
సిరియా: ఇరాక్ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వ బలగాలు జరిపిన కాల్పుల్లో 27 మంది మృతి చెందారు. నజాఫ్ నగరంలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయానికి నిరసనకారులు బుధవారం అర్థరాత్రి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై ఇరాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామ అనంతరం నజాఫ్‌తోపాటు మిగతా నగరాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.
పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు బలగాలను భారీగా మోహరించింది. దీంతో నజాఫ్‌లో రెండు కీలక వంతెనలపై బైఠాయించిన ఆందోళనకారులను బలవంతంగా ఖాళీ చేసేందుకు బలగాలు ప్రయత్నించాయి. ఈ సందర్భంగా బలగాలు జరిపిన కాల్పుల్లో 23 మంది చనిపోగా 165 మందికి పైగా గాయపడ్డారు. బాగ్దాద్‌లో రక్షితప్రాంతంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించిన నిరసనకారులపైకి బలగాలు కాల్పులు జరపగా నలుగురు చనిపోగా 22 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.