తిండి, నీళ్లు లేక వీధుల్లోనే బతుకు వెళ్లదీస్తున్న పది లక్షల మంది ప్రజలు... ధ్వంసమైన ఇళ్ల ముందే సాయం కోసం పడిగాపులు! ఇదీ మాథ్యూ తుపాను ధాటికి అస్తవ్యస్తమైన హైతీ పరిస్థితి.. చేతికి రావాల్సిన పంటలు కూడా పెనుగాలులకు కొట్టుకుపోయాయి. మరోపక్క.. మాథ్యూ తుపాను దెబ్బకు 400 మంది మరణించారని ప్రభుత్వం ప్రకటించగా.. మృతుల సంఖ్య మాత్రం రెట్టింపుగా ఉంది. గంట గంటకూ శిథిలాల నుంచి మృతదేహాల్ని వెలికితీస్తూనే ఉన్నారు. రాయిటర్స్ కథనం ప్రకారం మృతుల సంఖ్య 900కు పైమాటే. ఒక్క జిల్లాలోనే 470 మంది మరణించినట్లు సమాచారం.