న్యూయార్క్ : వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ పలు దేశాలను వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 1,83,579 పాజిటివ్ కేసులు నమోదవగా 7,900 మందికి పైగా మరణించారు. పాకిస్తాన్‌లో 212 కేసులు నమోదు కాగా బుధవారం తొలి మరణం నమోదైంది. వైరస్ వేగంగా విస్తరిస్తున్న ఇరాన్‌లో కరోనా కేసుల సంఖ్య 988కి పెరగ్గా 135 మంది మరణించారు. స్సెయిన్‌లో తాజాగా 2000 కొత్త కేసులు నమోదవగా మొత్తం పాజిటివ్ కేసుట సంఖ్య ఏకంగా 11,000కు ఎగబాకింది.
మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తిని పర్యవేక్షిస్తున్న డబ్ల్యుహెచ్‌ఓలో ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయని అధికారులు ధ్రువీకరించారు. ఇక వైరస్‌కు కేంద్రమైన చైనాలో 80,881 కేసులు నమోదవగా మిగిలిన దేశాల్లో 94,000 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే క్రమంలో ఫిజర్, బయోఎన్‌టీ సంస్థలు సంయుక్తంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయనున్నాయి. డెడ్లీ వైరస్ వ్యాప్తితో ముందుజాగ్రత్త చర్యగా యూరో 2020 సాకర్ టోర్నమెంట్‌ను ఏడాది పాటు వాయిదా వేయగా, టీ-20 వరల్డ్‌కప్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment