Floods kills at least 14 in southeast Turkey - Sakshi
Sakshi News home page

మొన్న భూకంపం.. ఇప్పుడు వరదల బీభత్సం.. టర్కీలో 14 మంది మృతి

Published Thu, Mar 16 2023 8:00 AM | Last Updated on Thu, Mar 16 2023 10:49 AM

Turkiye Floods Many Dead - Sakshi

అంకారా: ప్రకృతి ప్రకోపంతో టర్కీ వణికిపోతోంది. వేలాది మందిని బలిగొన్న భీకర భూకంప ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న టర్కీలో వరదలు ముంచెత్తుతున్నాయి. అదియమాన్, సాన్లీయుర్ఫా ప్రావిన్స్‌లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

వరదల వల్ల ఇప్పటిదాకా 14 మంది మృతిచెందారని, వేలాది మంది నిరాశ్రయులయ్యారని అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. కనీసం ఇద్దరు కనిపించకుండాపోయారని తెలియజేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement