Curfew imposed
-
మణిపూర్‌లో హై టెన్షన్.. పోలీసులు Vs ప్రజలు, విద్యార్థులు
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే 11 మంది మృతిచెందారు.అయితే, సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. తాజాగా జరిగిన హింసలో దాదాపు 11 మంది ప్రజలు మృతి చెందారు. ఇక, నిన్న(సోమవారం) కూడా పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఈరోజు విద్యార్థులు మణిపూర్‌లోని రాజ్‌భవన్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులపైకి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అటు నుంచి విద్యార్థులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. मणिपुर में प्रदर्शनकारियों ने राज्यपाल के घर पर किया पथराव. मोदी जी अभी रूस और यूक्रेन के बीच युद्ध रुकवाने में व्यस्त हैं!#ManipurVoilence #Manipur pic.twitter.com/t2E3honaQn— Newswala (@Newswalahindi) September 10, 2024 ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన ప్రభుత్వంలో పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. శాంతి భద్రతల రీత్యా తూర్పు, పశ్చిమ ఇంఫాల్‌ల జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా యంత్రాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. కర్ఫ్యూకు సంబంధించి కొత్త ఉత్తర్వులు జారీ చేసే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో అత్యవసర సేవలకు, మీడియాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.Imphal under CurfewIt seems to be the shortcut to maintaining law and order. @NBirenSingh @narendramodi @AmitShah After 16th months of #Manipurcrisis this is what you can come severely affecting the small-time business and unorganised workforce.#ManipurFightsBack… pic.twitter.com/2pDPUKTKrs— khaba (@krishnankh) September 10, 2024 ఏడాది నుంచి ఘర్షణలు..ఇదిలా ఉండగా.. ఏడాదికి పైగా కొనసాగుతున్న మణిపూర్ తెగల మధ్య ఘర్షణలు ఇంక తగ్గడం లేదు. కొండ ప్రాంతాల్లో నివసించే కుకీలు, మైదాన ప్రాంతాల్లో నివసించే మెయితీల మధ్య నెలకొన్న వైరం గత ఏడాది మే నెలలో ప్రత్యక్ష ఘర్షణలకు, దాడులకు దారితీసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ వివిధ స్థాయుల్లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. బీరెన్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మెయితీల పక్షం వహిస్తూ కుకీల అణచివేతకు తోడ్పడుతున్నదనే ఆరోపణలున్నాయి. The condition in Manipur has become very critical now…#Manipur #ManipurConflict #ManipurCrisis #ManipurFightsBack pic.twitter.com/R8GKNFUOGg— Anindya Das (@AnindyaDas1) September 10, 2024 మరోవైపు.. మణిపూర్ ఘర్షణల్లో 220 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇరు వర్గాల వారు ఉన్నప్పటికీ కుకీలే అధికంగా ఉన్నట్టు సమాచారం. మహిళలపై కనీవినీ ఎరుగని రీతిలో అమానుషమైన దాడులు జరగడం మణిపూర్‌కు మచ్చ తెచ్చింది. మణిపూర్‌లో మారణహోమాన్ని ఆపేందుకు కేంద్రం జోక్యం చేసుకోకపోగా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు మణిపూర్ గురించి, అక్కడి మహిళలపై జరుగుతున్న ఘోరాల గురించి మాట్లాడకపోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో పౌర ప్రభుత్వ పాలన పట్టు తగ్గిపోయి మిలిటెంట్ గ్రూపుల హవా పెరిగింది.ఇది కూడా చదవండి: పూటుగా మద్యం సేవించి.. బీజేపీ అధ్యక్షుడి కుమారుడి కారు బీభత్సంMatinee show for #ManipurCrisis. When #Meities have to stage a protest this is the precautions the state security forces react,in #Churachandpur and #Kangpokpi, #Kukis_Zo are allowed to march with guns. #ManipurConflict #iPhone16Plus #Kuki_ZoEngineeredManipurViolence #iPhone pic.twitter.com/28FPjkl4JH— Adu-Oirasu. (@themeiteitweets) September 10, 2024 Students are protesting in Manipur after the death of 9 People.The condition in Manipur is getting worse everyday.Godi media is busy in Hindu-Muslim Propaganda….they won’t show these things 👇pic.twitter.com/DHMUUwGilj— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) September 9, 2024 -
సావర్కర్ పోస్టర్ ఏర్పాటుపై ఉద్రిక్తత.. కర్ఫ్యూ విధింపు!
బెంగళూరు: వీర్ సావర్కర్ పోస్టర్ ఏర్పాటుపై కర్ణాటకలోని శివమొగ్గలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని అమీర్ అహ్మెద్ సర్కిల్లో వీర్ సావర్కర్ పోస్టర్ ఏర్పాటు చేశారు. హిందూ గ్రూప్స్ ఆ పోస్టర్‌ను కావాలనే ఏర్పాటు చేశాయని దానికి వ్యతిరేకంగా కొందరు ముస్లిం యువత ఆందోళనకు దిగారు. సావర్కర్ ఫ్లెక్సీని తొలగించేందుకు యత్నించారు. దీనిని వ్యతిరేకిస్తూ హిందూ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు శివమొగ్గ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. మరోవైపు మంగళూరులోనూ ఇలాంటి సంఘటనే ఎదురైంది. సూరత్కల్ జంక్షన్‌కు హిందూత్వ సిద్ధాంతకర్త సావర్కర్ పేరును మారుస్తూ బ్యానర్ ఏర్పాటు చేశారు. అయితే.. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో బ్యానర్‌ను తొలగించారు. మంగళూరు ఉత్తర నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే భరత్ షెట్టీ అభ్యర్థనతో సర్కిల్‌కు సావర్కర్ పేరు పెట్టేందుకు ఆమోదం తెలిపింది నగర కార్పొరేషన్. అధికారికంగా పేరు మార్చేందుకు ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం వేచి చూస్తోంది. ఈ క్రమంలో సూరత్కల్ సర్కిల్ చాలా సున్నితమైన ప్రాంతమని, సావర్కర్ పేరు పెట్టటాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎస్డీపీఐ స్థానిక కార్యకర్త ఒకరు తెలిపారు. ఇదీ చదవండి: Vinayak Damodar Savarkar: సముద్రంలోకి దూకి తప్పించుకున్న రోజు -
హింసాత్మకంగా మారిన నిరసనలు.. రాజధానిలో కర్ఫ్యూ విధింపు
మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు నిరసనలకు దిగాయి. పలు రాష్ట్రాల్లో శుక్రవారం మసీద్‌లో నమాజ్ ముగిసిన వెంటనే నిరసనకారులు ఆందోళనలకు దిగారు. కాగా, ముస్లింల ఆందోళనల్లో హింసాత్మక ఘటన చోటుచేసుకున్నాయి. జార్ఖండ్‌లో నిరసనకారులు.. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో, పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ క్రమంలో పోలీసులతో పాటు నిరసనకారులు కూడా గాయపడ్డారు. దీంతో రాంచీలో కర్ఫ్యూ విధించారు. ప్రజలందరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ మీడియాతో మాట్లాడుతూ.. నిరసనల గురించి సమాచారం అందింది. జార్ఖండ్ ప్రజలు ఎప్పుడూ చాలా సహనంతో ప్రశాంతంగా ఉంటారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని ప్రతీ ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని తెలిపారు. మరోవైపు.. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో కూడా హింసాత్మక ఘటనలు జరిగాయి. నిరసనకారులు వాహనాలకు నిప్పంటించారు. అనంతరం పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు నిరసనకారులపైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. #WATCH | Jharkhand: Protest over the controversial remarks by suspended BJP leader Nupur Sharma turned violent in Ranchi. Vehicles were torched and vandalised and stone-pelting occurred. Injuries reported. pic.twitter.com/Z5FIndjZzf — ANI (@ANI) June 10, 2022 #WATCH | West Bengal: A huge crowd gathers at Howrah in protest over the controversial remarks of suspended BJP leader Nupur Sharma & expelled BJP leader Naveen Kumar Jindal. pic.twitter.com/m8Bak7Q0nF — ANI (@ANI) June 10, 2022 ఇది కూడా చదవండి: టెన్షన్.. టెన్షన్.. పాతబస్తీలో మోహరించిన పోలీసులు.. వీడియో -
లంక దహనం
లంకకు నిప్పంటుకుంది. దేశం రణరంగంగా మారింది. ఆర్థిక సంక్షోభాన్ని తాళలేక జనంలో నెలకు పైగా నెలకొన్న ఆగ్రహావేశాలు ఒక్కసారిగా బద్దలయ్యాయి. అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టిన నిరసనకారులపై సోమవారం ప్రభుత్వ మద్దతుదారుల దాడితో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఆగ్రహించిన జనం దేశవ్యాప్తంగా రోడ్లపైకొచ్చారు. ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ మద్దతుదారులపై దాడులకు దిగారు. మహింద ఇంటితో పాటు రాజపక్సల పూర్వీకుల ఇంటిని కూడా తగలబెట్టారు. మంత్రులు, మాజీ మంత్రుల ఇళ్లపైనా దాడులకు దిగారు. వాటికి నిప్పు పెట్టారు. నిరసనకారులు చుట్టుముట్టడంతో అధికార పార్టీ ఎంపీ ఒకరు తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మహింద రాజపక్స (76) పదవి నుంచి తప్పుకున్నారు. దేశమంతటా కర్ఫ్యూ విధించారు. కొలంబోలో సైన్యం రంగంలోకి దిగింది. కొలంబో: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో పరిస్థితి పూర్తిగా కట్టుతప్పింది. దేశ ఆర్థిక పతనానికి ప్రభుత్వమే కారణమంటూ అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధికార నివాసం ముందు నిరసన చేస్తున్న వారిపై ప్రధాని మహింద నివాస సమీపంలో ఆయన అనుచరులు దాడికి దిగారు. నిరసనకారుల టెంట్లు, ప్లకార్డులను ధ్వంసం చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించినా లాభం లేకపోయింది. ఈ ఘర్షణల్లో 170 మందికి పైగా నిరసనకారులు గాయపడ్డారు. దాంతో జనం ఒక్కసారిగా రెచ్చిపోయారు. కొలంబో నుంచి తిరిగి వెళ్తున్న రాజపక్సల మద్దతుదారులపై విరుచుకుపడ్డారు. వారి వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు దొరికిని వారిని దొరికినట్టు చితకబాదారు. అంతేగాక దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులపై, రాజపక్స మద్దతుదారులపై నిరసనకారులు దాడులకు దిగారు. కురునెగలలోని ప్రధాని మహింద నివాసంతో పాటు హంబన్‌టోటలోని రాజపక్సల పూర్వీకుల నివాసానికి కూడా నిప్పు పెట్టారు. హంబన్‌టోటలో మహింద, గొటబయల డీఏ రాజపక్స జ్ఞాపకార్థం నిర్మించిన స్మారకాన్ని కూడా ధ్వంసం చేశారు. వాయవ్య శ్రీలంకలోని నిట్టంబువాలో అధికార శ్రీలంక పొడుజన పెరమున (ఎల్ఎల్పీపీ) ఎంపీ అమరకీర్తి (57) కారును అడ్డగించారు. ఆయన తన రివాల్వర్‌తో కాల్పులకు దిగడంతో ఒక నిరసనకారుడు చనిపోగా మరొకరు గాయపడ్డారు. ఆగ్రహించిన నిరనసకారులు వెంబడించడంతో ఎంపీ దగ్గర్లోని భవనంలో తలదాచుకున్నారు. స్థానికులు వేలాదిగా భవనాన్ని చుట్టుముట్టి లోనికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. భయాందోళనలకు లోనైన ఎంపీ తుపాకీతో కాల్చుకుని చనిపోయారని పోలీసులు తెలిపారు. ఆయన భద్రతాధికారి కూడా మరణించాడు. కురునెగలలోని మాజీ మంత్రి జాన్స్టన్ ఫెర్నాండోపై ఆందోళనకారులు దాడికి దిగారు. ఆయన నివాసాలకు, హోటల్‌కు నిప్పుపెట్టారు. నెగొంబోలోని మరో మాజీ మంత్రి నిమల్ లాంజా ఇంటిపై దాడికి పాల్పడ్డారు. మొరటువా మేయర్ సమన్ లాల్ ఫెర్నాండో ఇంటికి కూడా నిప్పుపెట్టారు. కొలంబోలోనూ ఘర్షణలు తారస్థాయికి చేరాయి. అధ్యక్ష భ వనం ముందు నిరసనకారులపై దాడికి నేతృ త్వం వహించిన అధికార పార్టీ కార్మిక విభాగం నేత మహింద కహందగమగె ఇంటిపై దాడి జరిగింది. ఘర్షణలు దేశవ్యాప్తంగా పలు పలుచోట్ల కాల్పులకు దారితీశాయి. వాటిలో కనీసం ఇద్దరు మరణించగా 9 మంది గాయపడ్డట్టు పోలీసులు తెలిపారు. కొలంబోలో రంగంలోకి సైన్యం ఘర్షణలు చెలరేగిన కొద్ది గంటలకే ప్రధాని మహింద అధ్యక్షునికి రాజీనామా లేఖ పంపారు. అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా తప్పుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఆయన రాజీనామాతో మంత్రివర్గమూ రద్దయింది. అల్లర్లపై గొటబయ, మహింద విచారం వెలిబుచ్చారు. ‘‘హింసకు హింస పరిష్కారం కాదు. ప్రజలు సంయమనం పాటించాలి’’ అంటూ ట్వీట్ చేశారు. అయితే మహిందే తనవారిని ఆందోళనకారులపై దాడులకు దిగేలా రెచ్చగొట్టారని విపక్షాలు దుయ్యబట్టాయి. మాజీ అధ్యక్షుడు ప్రేమదాసపైనా వారు దాడులకు దిగారని ఆరోపించాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొలంబోలో సైన్యం రంగంలోకి దిగింది. దేశవ్యాప్తంగా పోలీసులకు సెలవులను రద్దు చేశారు. రాజపక్స సోదరుల అస్తవ్యస్త విధానాలతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం తెలిసిందే. విదేశీ మారకద్రవ్య నిల్వలు పూర్తిగా అడుగంటడమే గాక నిత్యావసరాల ధరలు చుక్కలను కూడా దాటేశాయి. దాంతో జనం కన్నెర్రజేశారు. రాజపక్స సోదరులు అధికారం నుంచి తప్పుకోవాలంటూ ఏప్రిల్ 9న దేశవ్యాప్తంగా వీధులకెక్కారు. అప్పటి నుంచి నెల రోజులుగా ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. Footage of Government supporters assaulting protester at "GotaGoGama" pic.twitter.com/nAxkbQi1nX — NewsWire 🇱🇰 (@NewsWireLK) May 9, 2022 ఇది కూడా చదవండి: ‘ఒక వేళ నేను చనిపోతే?’.. ఎలన్ మస్క్ సంచలన ట్వీట్ -
శ్రీలంకలో ఆంక్షలు.. అల్లాడుతున్న లంకేయులు
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న వేళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లంకలో నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సేకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలకు దిగారు. దీంతో రాజపక్సే దేశంలో ఎమర్జెన్సీ విధించారు. దీంతో శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ అమలులోకి వచ్చింది. ఇదిలా ఉండగా లంకలో ఇంకా ఆందోళనలు కొనసాగుతుండటంతో వాటిని నిలువరించేందుకు ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో సోషల్ మీడియాపై నిషేధం విధించింది. దీంతో దేశంలో ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. కాగా, దేశంలోని పరిస్థితులపై తప్పుడు ప్రచారం బయటకు వెళ్లకుండా ఉండేదుకే ఇలా చేసినట్టు వివరణ ఇచ్చింది. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సోషల్ మీడియా నిషేధంపై ఆదేశాలు జారీ చేసింది. ఇక, అంతకు ముందు దేశవ్యాప్తంగా 36 గంటల కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ఆర్థిక సంక్షోభం, అధిక ధరలు, కరెంటు కోతలతో అల్లాడుతున్న శ్రీలంకకు భారత్ చేయూత అందించింది. మరో 40 వేల మెట్రిక్ టన్నుల డీజిల్ సరఫరా చేసింది. ఈ ట్యాంకర్లు శనివారం శ్రీలంక చేరాయి. ఇటీవలి కాలంలో ఇది లంకకు భారత్ అందించిన నాలుగో డీజిల్ సాయం. ఇక విద్యుదుత్పత్తి పెంచుతామని ప్రభుత్వం పేర్కొంది. గత 50 రోజుల్లో 2 లక్షల టన్నుల డీజిల్‌ను శ్రీలంకకు సరఫరా చేసినట్లు కేంద్రం తెలిపింది. 🇱🇰 Colombo: Defying national Protests, the Rajapaksa ruling dynasty declares a 36-hour nationwide curfew Saturday and deployed troops with sweeping new powers under a State of Emergency to halt protests against the Presidential family #GotaGottaGo #SkiLankaEconomicCrisis pic.twitter.com/JkONn02oJj — Anonymous (@YourAnonNews) April 2, 2022 -
లాక్డౌన్ పొడిగింపు.. ఆంక్షలు కఠినతరం
న్యూఢిల్లీ/చెన్నై: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కొంత తగ్గుముఖం పడుతూ రికవరీ రేటు పెరుగుతున్నప్పటికీ.. ముప్పు ఇంకా తొలగిపోలేదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు కరోనా సంబంధిత మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో చాలా రాష్ట్రాలు కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నాయి. ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. తాజాగా తమిళనాడు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరో వారం రోజులపాటు పొడిగించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పాక్షిక కర్ఫ్యూను మే 31 ఉదయం 7 గంటల దాకా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను ఇప్పటికే పొడిగించారు. ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. అందుకే లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు కొనసాగించక తప్పదని ఆయా రాష్ట్రాలు నిర్ణయించాయి. రాష్ట్రాల్లో లాక్డౌన్ పొడిగింపు ►తమిళనాడులో ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ ఈ నెల 24న ముగిసిపోవాల్సి ఉండగా, కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో మరో వారం రోజులు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ►దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 24 దాకా లాక్డౌన్ అమల్లో ఉంటుంది. లాక్డౌన్ పెట్టి నాలుగువారాలవుతోంది. ►హరియాణాలో మే 3 నుంచి లాక్డౌన్ అమల్లో ఉంది. దీన్ని మే 24 దాకా పొడిగించారు. ►చండీగఢ్‌లో వారాంతపు కర్ఫ్యూ ఆంక్షలను మే 25 దాకా కొనసాగించాలని నిర్ణయించారు. ►పంజాబ్‌లో కోవిడ్–19 ఆంక్షలను మే 31 దాకా పొడిగించారు. రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ►బిహార్‌లో తొలుత మే 4న లాక్డౌన్ విధించారు. మే 15 దాకా కొనసాగించాలని నిర్ణయించారు. ఇప్పుడు మే 25 వరకూ పొడిగించారు. ►జార్ఖండ్‌లో లాక్డౌన్ తరహా ఆంక్షలను మే 27 దాకా కొనసాగించనున్నారు. ►ఒడిశాలో జూన్ 1 దాకా లాక్డౌన్ ఉంటుంది. లాక్డౌన్ కొనసాగింపుపై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. ►మే 16 నుంచి 30 దాకా తమ రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ అమలవుతుందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. ►రాజస్తాన్‌లో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ నెల 24 దాకా ఆంక్షలుంటాయి. ►మధ్యప్రదేశ్‌లో 52 జిల్లాల్లో కరోనా కర్ఫ్యూను మే 31 దాకా పొడిగించారు. ►గుజరాత్లో 36 నగరాలు/పట్టణాల్లో రాత్రి పూట కర్ఫ్యూను మే 28 వరకూ ఉంటుంది. దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా పని చేస్తున్నాయి. ►చత్తీస్‌గఢ్‌లోని అన్ని జిల్లాల్లో లాక్‌డౌన్‌ను మే 31వ తేదీ వరకు పొడిగించారు. ►కేరళలో పూర్తిస్థాయి లాక్డౌన్ మే 23న ముగియాల్సి ఉండగా, మే 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ►కర్ణాటకలో లాక్‌డౌన్‌ను ఏకంగా రెండు వారాలపాటు పొడిగించారు. మే 24 నుంచి జూన్ 7వ తేదీ వరకూ లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ►తెలంగాణలో లాక్‌డౌన్‌ను మే 30 దాకా పొడిగించారు. ►ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూను మే 31 వరకూ పొడిగించారు. ►గోవాలో మే 31 దాకా కర్ఫ్యూ విధించారు. ►మహారాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ తరహా ఆంక్షలను జూన్ 1వ తేదీ వరకూ పొడిగించింది. ►అస్సాంలో ఆంక్షలను మరో 15 రోజులపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. ►నాగాలాండ్, మిజోరాంలో లాక్‌డౌన్‌ను 31 వరకూ పొడిగించారు. ►అరుణాచల్‌ప్రదేశ్‌లో కొన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను మే 31 వరకూ ప్రభుత్వం పొడిగించింది. ►మణిపూర్‌లో ఏడు జిల్లాల్లో మే 28 వరకూ కర్ఫ్యూ విధించారు. ►మేఘాలయాలోని ఈస్టుకాశీ జిల్లాలో లాక్డౌన్ ను మే 31వ తేదీ దాకా పొడిగించారు. ►త్రిపురలో ఈ నెల 26 వరకూ నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. ►సిక్కింలో ఈ నెల 24 దాకా లాక్డౌన్ అమల్లో ఉండనుంది. ►జమ్మూకశ్మీర్‌లో ఈ నెల 24 దాకా కర్ఫ్యూను పొడిగించారు. ►ఉత్తరాఖండ్‌లో మే 25 ఉదయం వరకూ కర్ఫ్యూను అమలు చేయనున్నారు. ►హిమాచల్‌ప్రదేశ్‌లో కర్ఫ్యూను మే 26 దాకా పొడిగించారు. -
కోవిడ్ సెకండ్ వేవ్: ఏపీలో అమల్లోకి వచ్చిన కర్ఫ్యూ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రజారోగ్యం దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. నేటి నుంచి రెండు వారాల పాటు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలు కానుంది.. మధ్యాహ్నం 12 గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే షాపులకు అనుమతి ఉంటుంది. కర్ఫ్యూ ఈనెల 18 వరకు కొనసాగనుంది. కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ప్రకటించింది. కర్ఫ్యూకు ప్రజలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. బ్యాంక్ సేవలు యథాతథం అయితే కర్ఫ్యూ నుంచి కొన్నింటికి మినహాయింపులు ప్రకటించింది. రాష్ట్రంలో బ్యాంక్ సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి. బ్యాంక్ సేవలకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. అలాగే జాతీయ రహదారుల పనులు కొనసాగించేందుకు అనుమతి ఉంది.పోర్టుల్లో కార్యకలాపాల నిర్వహణకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ బస్సుల రాకపోకలపై నిషేధం కాగా రోనా కట్టడి చర్యల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూను అతిక్రమించి రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. గుమిగూడడం, సమావేశాలు నిర్వహించడం వంటి వి పూర్తిగా నిషేధం. ఉదయం 6 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకూ 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఆ తరువాత కర్ఫ్యూ అమలవుతుంది. ఆ సమయంలో ఆటోలు, ఆర్టీసీ బస్సుల రాకపోకలపై కూడా నిషేధం ఉంది. 12 గంటల తరువాత ఆటోలు రోడ్ల పైకి వస్తే సీజ్ చేస్తా మని ప్రభుత్వం ప్రకటించింది. అత్యవసర సేవల వాహనాలను మాత్రం అనుమతించనున్నారు. అలాగే మీడియా వంటి అత్యవసర ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. ఉదయం పూట షాపులు తెరిచే సమయంలో వాహనాల రాకపోకలకు అనుమతి ఉంది. ఆ సమయంలో గుంపులు గుంపులుగా షాపింగ్‌లు చేయకూడదు. ఈ ఆంక్షలు రెండు వారాలు కొనసాగుతాయి. ఇప్పటికే ప్రభుత్వం రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తోంది. స్వీయ ఆంక్షలు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పట్టణాలతో పాటు పల్లెల్లో కూడా ఇప్పటికే జనం స్వచ్ఛందంగా స్వీయ ఆంక్షలు అమలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో టిఫిన్ సెంటర్లు, పాలు, ఇతర నిత్యావసర సరకుల దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలను మంగళవారం వరకూ సాయంత్రం 6 గంటలకే మూసివేస్తున్నారు. కొన్నిచోట్ల పగలు 12 గంటల తరువాత కొంతవరకూ స్వచ్ఛంద ఆంక్షలు విధించుకోవడంతో సాయంత్రం తర్వాత పట్టణాల్లో జనసంచారం తగ్గుతోంది. మధ్యాహ్నం నుంచి మర్నాడు ఉదయం వరకూ కర్ఫ్యూ విధిస్తే కరోనా వ్యాప్తి తగ్గే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. చదవండి: Andhra Pradesh Curfew: కర్ఫ్యూ మార్గదర్శకాలు ఇవే.. -
నేటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ..
సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ విస్త్రృతి రోజురోజుకూ పెరిగిపోతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 కట్టడికై కేజ్రీవాల్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. నేటి నుంచి ఏప్రిల్ 30 వరకు రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అయితే, అత్యవసరాలు, వాక్సినేషన్ కోసం ప్రయాణాలు చేసే వారికి ఈ- పాసులు జారీ చేస్తామని, కర్ఫ్యూ సమయంలో వారికి మాత్రం అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. అదే విధంగా, జర్నలిస్టులు, ప్రైవేటు డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి అనుమతిస్తామని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో సోమవారం కొత్తగా 3548 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 15 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఇక మహారాష్ట్ర, రాజస్తాన్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. చదవండి: కరోనా డేంజర్.. నెగటివ్ రిపోర్టు ఉంటేనే -
మరోసారి కరోనా విజృంభణ.. 14 వరకు కర్ఫ్యూ
పింప్రి: పుణే, పింప్రి–చించ్వడ్ కార్పొరేషన్ పరిధిలో కర్ఫ్యూను ఈ నెల 14వ తేదీ వరకు పెంచారు. మాస్క్ లేకుండా నగర రహదారులపై తిరుగుతున్న జనంపై అధికారులు కొరడా ఝలిపించారు. మంగళవారం ఒక్కరోజే ఆకస్మిక తనిఖీలు చేపట్టి మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న 853 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4.15 లక్షల జరిమానా వసూలు చేశారు. జరిమానా చెల్లించని వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు. కొద్ది రోజులు కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కార్పొరేషన్ అధికారులు తనిఖీలు మరమ్మరం చేశారు. అదేవిధంగా ఇరు నగరాలలో ఇదివరకు ఫిబ్రవరి 28వ తేదీ వరకు అమలులో ఉన్న కర్ఫ్యూను ఈ నెల 14వ తేదీ వరకు పెంచారు. జంట నగరాల్లో రోజు వేయికి పైగా కరోనా కేసులు, పదుల సంఖ్యలో మృతులు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చదవండి: (మీ ఇంట్లో శుభకార్యాలకు మారువేషాల్లో అధికారులు) -
రామమందిర భూమిపూజ.. చెలరేగిన అల్లర్లు
గువాహటి : అయోధ్యలో ప్రతిష్టాత్మక రామమందిరం భూమి పూజ కార్యక్రమ వేడుకల సందర్భంగా అస్సాంలో రెండు గ్రూపుల మధ్య అల్లర్లు చెలరేగడంతో కర్ఫ్యూ విధించారు. సోనిత్పూర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి 10 గంటల నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ అల్లర్ల సందర్భంగా దుండగులు ఓ కారు, మూడు మోటారు సైకిళ్లను దహనం చేసినట్లు అధికారులు గుర్తించారు. గువాహటిలోని పలు ప్రాంతాల్లో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడ 144 సెక్షన్ విధించారు. నలుగురి కంటే ఎవరూ గుమికూడరాదని అధికారులు పేర్కొన్నారు. రామమందిర శంకుస్థాపన నేపథ్యంలో అస్సాంలోని పలు ప్రాంతాల్లో శాంతి భద్రత సమస్యలు ఏర్పడటంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సంబంధిత ప్రాంతాల్లో ప్రజలెవరూ ర్యాలీలు చేయరాదని హెచ్చరించారు. (భారత్‌ను హిందూదేశంగా మార్చే శంకుస్థాపన) -
ఇరాక్ సైన్యం కాల్పుల్లో 27 మంది మృతి
సిరియా: ఇరాక్ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వ బలగాలు జరిపిన కాల్పుల్లో 27 మంది మృతి చెందారు. నజాఫ్ నగరంలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయానికి నిరసనకారులు బుధవారం అర్థరాత్రి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై ఇరాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామ అనంతరం నజాఫ్‌తోపాటు మిగతా నగరాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు బలగాలను భారీగా మోహరించింది. దీంతో నజాఫ్‌లో రెండు కీలక వంతెనలపై బైఠాయించిన ఆందోళనకారులను బలవంతంగా ఖాళీ చేసేందుకు బలగాలు ప్రయత్నించాయి. ఈ సందర్భంగా బలగాలు జరిపిన కాల్పుల్లో 23 మంది చనిపోగా 165 మందికి పైగా గాయపడ్డారు. బాగ్దాద్‌లో రక్షితప్రాంతంలోకి చొచ్చుకువచ్చేందుకు ప్రయత్నించిన నిరసనకారులపైకి బలగాలు కాల్పులు జరపగా నలుగురు చనిపోగా 22 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. -
జైపూర్ అల్లర్లు.. ఒకరి మృతి
సాక్షి, జైపూర్: ఓ చిన్న ఘటన పింక్ సిటీలో శుక్రవారం అర్థరాత్రి చిచ్చును రగిల్చింది. పోలీసులకు, స్థానికులకు మధ్య చెలరేగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా, 12 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ కొనసాగుతుండగా మొబైల్, ఇంటర్నెట్ సేవలను పోలీసులు నిలిపివేశారు. దీంతో జైపూర్ లో ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. రామ్‌గంజ్ ఏరియాలో పోలీసులు వాహనాల తనీఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పారిపోయేందు ప్రయత్నించగా, ఓ అధికారి లాఠీ విసరటంతో అతనికి యాక్సిడెంట్ అయ్యింది. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు పోలీస్ స్టేషన్‌పై విరుచుకుపడ్డారు. రాళ్లు విసిరి పోలీసులను గాయపరిచారు.దీంతో అల్లరి మూకను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరింత రెచ్చిపోయిన స్థానికులు ఓ పవర్ హౌజ్‌కు, ఓ ఆంబులెన్స్‌కు నిప్పుపెట్టారు. పలువురు జర్నలిస్ట్‌లకు కూడా గాయాలయినట్లు సమాచారం. హింసలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. తదుపరి ఆదేశాలు వెలువడేదాకా మనక్ చౌక్, సుభాష్ చౌక్, గల్తా గేట్, రామ్‌గంజ్ తదితర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఉన్నతాధికారి తెలిపారు. -
ఇండోర్‌లో ఘర్షణలు : 25 మందికి గాయాలు
ఇండోర్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ పట్టణంలోని చందన్ నగర్ ప్రాంతంలో ఓ ఆవు కళేబరం స్వాధీనం విషయమై రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం మత ఘర్షణలకు దారితీసింది. ఈ ఘర్షణల్లో ఎస్పీ, అదనపు ఎస్పీ వంటి పోలీసు ఉన్నతాధికారులు సహా మొత్తం 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో జిల్లా అధికారులు చందన్ నగర్లో మంగళవారం కర్ఫ్యూ విధించారు. ఓ ఆవు కళేబరం స్వాధీనం విషయమై ఓ మతానికి చెందిన ప్రజలు భారీ సంఖ్యలో రోడ్లపై గుమిగూడారు. ఈ సమయంలో మరో మతానికి చెందిన వ్యక్తులు వీరిపై రాళ్లు రువ్వడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. దీంతో చందన్ నగర్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీసులపై ఇరు మతాలకు చెందిన ఆందోళన కారులు మూకుమ్మడిగా రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో ఎస్పీ, అదనపు ఎస్పీ సహా 20 మంది పోలీసులు, మరో ఐదుగురు స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకుగాను పోలీసులు భాష్పవాయు గోళాలను వినియోగించి లాఠీ చార్జ్ చేశారు. మరోపక్క, అల్లర్లను అదుపు చేసేందుకుగాను జిల్లా మేజిస్ట్రేట్ కర్ఫ్యూ విధించారు.