్య చేసిన కొలంబియా మాజీ సైనికులు సహా సుమారు 100 మంది ఖైదీలు జైలులోని తమ బ్యారక్‌లలోపలే ఉండిపోయారని సీఎన్ఎన్ తెలిపింది. బయటికొస్తే సాయుధ ముఠాలు చంపేస్తాయని వారంతా భయపడుతున్నట్లు పేర్కొంది. కాగా, రాజధాని పోర్ట్ ఆవ్ ప్రిన్స్ నగరాన్ని గుప్పెట పెట్టుకున్న ప్రధాన సాయుధ ముఠా ప్రధానమంత్రి ఆరియల్ హెన్రీ గద్దె దిగాలంటూ డిమాండ్ చేసింది. 2021లో అధ్యక్షుడు జొవెనెల్ మొయిజెను ఆయన నివాసంలో హత్య చేయడం వెనుక ఈ ముఠాయే ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదివారం 72 గంటల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. 2023లో హైతీలో సాయుధ ముఠాల హింసాత్మక చర్యల కారణంగా 8,400 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస అంచనా. -
ఘోరం ప్రమాదం: చూస్తుండగానే 50 మంది సజీవ దహనం
పోర్ట్–ఔ–ప్రిన్స్: తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటున్న హైతీలో పెను విషాదం చోటుచేసుకుంది. పెట్రోల్ ట్యాంకర్ పేలిన ఘటనలో 53 మంది సజీవ దహనమయ్యారు. 100 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. కాప్–హైతియన్ నగరంలో సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగిందని నగర డిప్యూటీ మేయర్ పాట్రిక్ అల్మోనార్ చెప్పారని అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. సంఘటనస్థలం నుంచి మంటలు చుట్టుపక్కలున్న మరో 20 గృహాలకు వ్యాపించడంతో అందులోని వారూ సజీవ దహనమయ్యారు. ట్యాంకర్ నుంచి లీకవుతున్న పెట్రోల్‌ను పట్టుకునేందుకు జనం బకెట్లతో ఎగబడినపుడు మంటలు అంటుకుని ట్యాంకర్ పేలిందని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. చదవండి: మాజీ ప్రియురాలు ఫోన్ అన్‌లాక్ చేసి... ఏకంగా రూ 18 లక్షలు కొట్టేశాడు!! -
Photo Feature: ట్రాఫిక్ తిప్పలు.. చిన్నారుల సాహసం
ఆ ఊరి పిల్లలు స్కూల్‌కు వెళ్లాలంటే పెద్ద సాహసమే చేయాలి. ఎందుకంటే చిన్నారులు చదువు కోసం వాగు దాటి వెళ్లాలి. ఇక పెద్ద నగరాల్లో ట్రాఫిక్ తిప్పలు నిత్యకృత్యంగా మారాయి. ఏళ్లకేళ్లుగా అన్నదాతల ఆక్రందనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జహీరాబాద్‌లో చెరుకు రైతులు రోడ్డెక్కారు. మరోవైపు దేశవ్యాప్తంగా దసరా పండుగ సన్నాహాలు మొదలయ్యాయి. ఇలాంటి మరిన్ని ‘చిత్ర’ వార్తలు ఇక్కడ చూడండి. జహీరాబాద్‌లోని ట్రైడెంట్ చక్కెర కర్మాగారంలో ఈ సీజన్లో చెరకు క్రషింగ్ చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ర్యాలీ చేపట్టి పట్టణ బంద్ నిర్వహించారు. ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి రైతులు ర్యాలీగా హుగ్గెళ్లి వరకు వెళ్లి తిరిగి అంబేడ్కర్ చౌక్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా 65వ జాతీయ రహదారిపై మూడు గంటల పాటు బైఠాయించి రైతులు నిరసన తెలిపారు. క్రషింగ్ చేపట్టకపోతే ఆందోనళలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బుధవారం తిరుమల శ్రీవారి ఆలయంపై దట్టంగా మేఘాలు కమ్ముకుని ఇలా కనువిందు చేశాయి. బడికి వెళ్లాలంటే ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు దాటాల్సిందే. చదువు కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఇలా బడికి వెళ్తున్నారు ఆ చిన్నారులు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నారాయణపూర్‌లోని విజయనగర్ కాలనీకి చెందిన విద్యార్థులు నాగసముద్రాల గ్రామంలోని మోడల్ స్కూల్లో చదువుకుంటున్నారు. అయితే ఊరు నుంచి పాఠశాలకు వెళ్లాలంటే వాగు దాటాల్సి ఉంటుంది. ఇక్కడ హై లెవల్ వంతెన నిర్మించాలని గ్రామస్తులు ఎంత మొరపెట్టుకున్నా.. పట్టించుకునేవారు లేరు. – కోహెడరూరల్ (హుస్నాబాద్) హైదరాబాద్‌లో ట్రాఫిక్ తిప్పలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. బండి బయటకు తీయాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాక అయినా ట్రాఫిక్ జామ్ సమస్యలు తగ్గుతాయని భావించారు. కానీ పరిస్థితి మారడం లేదు. కూకట్‌పల్లిలో భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యం ఇది. దసరా నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్నందున ముంబైలోని చించ్‌పోక్లీలో దేవతా విగ్రహాలకు మెరుగులు దిద్దుతున్న కళాకారుడు. కార్డెలియా క్రూయిజ్ షిప్లో ముంబై నుంచి లక్షద్వీప్‌కు వెళ్తున్న పర్యాటకులకు కొచ్చిలో కేరళ టూరిజం ఈవెంట్లో భాగంగా స్వాగతం పలుకుతున్న కళాకారులు. మహారాష్ట్ర థానేలోని మజివాడ నాకా సమీపంలోని ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవేపై బుధవారం నెలకొన్న టాఫిక్ రద్దీ. భారత్‌లో అత్యంత పురాతనమైన చేరమాన్ జుమా మసీదు ఇది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఇది ఉంది. క్రీస్తు శకం 629లో నిర్మించిన దీనికి మరమ్మతులు చేపట్టి, తిరిగి తెరచేందుకు సిద్ధం చేస్తున్నారు. సముద్రంలో మరణించిన ఓ తిమింగల కళేబరం అలల ధాటికి ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది. ఈ దృశ్యం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఉన్న వాసాయ్ బీచ్‌లో బుధవారం కనిపించింది. తమ దేశంలోని హైతియన్లను అమెరికా ఓ విమానం ద్వారా హైతీకి పంపింది. వారు అక్కడ దిగాక, తిరిగి అదే విమానం ఎక్కి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యం. -
రికార్డుల పట్టుగొమ్మ.. అదిరిందమ్మా!
ఎన్ని చెర్రీ టమాటాలో.. లెక్కేస్తే.. 839 తేలాయి.. అయితే.. ఇక్కడ కళ్లు తేలేసే విషయమొకటి ఉంది.. ఇవన్నీ కేవలం ఒకే కొమ్మకు కాసినవి.. ఈ విషయం వినగానే.. గిన్నిస్ వాళ్లు కూడా మొదట కళ్లు తేలేసి.. తర్వాత తేరుకుని.. లెక్కలేయడానికి బయలుదేరి వస్తున్నారట. ఇంతకీ ఈ భారీ కాతకు కారణమైన వ్యక్తి పేరు చెప్పలేదు కదూ.. డగ్లస్ స్మిత్.. బ్రిటన్‌లోని స్టాన్స్టెడ్ అబట్స్ గ్రామంలో ఉంటాడు. వీటిని తెంపడానికి గంట సమయం పట్టిందట. గత రికార్డు 488 టమాటాలట. వలసదారులపై కొరడా మెక్సికో మీదుగా టెక్సాస్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సుమారు 12వేల హైతీ వలసదారులను అమెరికా అధికారులు విమానాల ద్వారా వెనక్కి పంపించి వేస్తున్నారు. సరిహద్దులు దాటి వస్తున్న వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మెక్సికో–అమెరికా సరిహద్దుల్లోని రియో గ్రాండే నది వద్ద వలసదారులను అడ్డుకుంటున్న అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు. అందాల జాబిలి నీలి వర్ణం పూసుకున్న ఆకాశంలో స్పష్టమైన కాంతులీనుతున్న పున్నమి చంద్రుడు. ఈ ఫొటోను జర్మనీలోని తౌనుస్ ప్రాంతంలో తీశారు. (చదవండి: రియల్ ‘బాహుబలి’.. కటౌట్ చూసి నమ్మేయాల్సిందే!) -
హైతీలో 1,297కు చేరిన భూకంప మరణాలు
లెస్ కేయాస్ (హైతీ): కరీబియన్ దేశం హైతీలో శనివారం సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య ఆదివారానికి 1,297కు చేరింది. దాదాపు 5,700 మంది గాయపడగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. క్షతగాత్రులతో అక్కడి ఆస్పత్రులన్నీ నిండిపోయాయి. మరోవైపు తీవ్ర తుపాను ప్రమాదం ఉందని ఆ దేశ వాతావరణ విభాగం అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కరోనా, అధ్యక్షుడి హత్య, సాయుధ ముఠాల ఘర్షణలు వంటి సమస్యలతో అల్లాడుతున్న హైతీకి భూకంపం, భారీ వర్షాలు పరిస్థితులను మరింత జఠిలం చేశాయి. -
హైతీని కుదిపేసిన భూకంపం
పోర్ట్ ఆవ్ ప్రిన్స్: కరీబియన్ దేశం హైతీలో శనివారం సంభవించిన తీవ్ర భూకంపంలో మృతుల సంఖ్య 724కు పెరిగింది. వందలాదిగా నివాసాలు ధ్వంసం కావడంతో మరో 2,800 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదు కాగా, అనంతర ప్రకంపనల భయంతో ప్రజలు ఇళ్లు వదిలి వీధుల్లోనే జాగారం చేస్తున్నారు. భూకంపంతో తీర పట్టణం లెస్‌కెస్‌తోపాటు గ్రాండ్ అన్స్, నిప్స్ ప్రాంతాల్లో తీవ్రంగా నష్టం వాటిల్లింది. స్థానిక ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. హైతీ ప్రధాని హెన్రీ నెల రోజులపాటు దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆదివారం రాత్రికి మరణాల సంఖ్య 724కు చేరిందని అధికారులు ప్రకటించారు. ఆస్పత్రులు, పాఠశాలలు, కార్యాలయాలు, చర్చిలు కలిపి 860 వరకు ధ్వంసం కాగా, మరో 700 భవనాలకు నష్టం వాటిల్లిందన్నారు. సహాయ సిబ్బంది, స్థానికులు కలిసి శిథిలాల కింద చిక్కుకున్న అనేక మందిని వెలికి తీయగలిగారు. ఇలా ఉండగా, మరో రెండు రోజుల్లో తుపాను ‘గ్రేస్’ హైతీని తాకనుందనే హెచ్చరికలతో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. -
భారీ భూకంపం.. శవాల దిబ్బగా హైతీ
భారీ భూకంపంతో కరేబియన్ దేశం హైతీ ఘోరంగా వణికిపోయింది. శనివారం సంభవించిన భూకంపం దాటికి మృతుల సంఖ్య 724 కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఎటుచూసినా భవనాలు కుప్పకూలి కనిపిపస్తుండడంతో క్షతగాత్రుల సంఖ్య ఊహించని రీతిలో ఉండేలా కనిపిస్తోంది. శనివారం హైతీలో భారీ భూకంపం చోటు చేసుకుంది. భూకంప తీవ్రత 7.2గా నమోదు అయినట్లు తెలుస్తోంది. వందల్లో భవనాలు కుప్పకూలగా.. శవాలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా 304కు మృతదేహాలను సహాయక సిబ్బంది, స్థానికులు వెలికి తీశారు. రెండు వేల మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Viewer Discretion: First heart-stopping images of children, babies being rescued by caring Good Samaritans, stepping up to save their neighbor. 💔 #Haiti #earthquake pic.twitter.com/1pYiyZ6Bdx — Calvin Hughes (@CalvinWPLG) August 14, 2021 రాజధాని పోర్టౌ ప్రిన్స్‌కు పశ్చిమంగా 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదు అయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే హైతీ సివిల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ సహాయక చర్యల్లోకి దిగింది. ప్రకృతి విలయంపై ప్రధాని ఏరియెల్ హెన్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నెలపాటు దేశ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పరిస్థితిని సమీక్షంచాకే .. అంతర్జాతీయ సమాజ సాయం కోరతామని వెల్లడించారు. Self-organized community brigades in Okay, #Haiti continue to search for survivors in rubble in wake of 7.2 earthquake that struck the region earlier today. pic.twitter.com/i1M6nlUzr5 — HaitiInfoProj (@HaitiInfoProj) August 14, 2021 కాగా, 2010లో హైతీలో సంభవించిన భారీ భూకంపం కారణంగా.. మూడు లక్షల మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. తాజా భూకంప పరిణామాల నేపథ్యంలో అమెరికా సహాయక విభాగం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. కాగా, మరింత సమాచారం అందాల్సి ఉంది. My biggest concern is not just for the country but the safety and well being of my momma and papa. Please keep Aiyti in your thoughts and prayers during these times 🇭🇹❤️💙 #Haiti #Tsunami #Ayiti pic.twitter.com/BCTweHve1h — Hustling & Healing (@HustlinNHealin) August 14, 2021 -
‘నా భర్తతో పాటే నేను చనిపోయాననుకున్నారు.. ఎన్నికల్లో పోటీ చేస్తా’
వాషింగ్టన్: ఈ నెల ప్రారంభంలో(జూలై 7) హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిజ్‌ను తన అధికారిక నివాసంలో గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. దాడిలో గాయపడ్డ అధ్యక్షుడు మోయిజ్ భార్య ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆమె న్యూయార్క్‌టైమ్స్‌తో మాట్లాడారు. హంతకులు అధ్యక్షుడి నివాసంలో దేని కోసం వెతికారు.. తాను ఇంకా సజీవంగా ఉన్నానో, లేదో తెలుసుకోవడానికి వారు చేసిన ప్రయత్నాల గురించి ఆమె ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సందర్భంగా మార్టిన్ మోయిజ్ మాట్లాడుతూ.. ‘‘నేను చనిపోయానని భావించి.. వారు నన్ను వదిలేశారు. నా భర్త చుట్టూ ఎప్పుడు 30-50 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అంత మంది ఉండగానే నా భర్తను చంపేశారు. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. నా భర్త సెక్యూరిటీ గార్డుల్లో ఒక్కరు కూడా చనిపోలేదు.. కనీసం తీవ్రంగా గాయపడలేదు కూడా. వ్యవస్థే నా భర్తను పొట్టన పెట్టుకుంది’’ అని ఆరోపించారు. మార్టిన్ మాట్లాడుతూ.. ‘‘ఘటన జరిగే సమయానికి మేం గాఢ నిద్రలో ఉన్నాం. తుపాకుల మోత విని లేచాం. వెంటనే సహాయం కోసం నా భర్త తన భద్రతా బృందాన్ని పిలిచాడు. ఆలోపే వారు మా బెడ్రూంలోకి చొరబడి కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నా భర్త చనిపోయాడు.. నా చేతికి, మోచేయికి దెబ్బ తగిలింది. ఓ పక్క తీవ్ర రక్తస్రావం.. మరోవైపు ఊపిరాడనట్లు అనిపించింది. ఇక హంతకులు స్పానిష్‌లో మాత్రమే మాట్లాడారు (హైతీ అధికారిక భాషలు క్రియోల్, ఫ్రెంచ్). హంతకులు దాడి చేసినప్పుడు ఎవరితోనో ఫోన్ ద్వారా కమ్యూనికేట్ అయ్యారు. హంతకులు మా గది నుంచి ఏమి తీసుకున్నారో నాకు తెలియదు.. కానీ నా భర్త ఫైల్స్ ఉంచే షెల్ఫ్ని గాలించారు’’ అని తెలిపారు. మార్టిన్ మాట్లాడుతూ.. ‘‘నా భర్తను హత్య చేసిన వారు నేను భయపడాలని.. రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ వారి ఆశలు నెరవేరవు. నేను కోలుకున్న తర్వాత అధ్యక్ష పదవికి పోటీ చేస్తాను. నా భర్తను చంపిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. లేదంటే వారు అధికారం చేపట్టిన ప్రతి ఒక్క అధ్యక్షుడిని చంపుతారు. నా భర్తను హత్య చేసిన దుండగులను శిక్షించకపోతే.. ఇప్పుడు జరిగిన దారుణం మళ్లీ మళ్లీ జరుగుతుంది’’ అన్నారు. 53 ఏళ్ల వయసున్న మోయిజ్ 2017లో అధికారంలోకి వచ్చారు. అప్పట్నుంచి ఆయన తన అధికారాన్ని పెంచుకునే ప్రయత్నాలే చేశారు. కోర్టులు, ప్రభుత్వ కాంట్రాక్టర్లు, ఆడిటర్లు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కేవలం అధ్యక్షుడికే జవాబుదారీలా ఉండేలా నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ఎన్నికలు నిర్వహించడంలో ఆయన విఫలమయ్యారు. దీంతో అధ్యక్షుడిపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. విపక్ష నేతలు ఆయన గద్దె దిగాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. -
హైతీ అధ్యక్షుడి హత్య కేసులో కీలక సూత్రధారి అరెస్టు
Port-Au-Prince: కరేబియన్ దేశమైన హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిస్ హత్యతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడిన సంగతి తెలిసిందే. మోయిస్ హత్య వెనుక కీలక సూత్రధారిని అరెస్టు చేసినట్లు హైతీలోని అధికారులు సోమవారం తెలిపారు. ఈ ఘటనపై హైతీ పోలీసు అధికారి లియోస్ చార్లెస్ మాట్లాడుతూ.. క్రిస్టియన్ ఇమ్మాన్యుయేల్ సనోన్ (63) రాజకీయ ప్రయోజనాల కోసం ఓ ప్రైవేట్ విమానంలో పలువురు కొలంబియన్లతో హైతీలోకి ప్రవేశించాడని పేర్కొన్నారు. ఇక ఈ హత్యకు సంబంధించి గత వారం రోజుల నుంచి కనీసం పద్దెనిమిది కొలంబియన్ పౌరులను అరెస్టు చేసినట్లు తెలిపారు. అధ్యక్షుడిని చంపే కుట్ర వెనుక మరో ఇద్దరు సూత్రధాలు కూడా ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఓ ముగ్గురు హైతీ అమెరికన్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో సనోన్ దేశంలోకి ప్రవేశించాడని, అతడి ఇంటి వద్ద పెద్ద ఎత్తున తుపాకులు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మోయిస్ భార్య మార్టైన్ మోయిస్‌ను మయామి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న క్లౌండ్ జోసెఫ్.. తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. -
Haiti: రాజకీయ స్థిరత్వం లేని నెత్తుటి నేల
లాటిన్ అమెరికాలో భాగంగా.. కరేబియన్ దీవుల్లో వలస పాలన నుంచి విముక్తి పొందిన తొలి దేశంగా హైతీకి ఓ గుర్తింపు ఉంది. అయితే స్వేచ్ఛా దేశం అనేపేరే తప్పించి.. ఏనాడూ ఆ గడ్డ ప్రశాంతంగా ఉండింది లేదు. హింస, దురాక్రమణలు, రాజకీయ సంక్షోభం, ప్రజల తిరుగుబాటు, అణచివేతలు, పేదరికం, తిరుగుబాటుదారుల మారణ హోమాలు హైతీని నెత్తుటి నేలగా మార్చేశాయి. తాజాగా ఏకంగా అధ్యక్షుడు జోవెనెల్ మోయిస్ హత్యతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. వెబ్‌డెస్క్: ఆఫ్రికన్ జాతులతో విరజిల్లుతున్న కరేబియన్ సముద్రపు హిస్పనియోల దీవుల్లో.. ఇటలీ నావికాన్వేషకుడు క్రిస్టోఫర్ కొలంబస్ అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఈ భూభాగంలో స్పెయిన్ కాలనీలు వెలిశాయి. రెండు వందల ఏళ్ల తర్వాత పశ్చిమం వైపు సగ భాగాన్ని ఫ్రాన్స్ చేజిక్కిచ్చుకుంది. అప్పటి నుంచి వాళ్లను బానిసలుగా మార్చుకుని షుగర్, రమ్, కాఫీ ఉత్పత్తులను ఫ్రాన్స్‌కు అక్రమంగా తరలించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో వాళ్లు దారుణమైన హింసను చవిచూశారు. 1801లో.. టౌస్సెయింట్ లోవెర్టర్ తిరుగుబాటుతో బానిసత్వాన్ని రద్దు చేశారు. ఆపై 1804లో ఫ్రాన్స్ నుంచి విముక్తి పొంది హైతీ స్వతంత్ర్య దేశంగా ఆవిర్భవించింది. బానిస బతుకుల విముక్తి కోసం పోరాడిన జీన్ జాక్వెస్ డెస్సాలైన్స్ తొలి అధ్యక్షుడు అయ్యాడు. కానీ, రెండేళ్లకే అతన్ని దారుణంగా హత్య చేశారు(వాళ్లెవరో ఇప్పటిదాకా తెలియదు). ఆపై వంద సంవత్సరాలపాటు అంతర్యుద్దంతో నలిగిపోయిన హైతీలో 1915లో అమెరికా సైన్యం అడుగుపెట్టింది. అయితే 1943లో తమ దళాలను వెనక్కి తీసుకున్నప్పటికీ.. ఇప్పటికీ ఆర్థిక, రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకుంటూ వస్తోంది. దాయాదిగా పొరుగు దేశం! పొరగున ఉండే డొమినికన్ రిపబ్లిక్‌తో 1937లో హైతీకి శత్రుత్వం మొదలైంది. సరిహద్దు విషయంలో జరిగిన గొడవలతో అప్పటి డొమినికా నియంతాధ్యక్షుడు టట్రుజిల్లో నర మేధానికి ఆదేశాలిచ్చాడు. దీంతో సరిహద్దులో నివసిస్తున్న హైతీ ప్రజల్ని.. డొమినికా సైన్యం ఊచకోత కోసింది. ఆ తర్వాత కాల్పులు తగ్గుముఖం పట్టినప్పటికీ .. సరిహద్దు ఒప్పందాలు మాత్రం కొనసాగుతున్నాయి. సైన్యం తిరుగుబాటులు 1957లో హైతీ రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. దీంతో అప్పటి సైన్యాధ్యక్షుడు ఫ్రాన్కోయిస్ పాపా డాక్ డువెలైర్.. మిలిటరీ సాయంతో అధికార పీఠాన్ని చేజిక్కించుకున్నాడు. ఆ పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన ఎవరూ ఊహించని స్థాయిలో జరిగింది. చివరికి అంతర్జాతీయ సమాజం విమర్శలకు తలొగ్గి, టోంటోన్ మాకౌట్స్ రహస్య బృందాలకు భయపడి డువెలైర్ కొంచెం తగ్గాడు. 1964లో తనను తాను అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించుకున్నాడు. అతని మరణం తర్వాత కొడుకు జీన్ కౌడ్(బేబీ డాక్) అధ్యక్షుడు అయ్యాడు. అతని పాలనలో ప్రజలు నరకం అనుభవించారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఫ్లోరిడాకు పడవల్లో పారిపోయే ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయాణాల్లో వేల మంది మృత్యువాత పడ్డారు. ఎన్నికలు.. పేదరిక ప్రభావం వరుస తిరుగుబాట్లు, ప్రజల నిరసన ప్రభావంతో బేబీ డాక్.. 1986లో ఫ్రాన్స్‌కు శరణార్థికి పారిపోవడంతో లెఫ్టినెంట్ జనరల్ హెన్రీ నాంపి పాలనను చేపట్టాడు. రెండేళ్లకు జనరల్ ప్రాస్పర్ అవిరిల్ తానే నిజమైన అధ్యక్షుడినని ప్రకటించుకోగా.. అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో రాజీనామా చేసి తొలిసారి ఎన్నికలు నిర్వహించారు. అయితే పేదల పెన్నిధిగా పేరున్న వామపక్ష నేత జీన్ బెర్ట్రాండ్ అర్టిస్టిడె ఆ ఎన్నికల్లో గెలవగా.. ఆ మరుసటి ఏడాది(1991)లో హింస చెలరేగడంతో అతన్ని పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. మూడేళ్ల పాటు ఆ మారణకాండలు అలాగే కొనసాగడంతో.. 1994లో అమెరికా జోక్యం చేసుకుంది. తమ సైన్యాన్ని దించి హైతీ మిలిటరీ చర్యల్ని అణచివేసి.. తిరిగి అర్టిస్టిడ్ను అధ్యక్షుడిగా నియమించి శాంతి స్థాపనకు ప్రయత్నించింది. అప్పటి రాజకీయ అస్థిరత్వం నడుమే అధ్యక్షుడిగా కొనసాగినప్పటికీ.. 2004లో మళ్లీ హింస చెలరేగడంతో అర్టిస్టిడ్ దేశం విడిచి పారిపోయాడు. దీంతో మరోసారి ఎన్నికలు జరగ్గా.. ప్రెవెల్ నెగ్గాడు. ఆపై నిరసనలు, ఆహార కొరత, కలరా.. 2010లో భారీ భూకంపాలతో రెండున్నర లక్షల మంది దుర్మరణం పాలవ్వడంతో హైతీ ఘోరంగా కుదేలు అయ్యింది. కోలుకున్నట్లే అనిపించి.. వరుస విషాదాలతో కొలుకున్న హైతీకి.. 2011 ఎన్నికల్లో మైకేల్ మార్టెల్లీ గెలవడంతో ఆశలు చిగురించాయి. అయితే ఆ ఆనందం ఏడాది కూడా నిలవలేదు. పేదరికం, ఆర్థిక సంక్షోభం, పైగా అవినీతి ఆరోపణలతో ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు మొదలయ్యాయి. దీంతో మార్టెల్లీ రాజీనామా చేయాల్సి వచ్చింది. 2017లో అరటి పండ్ల వ్యాపారిగా ఉన్న జోవెనెల్ మోయిస్.. రాజకీయాల్లోకి అడుగుపెట్టి బ్రహ్మండమైన మెజార్టీతో గెలుపొందాడు. అయితే అధికార దుర్వినియోగంతో ఎన్నికలకు సిద్ధపడకపోకపోవడంతో.. మరోసారి వ్యతిరేక గళం వినిపించింది హైతీ గడ్డపై. ఈ ఏడాది మొదట్లో నియంతృత్వం వద్దంటూ లక్షల మంది నిరసన కార్యక్రమాలు చేపట్టారు. చంపిందెవరు? హైతీ అధ్యక్షుడు జోవెనెల్ మోయిస్ అతిదారుణంగా హత్య చేసిన వాళ్ల గురించి రకరకాల కథనాలు వెలువడ్డాయి. నిందితులు కాల్పుల సమయంలో స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడారని పోలీసులు ధృవీకరించుకున్నారు. ఇక ఇది ఫ్రాన్స్ చేయించిన హత్య అని, కాదు అమెరికా చేయించిన హత్య అని, డొమెనికా సీక్రెట్ గ్రూప్ చేయించిన పని అని.. ఇలా ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే ఆయా దేశాలు మాత్రం ఆరోపణల్ని.. మోయిస్ హత్యను ముక్తకంఠంతో ఖండించాయి. ఇక హత్యకు పాల్పడిన ముఠాగా అనుమానిస్తున్న ముగ్గురిని ఇప్పటికే హైతీ భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాయి. తీవ్రంగా గాయపడిన మోయిస్ భార్య మార్టైన్ మోయిస్ స్పృహలోకి వస్తే.. ఈ హత్యకు సంబంధించిన వివరాలేవైనా తెలుస్తాయని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ప్రధానిగా ఉన్న క్లౌండ్ జోసెఫ్.. తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. -
హైతీ అధ్యక్షుడి దారుణ హత్య
పోర్ట్–అవ్–ప్రిన్స్: కరేబియన్ దేశమైన హైతి అధ్యక్షుడు జోవెనెల్ మోయిజ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం అర్ధరాత్రి ఆయన నివాసంపై దాడి చేసిన దుండగులు జోవెనెల్‌ను కాల్చి చంపినట్టుగా ఆ దేశ తాత్కాలిక ప్రధాని క్లాడ్ జోసెఫ్ వెల్లడించారు. అనాగరిక, అమానవీయ, విద్వేషపూరిత చర్యగా దీనిని అభివర్ణించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దుండగుల దాడిలో గాయపడిన అధ్యక్షుడి భార్య, దేశ ప్రథమ మహిళ మార్టిన్ మోయిజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి దిగిన వారిలో కొందరు స్పానిష్ , ఇంగ్లీషు భాషలో మాట్లాడారని జోసెఫ్ ఆ ప్రకటనలో తెలిపారు. అయితే ఎవరు ఈ ఘాతుకానికి ఒడిగట్టారో ఇంకా తెలియలేదు. ప్రస్తుతం దేశంలో భద్రతా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని జోసెఫ్ స్పష్టం చేశారు. 53 ఏళ్ల వయసున్న మోయిజ్ 2017లో అధికారంలోకి వచ్చారు. అప్పట్నుంచి ఆయన తన అధికారాన్ని పెంచుకునే ప్రయత్నాలే చేశారు. కోర్టులు, ప్రభుత్వ కాంట్రాక్టర్లు, ఆడిటర్లు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కేవలం అధ్యక్షుడికే జవాబుదారీలా ఉండేలా నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ఎన్నికలు నిర్వహించడంలో ఆయన విఫలమయ్యారు. దీంతో అధ్యక్షుడిపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. విపక్ష నేతలు ఆయన గద్దె దిగాలని కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. -
ముంచెత్తిన బురద.. కన్నీళ్లలో ప్రజలు
ప్రకృతి బీభత్సం జపాన్‌తో కంటతడి పెట్టిస్తోంది. రాజధాని టోక్యోలో నివాస ప్రాంతాలను బురద ప్రవాహం తుడిచిపెట్టేసింది. రిసార్ట్ టౌన్ అతామీలో హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. బురద ప్రవాహం ముంచెత్తడంతో జాడ లేకుండా పోయారు పదుల సంఖ్యలో జనాలు. ఇక తుపాన్.. భారీ వర్షాలు అతలాకుతలం చేస్తుండడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. టోక్యో: జపాన్‌లో ప్రకృతి బీభత్సం కొనసాగుతోంది. రిసార్ట్ టౌన్ అతామీలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. భారీ వర్షాల కారణంగా కొండల నుంచి పెద్ద ఎత్తున జారిన బురద ఇళ్లను ముంచెత్తింది. ఎన్నో ఇళ్లు, కార్లు నామరూపాల్లేకుండా పోయాయి. బురద ధాటికి ఇప్పటిదాకా ఇద్దరు మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. మరో 20 మంది జాడ లేకుండా పోయారు. దీంతో ఆ ప్రాంతంలో ఎటుచూసినా రోదనలే కనిపిస్తున్నాయి. కనిపించకుండా పోయినవాళ్ల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని.. మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు అంచనాకి వచ్చారు. పరిస్థితి చేజారిపోతుండడంతో.. ఆదివారం సహాయక చర్యలను ముమ్మరం చేశారు అధికారులు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 1,000 మందికిపైగా సైనికులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగారు. బురదను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కనిపించకుండా పోయినవారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇప్పటిదాకా 19 మందిని రక్షించినట్లు సహాయక బృందాలు ప్రకటించాయి. కార్యక్రమాలపై జపాన్ ప్రధానమంత్రి యోషిహిడే సుగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. Japan floods: 20 people missing after landslide sweeps through Atami, a coastal city 65 miles southwest of Tokyo. #Shizuokapic.twitter.com/4pFl3Fa1dh — Ian Fraser (@Ian_Fraser) July 3, 2021 ఇక అతామీ పట్టణంలో 130 మంది ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయని చెప్పారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఆయన అత్యవసరంగా కేబినెట్ సమావేశం నిర్వహించారు. భారీగా వర్షాలు కురుస్తున్నప్పటికీ సహాయక చర్యలను ఆపడం లేదని అన్నారు. బురద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు సాధ్యమైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కోరారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భీకర తుపాను ‘ఎల్సా’ తుపాను హైతీ దక్షిణ తీర ప్రాంతాన్ని, డొమినికన్ రిపబ్లిక్ దేశాన్ని కుదిపేస్తోంది. పెనుగాలుల ధాటికి చెట్లు నేలకూలుతున్నాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోతున్నాయి. ఎల్సా తుపాను వల్ల ఇప్పటిదాకా ముగ్గురు మరణించారు. జమైకాలోని మాంటెగో బే నుంచి 175 మైళ్ల దూరంలో సముద్రంలో పుట్టిన ఎల్సా కరీబియన్ దీవులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. -
అగ్ని ప్రమాదం.. 15 మంది చిన్నారుల మృతి
పోర్ట్ అవు ప్రిన్స్ : కరీబియన్ దేశం హైతీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న వసతి గృహం మంటల్లో కాలిపోయింది. రాజధాని పోర్ట్ అవు ప్రిన్స్లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో సుమారు 15 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. మరో 60 మందిని అగ్నిమాపక దళాలు రక్షించగలిగాయి. ప్రమాదానికి గురైంది అమెరికాకు చెందిన క్రైస్తవ మత ఎన్జీవో ‘బైబిల్ అండర్స్టాండింగ్’ అనాథశరణాలయంగా తెలిసింది. హైతీలో రెండు అనాథ శరణాలయాను నిర్వహిస్తున్న సదరు ఎన్జీవో 150 మంది అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తోంది. ఇక అగ్ని ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన హైతీ అధ్యక్షుడు జోవినల్ మాయిజ్.. దర్యాప్తునకు ఆదేశించారు. వెలుగుతున్న క్యాండిల్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. -
హైతీలో భూకంపం,11మంది మృతి
-
హైతీలో భూకంపం.. 11 మంది మృతి
పోర్టో ప్రిన్స్: కరీబియన్ దేశమైన హైతీలో శనివారం అర్ధరాత్రి దాటాక భూకంపం సంభవించింది. ఘటనలో 11 మంది మృతిచెందారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైంది. పోర్టో పేక్స్ నగరానికి వాయవ్యం వైపు 19కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూఉపరితలానికి 11.7 కి.మీ లోతున భూమి కంపించింది. -
హైతీ ప్రజలు ఆకలిని తట్టుకోలేకే మట్టి పెంకులను..
-
హైతీ ప్రజలు మట్టి రొట్టెలు తింటున్నారా!
సాక్షి, న్యూఢిల్లీ: ఆఫ్రికాలోని హైతీ దేశంలో పేద ప్రజలు మెత్తటి మట్టితో చేసిన రొట్టెలను లేదా పెంకులను ఆవురావురుమని ఎలా తింటున్నారో చూడండి! అంటూ గత రెండు రోజులుగా ఓ వీడియో వివిధ ‘వాట్సాప్’ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. ‘మనం వదిలేసే తిండి కూడా దక్కని దరిద్రావస్థలో మట్టి పెంకులు తింటూ కడుపునింపుకుంటున్న ఇలాంటి ప్రజలను చూసైనా మీరు వృథాచేసే తిండిని సమీపంలోని రోటీ బ్యాంకులకు అందజేయండి’ అనే సందేశంతో ప్రముఖ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ చేసిన ట్వీట్ కూడా ఆ వీడియోతో చక్కర్లు కొడుతోంది. ఇలాంటి వీడియో వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు. మొదటి సారి 2009, ఫిబ్రవరిలో, రెండోసారి 2013, జూలైలో, మూడవ సారి 2016లో వెలుగులోకి వచ్చాయి. వాటిని ఇప్పటికీ యూట్యూబ్‌లో వీక్షించవచ్చు. అంత దీనావస్థలో ఉన్నారా? ఆకలిని తట్టుకోలేకే మట్టి పెంకులను తింటున్నారా? చారిత్రకంగా హైతీని ఆఫ్రికా దేశం అనేకంటే ఆఫ్రో–కరీబియన్ దేశమంటే బాగుంటుంది. స్విడ్జర్లాండ్ కన్నా ఈ దేశంలో కొండలు ఎక్కువ. అందుకే దీనికి హైతీ అనే పేరు వచ్చింది. హైతీ అంటే స్థానిక భాషలో ఎత్తయిన కొండలని అర్థం. దీన్ని అన్ని విధాల అష్టకష్టాల కూడలి అని చెప్పవచ్చు. ఇక్కడి ప్రజలకు ప్రకృతి అనుకూలించకపోగా అనూహ్యంగా ఉంటుంది. ఎప్పుడు తుపానులు విరుచుకుపడతాయో, ఎప్పుడు భూప్రకంపనలు ప్రకోపిస్తాయో ఎవరికీ తెలియవు. ఇక్కడి ప్రజల ప్రధాన వత్తి వ్యవసాయమైనా, వ్యయసాయానికి దేశంలోని 12 శాతం భూమే అనుకూలమైనది. మరో 31 శాతం భూమి కాస్త వ్యవసాయానికి అనుకూలమైనా పంట చేతికొచ్చేవరకు నమ్మకం ఉండదు. చుట్టూ ఆక్రమించిన సముద్రపు అలల కోతలు ఎక్కువ. 54 శాతం భూమి ఎత్తయిన పండ్ల తోటలకు అనుకూలమని గతంలో అమెరికా వ్యవసాయ శాఖ ఓ సర్వేలో తేల్చింది. ఏయే పండ్ల తోటలను వేసుకోవచ్చో కూడా సూచించింది. అయితే వాటిని హైతీ ప్రభుత్వం ఏ మేరకు అమలు చేస్తున్నదో తెలియదు. ప్రభుత్వం కూడా ఎప్పుడు స్థిరంగా ఉండదు. సముద్రం ఆటుపోట్లు లాగానే రాజకీయ సంక్షోభాలు ఎక్కువ. అందుకని ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం హైతీలో జాతీయ దారిద్య్రం శాతం 58.6. పోషక ఆహార లోపాల వల్ల ఏటా వెయ్యి మందికి 53 మంది పిల్లలు మరణిస్తున్నారు. జాతీయ స్థూల ఉత్పత్తి పరంగా 230 దేశాల్లో దీని స్థానం 146. 2010లో వచ్చిన ‘మాథ్యూ హరికేన్’, దాని వెన్నంటి వచ్చిన భూకంపం వల్ల వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వేలాది మంది మరణించారు. ఇప్పటికీ బాధితులు టార్పోలిన్ టెంట్లలోనే తలదాచుకుంటున్నారు. ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో బతకలేక దేశ రాజధాని ‘పోర్ట్ ఔ ప్రిన్స్’ నగరానికి ఎక్కువగా వలసపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ మట్టి రొట్టెలను తినే అలవాటు ఉంది. వీటిని స్థానిక భాషలో ‘గలెట్టి’ అని, ఇంగ్లీషులో మడ్ కేక్స్ అని మడ్ కుకీస్ అని పిలుస్తున్నారు. సముద్రపు ఒడ్డున దొరికే గోధుమ వర్ణపు మెత్తటి బంక మట్టిని తీసుకొచ్చి దానికి కొంత ఉప్పు కలిపి రొట్టెల్లా చేసి ఎండ పెడతారు. వాటిని పిల్లలు, పెద్దలు మన గారెల్లా కొర్కుక్కు తింటారు. ఆ మట్టిలో వివిధ ఖనిజాలు ఉండడం వల్ల వాటిని ఇలా తిన్నట్లయితే కడుపు పేగుల్లోని క్రిములన్నీ చనిపోయి జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుందని వారి నమ్మకం. మొదట్లో గర్భవతులు, ముసలి వాళ్లు వాటిని తినేవారు. డబ్బున్న వారు కూడా మన ఆయుర్వేద వైద్యంలా అప్పుడప్పుడు వాటిని తినేవారు. ఇప్పుడు పేద ప్రజలందరు వాటినే తింటున్నారు. కేవలం వారు బతకడం కోసమే తింటున్నారు. మట్టి రొట్టెల్లో పోషక పదార్థాలు ఉన్నాయనుకోవడం వారి ఆత్మ సంతప్తి కోసమే. ఆ మట్టిలో వివిధ రకాల ఖనిజాలు ఉన్నప్పటికీ పిల్లలకు, పెద్దలకు అవసరమైనన్ని పోషక పదార్థాలు లేవని ఐక్యరాజ్య సమితి ఇదివరకే తేల్చింది. ఉంటే 52 శాతం హైతీ పిల్లల్లో పోషక పదార్థాల లోపం ఎందుకుంటుందని కూడా ప్రశ్నించింది. -
పడవ మునక.. 40 మంది గల్లంతు
పోర్ట్ ఔ ప్రిన్స్(హైతీ): వలసదారులతో వెళ్తున్న పడవ మునిగిపోయిన ఘటనలో 40 మంది గల్లంతయ్యారు. హైతీ ఉత్తర తీరంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఏడుగురిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 50 మందితో లాటోర్ట్యూ దీవి నుంచి బ్రిటన్ ఆధీనంలోని ప్రొవిడెన్సియల్స్ దీవివైపు బయలుదేరిన పడవ ఆదివారం మునిగిపోయింది. సమాచారం అందుకున్న తీరరక్షక దళం సిబ్బంది ఏడుగురిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. మిగతా వారి జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా హైతీ నుంచి సమీపంలోని బ్రెజిల్, చిలీ, బహమాస్ దేశాలకు వలస వెళ్తున్నారు. పేదరికం కారణంగా హైతీలో ప్రజలు వలసబాట పడుతున్నారు. -
మందులోడా.. ఓరి మాయలోడా..
మన దగ్గర.. ఆ.. వంకాయలు.. టమాటాలు.. కొత్తిమీర కట్టోయ్.. హైతీలో అయితే.. ఆ.. పారసిటమాల్..సిప్రోఫ్లాక్సిన్.. పెన్సిలిన్నోయ్.. మెడికల్ షాపు పెట్టాలంటే మనకేం కావాలి.. ముందు లైసెన్సు తీసుకుని ఉండాలి.. ఫార్మసీ చదివుండాలి.. హైతీకెళ్తే.. అదేమీ అక్కర్లేదు.. ఓ మాంచి దిట్టమైన ప్లాస్టిక్ బకెట్.. కాసింత ఎండలో తిరిగే ఓపిక ఉంటే చాలు.. ఎవరైనా.. ఫార్మసిస్టు అయిపోవచ్చు. హైతీలో చాలా మందికి ఇలాంటి మందులు కొనడమంటే.. ఏవో చాక్లెట్లు కొన్నట్లే కొంటారు. అలాగని.. ఈ బిజినెస్ అంత ఈజీ కాదు కూడా.. అసలే పోటీ.. దీంతో మన సరుకు ఆకర్షణీయంగా కనిపిస్తేనే.. వినియోగదారుడు కొంటాడు.. అందుకే.. టాబ్లెట్లను ఏది పడితే అలా పెట్టేయడానికి లేదు.. గులాబీ రంగు మాత్ర పక్కన.. నీలం రంగు టాబ్లెట్లు వచ్చేటట్లు సర్దాలి.. ఇంద్రధనస్సు రంగులన్నీ.. మన బకెట్లోనే కనిపించాలి. అప్పుడే కస్టమర్ చూపును మనం ఆకర్షించగలం. వాస్తవానికి ఇలా మందులు అమ్మడం నిషిద్ధమే.. కానీ పట్టించుకునేవాడెవడు.. ప్రభుత్వమూ లైట్ తీసుకుంటుంది.దీంతో హైతీ రాజధాని పోర్టో ప్రిన్స్లో ఇలాంటి వారిదే రాజ్యం. వీటిల్లో ఎక్కువ మందులు చైనా నుంచి వస్తాయి. మరికొన్ని ఎక్స్పైరీ అయిపోయినవీ ఉంటాయి. అంతేకాదు.. వీరు అసలు డాక్టర్లను మించి.. రోగులకు సలహాలు ఇచ్చేస్తుంటారు. అవి ఎలాగుంటాయంటే.. మొటిమలకు కూడా పవర్ఫుల్ యాంటీ బయాటిక్స్ ఇచ్చేస్తారన్నమాట. ‘ఏ.. వాళ్లు మా దగ్గర ఏమీ దాయరు. అన్నీ చెబుతారు. అన్నిటికీ మా దగ్గర మందుంది’ అని వీళ్లు గొప్పగా చెబుతారు. -
జనాలపైకి దూసుకెళ్లిన బస్సు.. 38 మంది మృతి
పనామా సిటీ: కరీబియన్ దేశం హైతీలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. మ్యూజిక్ ఫెస్టివల్లో పాల్గొన్న జనాలపైకి దూసుకెళ్లడంతో 38 మంది మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. రాజధాని పోర్ట్-ఆ-ప్రిన్స్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొనైవ్స్ పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దూరప్రాంతాలకు పర్యాటకులను చేరవేసే బ్లూ స్కై అనే సంస్థకు చెందిన బస్ ముందుగా ఇద్దరు పాదచారులను ఢీకొనడంతో వారిలో ఒకరు మృతి చెందారు. దీంతో అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయే క్రమంలో డ్రైవర్ బస్సు వేగాన్ని పెంచడంతో అదుపుతప్పి మూడు స్ట్రీట్ మ్యూజిక్ బృందాలపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైందని హైతీ సివిల్ ప్రొటెక్షన్ ఆఫీస్ హెడ్ మేరీ-ఆల్టా జీన్ బాప్టిస్ట్ వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన 17 మందిని ఆసుపత్రికి తరలించగా.. వారిలో నలుగురు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. ఘటనకు కారణమైన బస్సును స్థానికులు తగలబెట్టడానికి ప్రయత్నించారని అధికారులు వెల్లడించారు. ప్రమాద స్థలం నుంచి పారిపోయిన బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సు ప్రమాదంపై హైతీ ప్రెసిడెంట్ జొవెనల్ మొయిస్ తీవ్ర సంతాపం తెలిపారు.