మణిపూర్‌లో హై టెన్షన్‌.. పోలీసులు Vs ప్రజలు, విద్యార్థులు | Curfew Imposed In Manipur Capital Imphal West & East District, More Details Inside | Sakshi
Sakshi News home page

మణిపూర్‌లో హై టెన్షన్‌.. పోలీసులు Vs ప్రజలు, విద్యార్థులు

Published Tue, Sep 10 2024 3:00 PM | Last Updated on Tue, Sep 10 2024 5:55 PM

Curfew Imposed In Manipur Capital Imphal

ఇంఫాల్‌: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే 11 మంది మృతిచెందారు.

అయితే, సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుంచి మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. తాజాగా జరిగిన హింసలో దాదాపు 11 మంది ప్రజలు మృతి చెందారు. ఇక, నిన్న(సోమవారం) కూడా పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఈరోజు విద్యార్థులు మణిపూర్‌లోని రాజ్‌భవన్‌ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులపైకి పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. అటు నుంచి విద్యార్థులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. 

 

ఈ నేపథ్యంలో అలర్ట్‌ అయిన ప్రభుత్వంలో పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. శాంతి భద్రతల రీత్యా తూర్పు, పశ్చిమ ఇంఫాల్‌ల జిల్లాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ విధిస్తున్నట్లు జిల్లా యంత్రాగం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, కర్ఫ్యూ నేపథ్యంలో ప్రజలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. కర్ఫ్యూకు సంబంధించి కొత్త ఉత్తర్వులు జారీ చేసే వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో అత్యవసర సేవలకు, మీడియాకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.

 

ఏడాది నుంచి ఘర్షణలు..
ఇదిలా ఉండగా.. ఏడాదికి పైగా కొనసాగుతున్న మణిపూర్‌ తెగల మధ్య ఘర్షణలు ఇంక తగ్గడం లేదు. కొండ ప్రాంతాల్లో నివసించే కుకీలు, మైదాన ప్రాంతాల్లో నివసించే మెయితీల మధ్య నెలకొన్న వైరం గత ఏడాది మే నెలలో ప్రత్యక్ష ఘర్షణలకు, దాడులకు దారితీసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ వివిధ స్థాయుల్లో ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. బీరెన్‌ సింగ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మెయితీల పక్షం వహిస్తూ కుకీల అణచివేతకు తోడ్పడుతున్నదనే ఆరోపణలున్నాయి.

మళ్లీ మండుతున్న మణిపూర్

 

 

మరోవైపు.. మణిపూర్‌ ఘర్షణల్లో 220 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇరు వర్గాల వారు ఉన్నప్పటికీ కుకీలే అధికంగా ఉన్నట్టు సమాచారం. మహిళలపై కనీవినీ ఎరుగని రీతిలో అమానుషమైన దాడులు జరగడం మణిపూర్‌కు మచ్చ తెచ్చింది. మణిపూర్‌లో మారణహోమాన్ని ఆపేందుకు కేంద్రం జోక్యం చేసుకోకపోగా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు మణిపూర్‌ గురించి, అక్కడి మహిళలపై జరుగుతున్న ఘోరాల గురించి మాట్లాడకపోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో పౌర ప్రభుత్వ పాలన పట్టు తగ్గిపోయి మిలిటెంట్‌ గ్రూపుల హవా పెరిగింది.

ఇది కూడా చదవండి: పూటుగా మద్యం సేవించి.. బీజేపీ అధ్యక్షుడి కుమారుడి కారు బీభత్సం

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement