Death toll
-
మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్న మంటలు
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో రగిలిన కార్చిచ్చు ఇళ్లు, చెట్లు, పుట్టలను కబళిస్తూ విలయతాండవం చేస్తోంది. అత్యంత ఖరీదైన గృహాలు బూడిద కుప్పలుగా మారిపోతున్నాయి. మనుషులతోపాటు పక్షులు, జంతువులు మంటల్లో పడి కాలిపోతున్నాయి. కార్చిచ్చులో మృతుల సంఖ్య 16కు చేరుకున్నట్లు స్థానిక అధికారులు ప్రకటించారు. ఈటాన్ ఫైర్‌లో 11 మంది, పసిఫిక్ పాలిసేడ్స్ ఫైర్‌లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అగ్నికీలలు ఇప్పటికిప్పుడు ఆరిపోయే పరిస్థితి లేకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. కార్చిచ్చు మొదలైన తర్వాత కొందరు కనిపించకుండాపోయారు. వారి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. బూడిద కుప్పల్లో అన్వేషిస్తున్నారు. ఇందుకోసం జాగిలాల సాయం తీసుకుంటున్నారు. మరోవైపు అదృశ్యమైన తమవారి కోసం బాధితులు అధికారులను సంప్రదిస్తున్నారు. అధికారులు పాసాడెనాలో ఫ్యామిలీ అసిస్టెన్స్ సెంటర్ ఏర్పాటు చేశారు. కార్చిచ్చును అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నప్పటికీ మంటలు మరికొన్ని ప్రాంతాలకు వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. జె.పాల్ గెట్టీ మ్యూజియం, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వరకూ మంటలు చొచ్చుకొస్తున్నాయి. మంటలకు బలమైన ఈదురుగాలులు తోడవుతుండడంతో పరిస్థితి నియంత్రణలోకి రావడం లేదని అధికారులు చెప్పారు. ఆర్నాల్డ్ స్వార్జినెగ్గర్తోపాటు హాలీవుడ్ ప్రముఖులు నివాసం ఉండే మాండివిల్లే కాన్యాన్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలపై హెలికాప్టర్లతో నీటిని చల్లుతున్నారు. దట్టమైన పొగ అలుముకోవడం సహాయక చర్యలకు ఆటంకంగా మారుతోంది. అధిక జనాభాతో కిక్కిరిసి ఉండే హలీవుడ్ హిల్స్, శాన్ ఫెర్నాండో వ్యాలీ వైపు మంటలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. 12 వేలకుపైగా ఇళ్లు దగ్ధం లాస్ ఏంజెలెస్‌లో 145 చదరపు కిలోమీటర్ల భూభాగం కార్చిచ్చు ప్రభావానికి గురయ్యింది. ఇది శాన్ ఫ్రాన్సిస్కో నగర విస్తీర్ణం కంటే అధికం. కార్చిచ్చు మంగళవారం తొలుత లాస్ఏంజెలెస్ ఉత్తర డౌన్టౌన్లో మొదలైంది. క్రమంగా విస్తరించింది. మరో నాలుగు చోట్ల కార్చిచ్చులు రగిలాయి. ఇప్పటిదాకా 12 వేలకుపైగా ఇళ్లు మంటల్లో కాలిపోయి బూడిదగా మారాయి. విలాసవంతమైన గృహాలు, అపార్టుమెంట్ భవనాలు, వ్యాపార కేంద్రాలు నామరూపాల్లేకుండా పోయాయి. వాటిలో విలువైన వస్తువులు, గృహోపకరణాలు అగ్నికీలల్లో మాడిపోయాయి. కార్చిచ్చుకు కచి్చతమైన కారణం ఏమిటన్నది ఇంకా ధ్రువీకరించలేదు. మొత్తానికి ఇది కనీవిని ఎరుగని భారీ నష్టమేనని చెప్పొచ్చు. ఇప్పటిదాకా 150 బిలియన్ డాలర్ల (రూ.12.92 లక్షల కోట్లు) మేర నష్టం వాటిలినట్లు అక్యూవెదర్ అనే ప్రైవేట్ సంస్థ అంచనా వేసింది. బాధితుల కోసం షెల్టర్లు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ 1.50 లక్షల మందికి ఆదేశాలు జారీ చేశారు. నిరాశ్రయుల కోసం తొమ్మిది షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ 700 మందికిపైగా బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. 1,354 ఫైర్ ఇంజన్లు, 84 హెలికాప్టర్లు నిర్విరామంగా పని చేస్తున్నారు. 14,000 వేల మంది అగ్నిమాపక సిబ్బంది విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు. మంటలు ఆర్పడానికి శ్రమిస్తున్నారు.అందని నీళ్లు, నిధులు కార్చిచ్చు నష్టపోయినవారిని అదుకోవడానికి మానవతావాదులు ముందుకొస్తున్నారు. డొనేషన్ కేంద్రాల్లో విరాళాలు అందజేస్తుందన్నారు. బాధితులకు కొందరు దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేస్తున్నారు. ఆహారం సైతం అందిస్తున్నారు. దగ్ధమైన తమ ఇళ్లను చూసుకోవడానికి బాధితులు వస్తున్నారు. సర్వం కోల్పోయామంటూ బోరున విలపిస్తున్నారు. అయితే, కాలిపోయిన ఇళ్ల వద్దకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. శిథిలాల నుంచి ప్రమాదకరమైన వాయువులు వెలువడుతున్నాయని, అవి పీల్చడం ప్రాణాంతకమని చెబుతున్నారు. మరోవైపు మంటలు ఆర్పడానికి చాలినంత నీరు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. కొందరు సంపన్నులు విచ్చలవిడిగా నీరు వాడేశారని, అందుకే ఈ దుస్థితి ఏర్పడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 440 మిలి యన్ లీటర్ల సామర్థ్యం ఉన్న రిజర్వాయర్ ఖాళీ అయ్యింది. అగ్నిమాపక శాఖకు తగినన్ని నిధులు కూడా అందడం లేదని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మంటలు ఎలా ఆర్పాలని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. -
10 వేల ఇళ్లు బుగ్గి
లాస్ ఏంజెలెస్: కార్చిచ్చుల ధాటికి అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరం అగ్ని కీలలకు ఆహూతవుతోంది. ఏకంగా 10 వేల ఇళ్లు బూడిద కుప్పలుగా మారిపోయాయి. మృతుల సంఖ్య శుక్రవారం నాటికి పదికి చేరుకుంది. ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. కేవలం పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలోనే 5 వేల నివాసాలు ధ్వంసమయ్యాయి. లాస్ ఏంజెలెస్ చరిత్రలో ఈ స్థాయిలో కార్చిచ్చులు రగలడం ఇదే మొదటిసారి. కోస్తా తీర ప్రాంతంలో 70 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం మంటల్లో చిక్కుకుంది. వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ స్థానిక కాలమానం ప్రకారం గురువారం నాటికి 1.80 లక్షల మందికి ఆదేశాలు అందాయి. కలాబాసాస్, శాంటా మోనికా, వెస్ట్ హిల్స్ తదితర ప్రాంతాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. హలీవుడ్ నటులు మార్క్ హమిల్, మాండీ మూర్, పారిస్ హిల్టన్ తదితరులు ఇప్పటికే లాస్ ఏంజెలెస్ విడిచి వెళ్లిపోయారు. లాస్ ఏంజెలెస్ కౌంటీలో మొత్తం 117 చదరపు కిలోమీటర్ల మేర భూభాగంలో మంటలు వ్యాపించాయి. ఇది శాన్ ఫ్రాన్సిస్కో నగర విస్తీర్ణంతో సమానం. ఇక్కడ ఎవరైనా అణుబాంబు ప్రయోగించారా? అనే అనుమానం కలుగుతోందని కౌంటీ సీఈఓ రాబర్ట్ లూనా చెప్పారు. కార్చిచ్చును అదుపు చేయడానికి 7,500 మందికిపైగా అగ్నిమాపక సిబ్బంది, అధికారులు శ్రమిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి తగినన్ని నిధులు, వనరులు సమకూర్చాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్చిచ్చు కారణంగా 150 బిలియన్ డాలర్ల(రూ.12.92 లక్షల కోట్లు) మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఓ ప్రైవేట్ సంస్థ అంచనా వేసింది. ప్రభుత్వ అధికారిక గణాంకాలు ఇంకా బహిర్గతం కాలేదు. రగిలిన మరో కార్చిచ్చు లాస్ ఏంజెలెస్ సమీపంలో తాజాగా మరో కార్చిచ్చు మొదలైంది. వెంచురా కైంటీ సమీపంలోని శాన్ ఫెర్నాండో వ్యాలీలో మంటలు ప్రారంభమయ్యాయని స్థానిక అధికారులు చెప్పారు. కార్చిచ్చు ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇక్కడ బలమైన ఈదురు గాలులు వీస్తుండడంలో మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని, అరికట్టడం కష్టంగా మారిందని అంటున్నారు. ఇదిలా ఉండగా, కార్చిచ్చు బాధితులను ఆదుకోవడానికి చాలామంది ముందుకొస్తున్నారు. ‘ఫండ్ ఆఫ్ సపోర్ట్’కు మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్లు హాలీవుడ్ నటి జేమీ లీ కర్టీస్ చెప్పారు. దక్షిణాదిన వణికిస్తున్న మంచు తుపాను లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు ఇళ్లను దహనం చేస్తుండగా, అమెరికా దక్షిణాది రాష్ట్రాలైన టెక్సాస్, ఒక్లహోమాలో మంచు తుపాను వణికిస్తోంది. రోడ్లపై మంచు పేరుకుపోతుండడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోతున్నాయి. సాధారణ జనజీనవం స్తంభిస్తోంది. స్థానిక గవర్నర్లు అత్యవసర పరిస్థితి ప్రకటించారు. పాఠశాలలు మూసివేశారు. చల్లటి గాలులు బెంబేలెత్తిస్తున్నాయి. అర్కన్సాస్, టెక్సాస్, జార్జియా, టెన్నెస్సీ, దక్షిణ కరోలినా వంటి రాష్ట్రాల్లోనూ అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లూసియానా, మిసిసిపీ, అలబామా రాష్ట్రాల్లో మంచు తుపానుకు తోడు వర్షాలు కురుస్తున్నాయి. అమెరికాలో గురువారం 4,500కుపైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరో 2 వేల విమానాలు రద్దయ్యాయి. -
సరైన బట్టల్లేక.. దుప్పట్లు లేక..
యుద్ధంతో అతలాకుతమైన గాజాను ఇప్పుడు చలి పులి చంపేస్తోంది. ముఖ్యంగా చలి నుంచి దాచుకోవడానికి వెచ్చని దుస్తులు లేక, కప్పుకోవడానికి దుప్పట్లు లేక గాజా స్ట్రిప్‌లో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఆహారం, ఇంధనం, మందులు, మౌలిక సదుపాయాలు లేక గాజాలోని కుటుంబాలు వణికిపోతున్నాయి. కళ్లముందే పిల్లలు ప్రాణాలు కోల్పోతుండటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. డెయిర్ అల్–బలాహ్: ఓవైపు యుద్ధంతో విధ్వంసమైన గాజాను ఇప్పుడు చలి వణికిస్తోంది. చలి తీవ్రత బాగా పెరగడంతో రక్షించుకోవడానికి సరైన బట్టలు, దుప్పట్లు లేకపోవడంతో వారం రోజుల వ్యవధిలో ఎనిమిది మంది పిల్లలు చనిపోయారు. బాంబు దాడుల నుంచి తప్పించుకుని వచ్చామని, ఇక్కడ చలికి పిల్లల ప్రాణాలు పోతున్నాయని తన నవజాత శివువును పోగొట్టుకున్న యహ్యా అల్–బత్రాన్ రోదిస్తున్నాడు. కొద్దిరోజుల కిందే చనిపోయిన తన చిన్నారి దుస్తులను చూపిస్తూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం కారణంగా పూర్తిగా నిరాశ్రయులైన బత్రాన్ కుటుంబం పదేపదే కొత్త ప్రాంతాలకు వలసపోతూ చివరకు డేర్ ఎల్–బాలాహ్లోని చిరిగిపోయిన దుప్పట్లు, బట్టలతో చేసిన తాత్కాలిక గుడారానికి చేరింది. అతని భార్య నెలలు నిండకుండానే కవల పిల్లలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒకరు జుమా దక్షిణ గాజాలోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతుండగా.. అలీ కొంత ఆరోగ్యంగా ఉండటంతో ఇంక్యుబేటర్ నుంచి బయటకు తీశారు. ప్రస్తుతం ఖర్జూరం తోటలో నివసిస్తున్న వందలాది మంది మాదిరిగానే, వారు భారీ వర్షాలు, ఎనిమిది డిగ్రీ సెల్సియస్ అత్యల్ప ఉష్ణోగ్రతల మధ్య పిల్లలను వెచ్చగా ఉంచడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా దుప్పట్లు లేవు. తగిన దుస్తులు లేవు. ‘‘చలికి తట్టుకోలేక నా బిడ్డ శరీరం మొత్తం గడ్డకట్టడం, అతని చర్మం నీలం రంగులోకి మారింది. నా కళ్లముందే చలిపులి అతని ప్రాణాలుతీసింది’’అంటూ ఆ తల్లి కంటతడి పెట్టుకుంది. వర్షంలో తడిసిన చాపపై కూర్చొని చిరిగిపోయిన దుప్పట్లును కప్పి దగ్గరకు పట్టుకుని తన ఇద్దరు పిల్లలను కాపాడుకుంటున్నాడు బత్రాన్. ఎండిపోయిన రొట్టె, స్టవ్ మీద చిన్న కుండలో ఉన్న వేడి నీళ్లు. ఒక రోజుకు వాళ్లకవే ఆహారం. 20 లక్షల మంది భద్రతకు ముప్పు గాజా స్ట్రిప్‌లో వేలాది ఇతర కుటుంబాల ఆహారం, ఇంధనం, ఔషధాల తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఉంటున్న మహమూద్ అల్–ఫాసిహ్ మూడు వారాల వయసున్న తన కూతురును కోల్పోయాడు. వారి కుటుంబం అల్–మవాసి బీచ్ సమీపంలోని చిన్న గుడారంలో ఉంటుండగా చలికి శిశువు గడ్డకట్టుకుపోయింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు చెప్పారు. తీవ్రమైన హైపోథెరి్మయా వల్ల చిన్నారి గుండె హఠాత్తుగా కొట్టుకోవడం ఆగిపోయిందని నాజర్ ఆసుపత్రి అత్యవసర, పిల్లల విభాగం డైరెక్టర్ అహ్మద్ అల్ ఫరా తెలిపారు. చలితో మరో 20 రోజుల పసికందు ఆయేషా అల్ ఖాస్సాస్ మృతి చెందింది. ‘‘మీరు ఇంకా గాజా స్ట్రిప్‌లో ఉన్నారంటే ఇజ్రాయెల్ బాంబుదాడులతో మరణించాలి లేదంటే ఆకలితోనో, చలికో చచ్చిపోతారు’’అంటూ దుఃఖిస్తున్నారు ఆయేషా తల్లిదండ్రులు. రాబోయే రోజుల్లో మరింత కఠినమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కోవాల్సిన దారుణ పరిస్థితి దాపురిస్తుందని గాజాలోని హమాస్ ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇది నిర్వాసితులైన 20 లక్షల మంది భద్రతకు ముప్పు. ఈ వాతావరణ తీవ్రతకు శిశువులు, వృద్ధులు మరణించే అవకాశం ఉందని డాక్టర్ ఫరా హెచ్చరించారు. -
వనౌటులో భారీ భూకంపం
వెల్లింగ్టన్(న్యూజీలాండ్): పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో మంగళవారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైన ఈ భూకంపం తాకిడి తీవ్ర నష్టం సంభవించింది. పోర్ట్ విలాలోని వివిధ దేశాల దౌత్యకార్యా యాలున్న భవన సముదాయం సహా నేల మట్టమైన పలు భవనాల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష మయ్యా యి. పోర్ట్ విలాలోని నౌకాశ్రయం దెబ్బతింది. అక్కడి విమానాశ్రయంలో రాకపోకలు నిలిచిపోయాయి. పోర్ట్ విలా దౌత్య కార్యా లయంలోని తమ సిబ్బంది అందరూ సురక్షి తంగానే ఉన్నారని, ప్రస్తుతానికి కా ర్యాల యాన్ని మూసి వేశామని అమెరికా, ఆస్ట్రేలి యా తెలిపాయి. క్షతగాత్రులతో ఆస్పత్రులు నిండిపోయాయి. పలువురు మృతి చెందినట్లు చెబుతున్నారు. విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతినడంతో పూర్తి వివరాలు తెలియడం లేదు. ప్రజలను తీర ప్రాంతాలకు దూరంగా వెళ్లాలని హెచ్చరించారు. నష్ట సమాచారం సామాజిక మాధ్యమాల్లో మాత్రమే కొంతమేర సమాచారం బయ టకు వస్తోంది. పోర్ట్ విలాకు 30 కిలోమీటర్ల దూరంలో భూమికి 37 కిలోమీటర్ల లోతులో మధ్యాహ్నం ఒంటిగంట సమ యంలో ఒక్కసారిగా తీవ్ర ప్రకంపనలు మొదలయ్యాయి. అనంతర ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. -
USA: హెలెన్ విధ్వంసం
ఫ్లోరిడా: అమెరికాను తాకిన భీకర హెలెన్ తుపాను ఫ్లోరిడాతో పాటు ఆగ్నేయ అమెరికాలో అపారమైన విధ్వంసం సృష్టించింది. జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియాల్లో వరదలు, ఇళ్లు కూలిన ఘటనల్లో 72 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగేలా ఉంది. వరద నష్టం 15 నుంచి 26 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. టెన్నెసీలోని యునికోయ్ కౌంటీ హాస్పిటల్లోకి వరద చేరడంతో మొత్తం 54 మంది భవనంపైకి చేరారు. వారిని హెలికాప్టర్ ద్వారా కాపాడారు. న్యూపోర్టు సమీపంలో జలాశయం పొంగిపొర్లుతుండటంతో 7 వేల మందిని తరలించారు. నార్త్ కరోలినాలో వందేళ్లలోనే రికార్డు స్థాయిలో వరదలు సంభవించాయని అధికారులు వెల్లడించారు. అట్లాంటాలో 48 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 28.24 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇక్కడ 1878 తర్వాత ఈ స్థాయి వర్షం ఇదే మొదటిసారని జార్జియా వాతావరణ విభాగం ప్రకటించింది. వరదల ధాటికి పార్కు చేసిన కార్లన్నీ మునిగిపోయాయి. ఈ ప్రాంతాన్ని ముంచెత్తాయి. ఫ్లోరిడాలో పలు ప్రాంతాలకు చేరేందుకు పడవలే దిక్కయ్యాయి. ఫ్లోరిడా, జార్జియా, కరోలినాల్లో 30 లక్షల ఇళ్లు, వ్యాపారసంస్థలకు కరెంటు నిలిచిపోయింది. ఇటీవలి ఇడాలియా, డెబ్బీ తుపాన్లను మించిన నష్టం కలిగిందని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీ శాంటిస్ తెలిపారు. తుపాను తీవ్రత తగ్గినా కుండపోత కొనసాగుతుందని వాతావరణ విభాగం హెచ్చరించింది. -
రష్యాలో మరో ఉగ్రఘాతుకం
మాస్కో: రష్యాలోని ముస్లిం ప్రాబల్య దక్షిణ ప్రాంత దగెస్తాన్ రిపబ్లిక్లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఆదివారం సాయంత్రం ఏకకాలంలో దగెస్తాన్ రాజధాని మఖచ్కాలా లోని ఓ చర్చి, ఓ ట్రాఫిక్ పోలీస్ పోస్ట్‌పైనా కాల్పులు జరపడంతోపాటు డెర్బెంట్ నగరంలోని ఒక చర్చి, ఒక యూదు ప్రార్థనా మందిరంలో దాడి చేసి నిప్పుపెట్టారు. ఉగ్రవాదులు డెర్బెంట్ ట్రినిటీ సండే చర్చిలో ఉన్న రెవరెండ్ నికోలాయ్ కొటెల్నికోవ్ (66)గొంతుకోసి చంపడంతోపాటు ఆ చర్చికి నిప్పుపెట్టారని అధికా రులు తెలిపారు. రెండు ఘటనల్లో 15 మంది పోలీసులు, ఒక బోధకుడు సహా 20 మంది చనిపోయారు. క్షతగాత్రులైన 46 మందిలో 13 మంది పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. నలుగురు పోలీసు అధికారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా బలగాల ఎదురు దాడిలో ఆరుగురు ఉగ్రవా దులు హతమ య్యారన్నా రు. అయితే, ఈ ఘటనల్లో ఎందరు ఉగ్రవా దులు పాల్గొన్నదీ వారు వివరించలేదు. హతమైన వారిలో ఉగ్రవాదుల్లో ముగ్గురిని రష్యాలోని ప్రధాన యునైటెడ్ రష్యా పార్టీకి దగెస్తాన్ హెడ్‌గా ఉన్న మగొమెద్ ఒమరోవ్ ఇద్దరు కుమారులు, బంధువుగా అధికారులు గుర్తించారు. -
86కు చేరిన కాంగో పడవ మృతులు
కిన్షాసా: కాంగోలో పడవ మునిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 86కు పెరిగింది. 271 మంది ప్రయాణికులతో కిక్కిరిసిన నాటు పడవ ఇంజన్ వైఫల్యంతో మంగళవారం నీట మునగడం తెలిసిందే. 185 మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. దట్టమైన అటవులు, నదుల కారణంగా కాంగోలో రోడ్డు వ్యవస్థ సరిగా లేదు. జనం పడవ ప్రయాణాలకే మొగ్గుచూపుతారు. పడవ ప్రమాదాలు అక్కడ సర్వసాధారణం. ఫిబ్రవరిలోనూ నాటు పడవ మునిగి డజన్లకొద్దీ చనిపోయారు. -
పపువా న్యూ గినియా విషాదం..
మెల్బోర్న్: దక్షిణ పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియా శుక్రవారం కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామంలో చోటుచేసుకున్న ఘటనలో 670 మంది వరకు చనిపోయి ఉంటారని మొదట ఐరాస విభాగం అంచనా వేసింది. అయితే, మట్టిదిబ్బల కింద రెండు వేలమందికి పైగానే గ్రామస్తులు సజీవ సమాధి అయి ఉంటారని పపువా న్యూ గినియా ప్రభుత్వం లెక్కగట్టింది. ఈ మేరకు ఐరాసకు సమాచారం పంపింది. ఈ విషాద సమయంలో తమను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. అయితే, ఐరాస వలసల విభాగం మాత్రం నేలమట్టమైన 150 నివాసాలను పరిగణనలోకి తీసుకునే మృతుల సంఖ్య 670గా నిర్ణయించామని, ప్రభుత్వ గణాంకాలపై మాట్లాడబోమని తెలిపింది. మృతుల సంఖ్యను 2 వేలుగా ఏ ప్రాతిపదికన నిర్ణయించారని ప్రధాని జేమ్స్ మరాపేను మీడియా ప్రశ్నించగా ఆయన బదులివ్వలేదు. కాగా, దేశంలో దశాబ్దాలుగా జనగణన జరగలేదు. సైన్యం కాపలా మధ్య.. గ్రామంలోని 200 మీటర్ల ప్రాంతంలో ఉన్న నివాసాలను 6 నుంచి 8 మీటర్ల మేర భారీ రాళ్లు, చెట్లు, మట్టి భూస్థాపితం చేశాయి. స్థానికులే తమ వ్యవసాయ పరికరాలైన పార, గొడ్డలి వంటి వాటితో వాటిని తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు. స్థానిక కాంట్రాక్టర్ పంపించిన బుల్డోజర్తో ఆదివారం నుంచి పని చేయిస్తున్నారు. -
పపువా న్యూ గినియా విషాదం.. మరణాలు 670కి పైనే..
మెల్బోర్న్: పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియాలో శుక్రవారం కొండచరియలు విరిగిపడి గ్రామాన్ని నేలమట్టం చేయడం తెల్సిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 670కిపైనే అని ఐరాసకు చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్(ఐవోఎం) ఆదివారం తెలిపింది. ఎంగా ప్రావిన్స్ అధికారులు, బాధిత యంబలి గ్రామస్తులు అందించిన సమాచారాన్ని బట్టి 150కిపైగా ఇళ్లు భూస్థాపితం కాగా వాటిలోని 670 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు ఐవోఎం అంచనా వేసింది. క్షతగాత్రులు, గల్లంతైన వారి సంఖ్యలో స్పష్టత రాలేదని పేర్కొంది. ఆదివారం ఐదు మృతదేహాలను వెలికి తీసినట్లు స్థానిక అధికారులు చెప్పారు. మట్టి, బండరాళ్లు, చెట్లు మూడు నుంచి నాలుగు ఫుట్‌బాల్ మైదానాలంత విస్తీర్ణంలో 6 నుంచి 8 మీటర్ల లోతున గ్రామాన్ని భూస్థాపితం చేశాయని, లోపల చిక్కుకున్న వారు బతికి బట్టకట్టేందుకు అవకాశాలు తక్కువని ఐవోఎం అంటోంది. మరోవైపు స్థానిక గిరిజన తెగల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. శనివారం జరిగిన ఘర్షణలో ఎనిమిది మంది చనిపోయారు. దాంతో సహాయక సిబ్బంది, అత్యవసరాలను చేరవేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. -
అఫ్గాన్‌లో ఆకస్మిక వరదలు
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌ను మరోసారి ఆకస్మిక వర్షాలు, వరదలు ముంచెత్తాయి. దీంతో వరదలు, వర్ష సంబంధ ఘటనల్లో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రాథమికంగా అందిన సమాచారం అని మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని తాలిబాన్ అధికారులు శనివారం వెల్లడించారు. గత వారం పోటెత్తిన వరదవిలయం నుంచి తేరుకోకముందే మరో జలఖడ్గం అఫ్గానిస్తాన్‌పై దండెత్తి డజన్లకొద్దీ ప్రాణాలను బలితీసుకుంది. పశి్చమ ప్రావిన్స్ ఘోర్‌లో అత్యధికంగా 50 మంది మరణించారని ప్రావిన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి అబ్దుల్ వహీద్ హమాస్ చెప్పారు. ప్రావిన్స్ రాజధాని ఫెరోజ్ కోహసహా వేలాది ఇళ్లు, వందల హెక్టార్లలో వ్యవసాయభూములు నాశనమయ్యాయి. ఉత్తర ఫరాయాబ్ ప్రావిన్స్‌లో 18 మంది చనిపోయారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ ప్రావిన్స్‌లోని నాలుగు జిల్లాల్లో వరదవిలయం దారుణంగా ఉందని, 300కుపైగా మూగజీవాలు మృతిచెందాయని గవర్నర్ అధికార ప్రతినిధి ఏస్మతుల్లాహ్ మొరాదీ చెప్పారు. ఘోర్ ప్రావిన్స్‌లో 2,500 కుటుంబాలు వరదబారిన పడ్డాయి. -
విదేశాల్లో విద్యార్థుల మరణాలపై కేంద్రం పకటన
న్యూఢిల్లీ: విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాలపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటులో ప్రకటించింది. గత ఐదేళ్లలో.. విదేశాలలో 403 మంది భారతీయ విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ వెల్లడించారు. మూడోరోజు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఒక ప్రశ్నకు మంత్రి మురళీధరన్ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2018 నుంచి విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందగా.. అత్యధికంగా 91 మంది కెనడా దేశంలో మరణించినట్లు తెలిపారు. ఇంగ్లండ్‌లో 48, రష్యాలో 40 మంది, అమెరికాలో 36, ఉక్రెయిన్‌లో 21 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారని పేర్కొంది. అయితే ఇటీవల అమెరికాలో వరుసగా నలుగురు భారతీయ విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాలల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఏ దేశంలో ఇప్పటివరకు అసలు ఎంత మంది విద్యార్థులు విదేశాల్లో మృతి చెందారన్న విషయంపై స్పష్టత ఇచ్చింది కేంద్రం. చదవండి: అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు -
13కు చేరిన మృతులు
ఆరిలోవ(విశాఖతూర్పు)/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/తాటిచెట్లపాలెం(విశాఖఉత్తర): విజయనగరం జిల్లా భీమాలి–ఆలమండ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కి చేరింది. మొత్తం 50 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో 34 మందిని విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించగా.. మిగిలిన వారిని విశాఖ కేజీహెచ్, రైల్వే, ఇతర ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. ఇదిలా ఉండగా, విశాఖ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన పలాస ప్యాసింజర్‌లో స్పెషల్ గార్డుగా ఉన్న మరిపి శ్రీనివాసరావు(53) ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. విశాఖ ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతిచెందాడు. రైల్వే అధికారులు కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి మృత దేహాన్ని సోమవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆయనకు తల్లితో పాటు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న భార్య అమల, పీజీ చదువుతున్న కుమార్తె హర్షప్రియ, బీటెక్ చదువుతున్న కుమారుడు చంద్రదీప్ ఉన్నారు. మృతిచెందిన లోకో పైలట్ మధుసూదనరావు(ఫైల్), మృతిచెందిన పలాస ప్యాసింజర్ గార్డు శ్రీనివాసరావు(ఫైల్) శ్రీనివాసరావుది పార్వతీపురం కాగా, ఉద్యోగ రీత్యా విశాఖలో స్థిరపడ్డారు. అలాగే, రాయగడ ప్యాసింజరుకు లోకో పైలట్‌గా ఉన్న విశాఖ జిల్లా తంగేడు గ్రామానికి చెందిన శింగంపల్లి మధుసూదనరావు(53) ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య సూర్యలత, ఇద్దరు కుమార్తెలున్నారు. ఉద్యోగరీత్యా మధుసూదనరావు కుటుంబం సహా విశాఖలో ఉంటున్నారు. విశాఖ కేజీహెచ్‌లో ఇద్దరికి శస్త్ర చికిత్స విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడ్డవారిలో నలుగురిని కేజీహెచ్‌కు తరలించగా.. వారిలో ఇద్దరికి శస్త్రచికిత్సలు నిర్వహించారు. విజయనగరం జిల్లా జామి మండలానికి చెందిన నల్ల కుమారి, విశాఖ జిల్లా గాజువాక దయాల్‌నగర్ ప్రాంతానికి చెందిన ముర్రు లక్ష్మిలకు సోమవారం శస్త్ర చికిత్స నిర్వహించారు. నల్ల కుమారికి ఆర్థోపెడిక్ వార్డులో శస్త్ర చికిత్స అనంతరం ప్లాస్టిక్ సర్జరీ వార్డుకు తరలించినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. లక్ష్మికి సాయంత్రం అత్యవసరంగా శస్త్ర చికిత్స చేశామన్నారు. శ్రీకాకుళం జిల్లా సింగపురం గ్రామానికి చెందిన మోహిద వరలక్ష్మి, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం నడగాం గ్రామానికి చెందిన గొట్ట కమలమ్మలు చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా, రైలు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్సలు అందించడానికి, పోస్టుమార్టం నిర్వహించడానికి ముగ్గురు ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులను విజయనగరం పంపినట్లు ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.బుచ్చిరాజు తెలిపారు. అలాగే ఆర్థోపెడిక్ వైద్యుడు భగవాన్ను క్షతగాత్రులకు వైద్య సేవలు అందించడానికి విజయనగరం పంపినట్టు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.అశోక్‌కుమార్ చెప్పారు. విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో గాయపడినవారిలో 8మందిని విశాఖ తరలించారు. వీరిలో నలుగురు కేజీహెచ్‌లో, మరొకరు ఆరిలోవ హెల్త్ సిటీలో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురిని రైల్వే హాస్పిటల్లో చేర్పించారు. వీరిలో పలాస పాసింజర్ స్పెషల్ గార్డు మరిపి శ్రీనివాసరావు ఆదివారం రాత్రే మృతిచెందారు. మిగిలిన బి.తేజేశ్వరరావు, పి.శ్రీనివాసరావు రైల్వే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరు కూడా రైల్వే ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ఆదివారం విధులు ముగించుకుని గోపాలపట్నం నుంచి పలాస రైలులో తమ సొంత ఊరు శ్రీకాకుళం వెళ్తూ ప్రమాదంలో గాయపడ్డారు. మృతుల వివరాలు 1. కె.రవి (గొడికొమ్ము, జామి మండలం, విజయనగరం జిల్లా) 2. గిడిజాల లక్ష్మి (ఎస్పీ రామచంద్రాపురం, జి.సిగడం మండలం, శ్రీకాకుళం జిల్లా) 3. కరణం అప్పలనాయుడు (కాపుశంభాం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా) 4. చల్లా సతీష్ (తోటపాలెం, విజయనగరం) 5. శింగంపల్లి మధుసూదనరావు (లోకో పైలట్, ఎన్ఏడీ, విశాఖపట్నం) 6. చింతల కృష్ణమనాయుడు (గ్యాంగ్మన్, కొత్తవలస, విజయనగరం జిల్లా) 7. పిల్లా నాగరాజు (కాపుశంభాం, గరివిడి మండలం, విజయనగరం జిల్లా) 8. మరిపి శ్రీనివాసరావు (పలాస ప్యాసింజర్ గార్డ్, ఆరిలోవ, విశాఖపట్నం) 9. టెంకల సుగుణమ్మ (మెట్టవలస, జి.సిగడం మండలం, శ్రీకాకుళం జిల్లా) 10. రెడ్డి సీతంనాయుడు (రెడ్డిపేట, చీపురుపల్లి మండలం, విజయనగరం జిల్లా) 11. మజ్జి రాము (గదబవలస, గరివిడి మండలం, విజయనగరం జిల్లా) 12. సువ్వారి చిరంజీవి (లోకో పైలట్, కుశాలపురం, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా) 13. ఒక మృతదేహం ఆచూకీ తెలియాల్సి ఉంది. రైలు ఒక్కసారిగా కుదుపునకు గురైంది.. నేను విజయనగరం జిల్లా రాజాంలో తృతీయ సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతున్నా. రెండు రోజుల సెలవులకు విశాఖ వచ్చి తిరుగు ప్రయాణంలో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్లో ఆదివారం సాయంత్రం పలాస ట్రైన్ ఎక్కా. చీపురుపల్లిలో దిగాలి. ఆఖరి చివరి నుంచి రెండో బోగీలో ఉన్నాను. సాయంత్రం వేళలో రైలు ఒక్కసారిగా కుదుపునకు గురైంది. రైల్లోని లగేజ్ షెల్ఫ్‌లో ఉన్న సామాన్లు నాపై పడ్డాయి. దీంతో కంగారుపడ్డాను. ఒక్కసారిగా బోగీ 45 డిగ్రీల కోణంలో ఒరిగిపోయింది. నేను, నా స్నేహితుడు కలిసి బోగీలోని రాడ్లను పట్టుకుని బయటకు వచ్చేశాం. – వి.అవినాష్, ఇంజినీరింగ్ విద్యార్థి, మునగపాక -
2 వేలు దాటిన అఫ్గాన్ మరణాలు
కాబూల్: అఫ్గానిస్తాన్ పశి్చమ ప్రాంతాన్ని శనివారం కుదిపేసిన పెనుభూకంపంలో మృతుల సంఖ్య రెండువేలు దాటింది. తీవ్ర భూప్రకంపనల కారణంగా మట్టితో నిర్మించిన వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఆరు గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎటు చూసినా శిథిలాలు దుమ్ము ధూళితో నిండిపోయాయి. గత రెండు దశాబ్దాల్లో ఇలాంటి పెను భూకంపం అఫ్గాన్‌ను కుదిపేయడం ఇదే మొదటిసారి. గత ఏడాది జూన్‌లో అఫ్గానిస్తాన్‌లోని పర్వత ప్రాంతాల్లో సంభవించిన భూకంపంలో కనీసం వెయ్యి మంది చనిపోయారు. అఫ్గాన్‌లో నాలుగో అతి పెద్ద నగరమైన హెరాత్ కేంద్రంగా శనివారం భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. మృతుల సంఖ్య 2,100కి చేరువలో ఉందని ఆదివారం తాలిబన్ సమాచార, సాంస్కృతిక శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ వాహిద్ రయాన్ చెప్పారు. మరో 9,240 మందికి తీవ్ర గాయాలయ్యాయని 1,320 ఇళ్లు నేలమట్టమయ్యాయని ఆయన తెలిపారు. డజనుకి పైగా బృందాలు అత్యవసర సహాయ చర్యల్లో మునిగిపోయాయి. కొన్ని గ్రామాల్లోకి సహాయ సిబ్బంది అడుగు పెట్టడానికి కూడా వీల్లేకుండా శిథిలాలతో నిండిపోయాయి. ఎటు చూసినా శిథిలాల్లో చిక్కుకున్న వారి రోదనలే వినిపిస్తున్నాయి. శిథిలాల కింద ఉన్న వారిని కాపాడడానికి సహాయ బృందాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ చేతులనే ఆయుధాలుగా చేసుకొని శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ గుట్టలు గుట్టలుగా శవాలు బయటకి వస్తున్నాయి. మరికొందరు స్థానికులు శిథిలాల మీద పాకుతూ వెళుతూ వాటిని తొలగిస్తున్నారు. కొన ఊపిరితో ఉన్న వారిని కాపాడుతున్నారు. హెరాత్‌లో నేలమట్టమైన ఓ ఇంటి శిథిలాల్లో నుంచి ఆదివారం ఒక శిశువును అక్కడి వారు కాపాడుతున్న దృశ్యాన్ని అసోసియేటెడ్ ప్రెస్ ప్రసారం చేసింది. అక్కడే శిథిలాల నుంచి ఓ మహిళ చేయి బయటికి కనిపిస్తుండటం కూడా రికార్డయ్యింది. ఆ మహిళ చిన్నారి తల్లేనని స్థానికులు తెలిపారు. ఆమె బతికున్నదీ లేనిదీ స్పష్టం కాలేదు. క్షతగాత్రులకు చికిత్స అందించడానికి వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. బాధితులకు అందుతున్న సాయం.. అఫ్గాన్‌లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి నుంచి భూకంప బాధితుల్ని కాపాడేందుకు యూనిసెఫ్ దుస్తులు, దుప్పట్లు, టార్పాలిన్లు తదితరాలను పంపించింది. ఐరాస వలసల విభాగం నాలుగు అంబులెన్సులు, వైద్యులు, ఇతర సిబ్బందిని అక్కడి ఆస్పత్రికి పంపించింది. మూడు మొబైల్ వైద్య బృందాలను జెందాజన్ జిల్లాకు పంపిస్తున్నట్లు వెల్లడించింది. డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ కూడా 80 మంది రోగులకు సరిపోయే అయిదు మెడికల్ టెంట్లను హెరాత్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం వంటి సంస్థలు కూడా అత్యవసరాలను అఫ్గానిస్తాన్‌కు అందజేస్తామని ప్రకటించాయి. -
అఫ్గాన్‌లో భూకంపం..120 మంది మృతి
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌లో సంభవించిన భూకంపంలో 120 మంది చనిపోగా, 1000 మందికి పైగా గాయాలపాలయ్యారు. భూకంపం తాకిడికి హీరట్ ప్రావిన్స్ జెందా జాన్ జిల్లాలోని నాలుగు గ్రామాల్లోని డజన్లకొద్దీ ఇళ్లు ధ్వంసమయినట్లు అఫ్గాన్ జాతీయ విపత్తు సంస్థ తెలిపింది. అఫ్గాన్–ఇరాన్ సరిహద్దులకు సమీపంలోని హీరట్ పరిసరాల్లో శనివారం మధ్యాహ్నం కనీసం ఏడుసార్లు భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే(యూఎస్జీఎస్) పేర్కొంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైందని పేర్కొంది. భూకంప నష్టం, మృతులకు సంబంధించి తాలిబన్ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయలేదు. Today’s earthquake in Herat province of Afghanistan has completely destroyed four villages and many people have lost their lives. May Allah have mercy on them. pic.twitter.com/zWArtneBZs — اماراتي ځـدراڼ (@AmaratyD34809) October 8, 2023 #Blak_Day 11 members of a family living in this house have lost their lives and are buried under the rubble of their house. Their house has completely collapsed, their bodies are still under the rubble. Today’s earthquake in Herat & Badghis provinces of Afghanistan has caused hug pic.twitter.com/RE5p6ytL2G — ابو محمد عمر (@MdafYn) October 8, 2023 -
గల్లంతైన వారిలో 62 మంది సురక్షితం
గ్యాంగ్‌టక్/జల్పాయ్గురి: సిక్కింలో తీస్తా నదికి బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారిలో 62 మంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో, గల్లంతైన వారి సంఖ్య 143 నుంచి 81కి తగ్గిపోయింది. మరోవైపు, వరదల్లో మృతుల సంఖ్య 30కి చేరుకుంది. మరో వైపు, గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వరదల్లో గల్లంతైన 22 మంది ఆర్మీ సిబ్బందిలో మరో రెండు మృతదేహాలు శనివారం బయటపడ్డాయి. దీంతో, ఇప్పటి వరకు 9 మంది జవాన్ల మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు చెప్పారు. నాలుగు జిల్లాల్లోని సుమారు 42 వేల మంది ప్రజలపై వరదలు ప్రభావం చూపగా, 1,320 నివాసాలు దెబ్బతిన్నాయని, 13 వంతెనలు కొట్టుకుపోయాయని రాష్ట్ర యంత్రాంగం శనివారం తెలిపింది. తీవ్రంగా గాయపడిన 26 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. మంగన్ జిల్లాలోని లచెన్, లచుంగ్ల్లో వరద ముంపులో చిక్కుకున్న సుమారు 3వేల మంది పర్యాటకులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని బయటకు తరలించేందుకు వైమానిక దళానికి చెందిన ఎంఐ–17 హెలికాప్టర్లతో ప్రయత్నించినప్పటికీ వాతావరణం అనుకూలించలేదని అధికారులు చెప్పారు. చుంగ్థంగ్ ప్రాంతంలో చిక్కుకుపోయిన పర్యాటకులకు హెలికాప్టర్ ద్వారా అత్యవసరాలను సరఫరా చేశారు. సింగ్టమ్, బర్దంగ్, రంగ్పోల్లోని వారిని రక్షించే పనుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తలమునకలై ఉన్నాయి. అనూహ్య వరదలతో చుంగ్థంగ్ పట్టణం 80 శాతం మేరకు తీవ్రంగా దెబ్బతింది. వరద ప్రభావిత మాంగన్ జిల్లాను సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ శనివారం సందర్శించారు. సహాయక కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. అన్ని శాఖల అధికారులతో కూడిన అధికారుల కేంద్ర బృందం ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాలకు పంపుతున్నట్లు కేంద్ర మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా చెప్పారు. ఇలా ఉండగా, వచ్చే అయిదు రోజులపాటు మంగన్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ 150 మంది తృటిలో తప్పించుకున్నారు తీస్తా నదికి సమీపంలోని సిక్కిం– పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో రైల్వే సొరంగం పనుల్లో పాల్గొంటున్న సుమారు 150 మంది కార్మికులు ఆకస్మిక వరదల నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎగువ నుంచి భారీగా వరద ముంచుకొస్తున్న సమాచారాన్ని అధికారులు కాలింపాంగ్ జిల్లా జీరో మైల్ ప్రాంతం వద్ద ఉన్న ప్రైవేట్ రైల్వే కాంట్రాక్ట్ సంస్థకు చేరవేశారు. సంస్థ అధికారులు వెంటనే ఒక సెక్యూరిటీ గార్డును హుటాహుటిన కార్మికులుండే క్యాంపునకు పంపించారు. పగలంతా పనులు చేసి, అలసిపోయి క్యాంపుల్లో నిద్రిస్తున్న కార్మికులను గార్డు అప్రమత్తం చేశారు. దాదాపు 150 మంది కార్మికులు ఉన్నఫళంగా విలువైన పత్రాలు, దగ్గరున్న డబ్బు, కట్టుబట్టలతో అక్కడి నుంచి అడ్డదారిన బయలుదేరారు. దాదాపు 20 నిమిషాల అనంతరం ప్రధాన రహదారికి వద్దకు చేరుకున్నారు. అప్పటికే వరద దిగువనున్న వారి క్యాంపును మింగేయడం కళ్లారా చూసి కార్మికులు షాక్ అయ్యారు. అప్పటికే అక్కడున్న ట్రక్కుల్లో 2 కిలోమీటర్ల దూరంలోని రాంబి బజార్లో ఏర్పాటు చేసిన క్యాంప్‌నకు చేరుకున్నారు. వీరంతా అస్సాం, బిహార్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వారు. -
లిబియా మరణాలు..11 వేలకు పైనే
డెర్నా: లిబియాలోని డెర్నాలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య శుక్రవారానికి 11 వేలు దాటింది. జాడ తెలియకుండా పోయిన మరో 10 వేల మంది కోసం అన్వేషణ ముమ్మరంగా సాగుతోంది. నివాస ప్రాంతాలను తుడిచిపెట్టిన మట్టి, బురద తొలగింపు పనులు సాగుతున్నాయి. సోమవారం సంభవించిన భారీ వర్షాలు, వరదలతో ఎగువనున్న రెండు జలాశయాలు బద్దలై ఒక్కసారిగా డెర్నా నగరాన్ని నీటి ప్రవాహం ముంచెత్తిన విషయం తెలిసిందే. -
డెర్నా సిటీ మేయర్ అనుమానం
డెర్నా: వరదలు, రెండు డ్యామ్‌ల నేలమట్టంతో జనావాసాలపైకి జల ఖడ్గం దూసుకొచ్చి వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన లిబియాలో పరిస్థితి కుదుటపడలేదు. డేనియల్ తుపాను మిగిలి్చన విషాదం నుంచి డెర్నా నగరం తేరుకోలేదు. అక్కడ ఇంకా వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. 5,500 మందికిపైగా చనిపోయారని అధికారులు ప్రకటించగా మృతుల సంఖ్య 20,000కు చేరుకోవచ్చని సిటీ మేయర్ అబ్దెల్ మోనియమ్ అల్ ఘైతీ అనుమానం వ్యక్తంచేశారు. -
‘మిజోరం’ ప్రమాదం.. 22కు చేరిన మృతులు
ఐజ్వాల్: మిజోరంలోని ఐజ్వాల్‌లో బుధవారం నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. గురువారం సాయంత్రం వరకు మొత్తం 22 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. జాడ తెలియకుండా పోయిన మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. అతడు ప్రాణాలతో ఉండే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయన్నారు. క్షతగాత్రులైన ముగ్గురిలో ఇద్దరిని ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జి చేశారు. బాధితులైన మొత్తం 26 మందీ పశి్చమ బెంగాల్‌లోని మాల్డా జిల్లాకు చెందిన వారే. -
Sudan Conflict: 400 మందికి పైగా మృతి.. వేల మందికి గాయాలు
న్యూయార్క్: సూడాన్ అంతర్యుద్ధంలో 413 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(RSF)కు నడుమ అక్కడ భీకర యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంతర్యుద్ధంలో చిన్నారులే ఎక్కువగా బాధితులవుతున్నట్లు ఐరాస మరో విభాగం యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి మార్గరేట్ హ్యారిస్ మీడియాతో మాట్లాడుతూ.. సూడాన్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ అంతర్యుద్ధంలో 413 మంది సాధారణ పౌరులు మృతి చెందారని, అలాగే 3,551 మంది గాయపడ్డారని వెల్లడించారు. అలాగే.. అక్కడి ఆరోగ్య కేంద్రాలపైనా దాడులు జరుగుతున్నాయని ఆమె వెల్లడించారు. ఇదే సమావేశంలో యూనిసెఫ్ ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ మాట్లాడుతూ.. ఈ పోరులో పిల్లలే ఎక్కువగా బాధితులైనట్లు వెల్లడించారు. తొమ్మిది మంది చిన్నారులు మరణించారు, 50 మందికిపైగా గాయపడ్డారని వెల్లడించారాయన. అలాగే.. చాలామంది ఇళ్లలోనే చిక్కుకుపోయారని, చాలా ప్రాంతాలు అంధకారంలో కూరుకపోయాయని తెలిపారు. ఆహారం, మంచి నీరు, మందులు లేక వాళ్లు అల్లలాడుతున్నారని, మరోవైపు చికిత్స అందించాల్సిన ఆస్పత్రులే నాశనం అవుతున్నాయంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సూడాన్ ప్రపంచంలోనే పిల్లలో పోహకాహారలోపం రేటు అత్యధికంగా ఉన్న దేశమని యూనిసెఫ్ ఈ సందర్భంగా గుర్తు చేసింది. ప్రస్తుత పరిస్థితులతో యాభై వేలకు పైగా చిన్నారుల జీవితం ప్రమాదంలో పడిందని తెలిపింది. సూడాన్‌లో 2021 అక్టోబర్ నుంచి ప్రభుత్వం లేకుండానే ఎమర్జెన్సీలో నడుస్తోంది. మిలిటరీ అప్పటి ప్రధాని అబ్దల్లా హందోక్ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. గత శనివారం నుంచి సూడాన్ రాజధాని ఖార్తోమ్, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఆర్మీకి, పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌కు నడుమ పోరాటం నడుస్తోంది. అధికార దాహం నుంచి పుట్టిందే ఈ అంతర్యుద్ధం -
టర్కీలో వరదల బీభత్సం.. 14 మంది మృతి
అంకారా: ప్రకృతి ప్రకోపంతో టర్కీ వణికిపోతోంది. వేలాది మందిని బలిగొన్న భీకర భూకంప ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న టర్కీలో వరదలు ముంచెత్తుతున్నాయి. అదియమాన్, సాన్లీయుర్ఫా ప్రావిన్స్‌లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వరదల వల్ల ఇప్పటిదాకా 14 మంది మృతిచెందారని, వేలాది మంది నిరాశ్రయులయ్యారని అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. కనీసం ఇద్దరు కనిపించకుండాపోయారని తెలియజేశాయి. -
H3N2 Influenza: గుజరాత్లో తొలి హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా మరణం..
గాంధీనగర్: భారత్‌లో ఇన్‌ఫ్లూయెంజా ఉపరకం H3N2 కేసులతోపాటు మరణాల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. తాజాగా గుజరాత్లో హెచ్3ఎన్2 తొలి మరణం సంభవించింది. ఈ వైరస్‌కు గురైన 58 ఏళ్ల మహిళ వడోదరలోని ఎస్ఎస్జీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు గుజరాత్ అధికారులు మంగళవారం వెల్లడించారు. దీంతో హెచ్3ఎన్2 కారణంగా ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 7కు పెరిగింది. ఈ వైరస్‌కు గురై తొలి మరణం కర్ణాటకలో చోటుచేసుకుంది. హాసన్ జిల్లాకు 82 ఏళ్ల వ్యక్తి ఇన్ఫ్లుయెంజా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. కాగా జనవరి 2 నుంచి మార్చి 5 మధ్య భారతదేశంలో 451 హెచ్3ఎన్2 వైరస్ కేసులు నమోదైనట్లు శుక్రవారం కేంద్ర వైద్యాఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే దేశంలో వైరస్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అంతేగాక ఈ నెలఖరు నాటికి కేసులు తగ్గుముఖం పట్టనున్నట్లు అంచనా వేసింది. మరోవైపు హెచ్3ఎన్2 వైరస్ కారణంగా ఇన్‌ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నందున దేశంలో మాస్క్‌ల వాడకం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, అలాగే ఏటా ఫ్లూ వ్యాక్సిన్లు తీసుకోవం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచించారు. ప్రజలు సొంత మెడికేషన్ తీసుకోరాదని, ముఖ్యంగా యాంటీబయాటిక్స్ వాడవద్దని ఐసీఎంఆర్ ఇటీవల హెచ్చరించింది. హెచ్3ఎన్2 ఇన్ఫ్లుయెంజా వైరస్ నాన్ హ్యూమన్ ఇన్ఫ్లుయెంజా అని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఓ ప్రకటనలో పేర్కొంది. దగ్గు, ముక్కు కారడం(జలుబు), వాంతులు, విరేచనాలు, ఒళ్లు నొప్పి వంటి సాధారణ లక్షణాలుగా పేర్కొంది. -
టర్కీ, సిరియా భూకంపం: 50 వేలు దాటిన మృతుల సంఖ్య
అంకారా: టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రకృతి విలయంలో ఇప్పటి వరకు రెండు దేశాల్లో 50,000పైగా మృతి చెందారు. ఒక్క టర్కీలోనే 44,218 మంది మరణించినట్లు డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు శుక్రవారం వెల్లడించారు. అదే విధంగా సిరియాలో 5,914 మంది మృతి చెందినట్లు తెలిపారు. దీంతో రెండు దేశాల్లో కలిపి మరణించిన వారి సంఖ్య 50 వేలు దాటింది. కాగా ఫిబ్రవరి 6న తుర్కియే, సిరియాలో సెను భూకంపాలు వచ్చిన విషయం తెలిసిందే. అత్యంత హృదయ విదారకమైన ప్రకృతి వైపరీత్యాల్లో ఇదీ ఒకటి. తెలవారుతూండగానే 7.8 తీవ్రతతో నమోదైన భూకంపం వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది. ఘోర విపత్తులో ఎత్తైన భవనాలు నెలకొరిగాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 1,60,000 భవనాలు, 5,20,000 అపార్టుమెంట్లు ధ్వంసమవడం లేదా దెబ్బతినడం జరిగిందని అక్కడి ప్రభుత్వాలు వెల్లడించాయి. అయితే ఇంతటి విషాదం తర్వాత కూడా టర్కీలో పలుమార్లు మళ్లీ భూకంపాలు నమోదవ్వడం గమనార్హం. -
శిథిలాల్లో 'అద్భుతం'.. 228 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడి..
తుర్కియే, సిరిమాలో సంభవించిన వరుస భూకంపాలు మాటలకందని విషాదాన్ని నింపాయి. ఘోర విపత్తు తలెత్తి 9 రోజులు అవుతున్నా.. నేటికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎటుచూసినా కూలిన భవనాల శిథిలాలు.. వాటి కింద చితికిన బతుకులే దర్శనమిస్తున్నాయి. భూకంప ధాటికి భవనాలు పేకమేడల్లా కూలడంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.. వేలాది మంది విగతా జీవులుగా మారారు. మరికొందరు అయిన వారిని కోల్పోయి అనాథలుగా మిగిలారు. అసలు వారు ప్రాణాలతో ఉన్నారో లేరో తెలియని పరిస్థితి! ఘోర మృత్యుకంపం ధాటికి ఇరు దేశాల్లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 41 వేలు దాటింది. మొత్తంగా భారీ భూకంపం రెండు దేశాల్లో పూడ్చుకోలేని నష్టాన్ని, తీరని శోకాన్ని మిగిల్చింది. అయితే ఇప్పటికీ పలుచోట్ల చిన్నారులు, మహిళలతో సహా కొంతమంది ప్రాణాలతో బయటపడటం అద్భుతమనే చెప్పాలి. భూకంపం వచ్చిన 9 రోజుల తర్వాత కూడా ఇద్దరు మహిళలు సజీవంగా బయటపడ్డారు. తుర్కియేలోని కహ్రామన్మారస్లో శిథిలాల కింద చిక్కుకున్న 45 ఏళ్ల మెలికే ఇమామోగ్లు, 74 ఏళ్ల సెమిలే కెకెక్ అనే ఇద్దరి మహిళలను రెస్క్యూ సిబ్బంది బుధవారం సురక్షితంగా బయటకు తీశారు. మహిళను రక్షించి అంబులెన్స్‌లో ఆసపత్రికి తరలిస్తున్న దృశ్యాలను డారికా మేయర్ ముజాఫర్ బియిక్ షేర్ చేశారు. మరోవైపు భూకంపాల వల్ల తీవ్రంగా ప్రభావితమైన మరో తుర్కియే నగరం అంటాక్యాలో 228 గంటల తర్వాత (గురువారం) శిథిలాల కింద నుంచి ఎరిల్మాజ్ అనే మహిళతోపాటు ఆమె ఇద్దరు పిల్లలను సజీవంగా బయటకు తీశారు. రక్షించిన సిబ్బందితో మొదటగా ఆమె ‘ఇది ఏ రోజు’ అని అడగటం గమనార్హం. అంతేగాక తుర్కియేలో ధ్వంసమైన భవనం శిథిలాల నుంచి ముస్తఫా అనే 13 ఏళ్ల బాలుడిని రక్షించారు. సుమారు 74 దేశాలకు చెందిన సహాయక బృందాలు ప్రజలను ప్రాణాలతో కాపాడేందుకు నిరంతరం శ్రమిస్తున్నట్లు తుర్కియే ప్రభుత్వం తెలిపింది. Kahramanmaraş Dulkadiroğlu ilçesinde arama-kurtarma çalışmaları 9. günde de devam ediyor. Depremin 226. saatinde ekiplerimizin çalışmalarıyla enkaz altından canlı olarak çıkartılan 74 yaşındaki Cemile Kekeç teyzemizin kurtarma çalışmalarına şahitlik ettik. 📍Kahramanmaraş pic.twitter.com/PtL7XOcDo6 — Muzaffer Bıyık (@muzafferbiyik) February 15, 2023 -
ఘోర ప్రమాదం.. 39 మంది వలసదారులు మృతి
దక్షిణ అమెరికాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పనామాలో అమెరికాకు వలస వెళ్లే వారిని తీసుకెళ్తున్న బస్సు.. మరో మినీ బస్సును ఢీకొట్టింది. చిరికీలోని గ్వాలకాలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 39 మంది మృత్యువాతపడినట్లు పనామా జాతీయ వలసదారుల డైరెక్టర్ సమీరా గోజైన్ బుధవారం తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్, అతని సహాయకుడితోసహా మొత్తం 66 మంది ఉన్నారు. రాజధాని పనామా నగరానికి 400 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చిరీకి ప్రావిన్స్ రాజధాని నగరం డేవిడ్‌లోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తోంది. క్షతగాత్రుల సంఖ్యను, మృతుల వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది. తొలుత 15 మంది ప్రాణాలు కోల్పోగా తాజాగా మృతుల సంఖ్య 39కు పెరిగింది. కొలంబియా సరిహద్దులోని అడవి ప్రాంతం అయిన డేరియన్ నుంచి వలసదారులతో బస్సు బయల్దేరింది. వీరంతా పనామా, కోస్టా రికా, సెంట్రల్ అమెరికా, మెక్సికో గుండా చివరికి యునైటెడ్ స్టేట్స్కు ప్రయాణిస్తున్నారు. -
37 వేలు దాటిన భూకంప మృతులు.. లక్ష దాటే అవకాశం..!
ఇస్తాన్‌బుల్: తుర్కియే, సిరియాలో గత సోమవారం సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 37వేలకు చేరింది. ఇందులో టర్కీకి చెందిన వారు 31,643 మంది కాగా.. సిరియాకు చెందిన వారు 5,814 మంది అని అధికారులు తెలిపారు. శిథిలాలు మొత్తం తొలగిస్తే మృతుల సంఖ్య లక్ష దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా.. టర్కీ, సిరియాకు ఇతర దేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక బృందాలతో సాయం అందిస్తున్నాయి. టర్కీకి ఇప్పటికే భారత్ వైద్య, రెస్క్యూ బృందాలను పంపింది. మరోవైపు సిరియాకు రష్యా సాయం చేస్తోంది. ఆ దేశానికి చెందిన 300 మంది సైనికులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. pawsitivepawsrescues Miracle, after 7 days, this pittie survived buried from the earthquake in turkey! #Turkey #turkey🇹🇷 #Earthquake #survivor pic.twitter.com/lGjPVd2ksV — Rob Cardella (@RobertoCardel18) February 14, 2023 #Turkey Antakya before and after the devastating #earthquake pic.twitter.com/HolDmYrbRO — AlAudhli العوذلي (@AAudhli) February 14, 2023 చదవండి: అమెరికా మిచిగాన్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి