ఆఫ్రికాలోని హైతీ దేశంలో పేద ప్రజలు మెత్తటి మట్టితో చేసిన రొట్టెలను లేదా పెంకులను ఆవురావురుమని ఎలా తింటున్నారో చూడండి! అంటూ గత రెండు రోజులుగా ఓ వీడియో వివిధ ‘వాట్సాప్’ గ్రూపుల్లో వైరల్ అవుతోంది. ‘మనం వదిలేసే తిండి కూడా దక్కని దరిద్రావస్థలో మట్టి పెంకులు తింటూ కడుపునింపుకుంటున్న ఇలాంటి ప్రజలను చూసైనా మీరు వృథాచేసే తిండిని సమీపంలోని రోటీ బ్యాంకులకు అందజేయండి’ అనే సందేశంతో ప్రముఖ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ చేసిన ట్వీట్ కూడా ఆ వీడియోతో చక్కర్లు కొడుతోంది