
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో భారీ స్థాయిలో మృతుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య కంటే గతేడాది మృతుల సం ఖ్య గణనీయంగా తగ్గిందని రోడ్డు భద్రత విభాగం నివేదిక వెల్లడించింది. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తూ భారీగా జరిమానాలు చెల్లిస్తున్నారని స్పష్టం చేసింది. బుధవారం రోడ్డు భద్రత డీజీపీ కృష్ణ ప్రసాద్ ఈ నివేదికను విడుదల చేశారు. ఇందులో ప్రమాదాలు, మృతులు, క్షతగాత్రుల సంఖ్యతో పాటు దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ప్రమాద గణాంకాలను పొందుపరిచినట్టు తెలిపారు.
దేశవ్యాప్త ప్రమాద గణాంకాలు..
దేశవ్యాప్తంగా 2014–2016 వరకు జరిగిన ప్రమా దాలు, మృతులపై రోడ్డు భద్రత విభాగం గణాంకాలు విడుదల చేసింది. అదే విధంగా రాష్ట్ర గణాంకాలను సైతం విశ్లేషించింది. 2014లో దేశవ్యాప్తంగా 4.89లక్షల ప్రమాదాలు జరగ్గా.. అందులో 1.39 లక్షలమంది మృత్యువాతపడ్డారు. 2015లో 5.01 లక్షల ప్రమాదాలు జరగ్గా 1.46 లక్షల మంది మృతిచెందారు. 2016లో 4.80లక్షల ప్రమాదాలు జరగ్గా అందులో 1.50 లక్షలమంది ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో జరిగిన ప్రమాదాల్లో 2శాతం తగ్గుదల కనిపించడంతో పాటు మృతుల సంఖ్యలో 10శాతం తగ్గుదల కనిపిస్తోందని కృష్ణప్రసాద్ వెల్లడించారు. ప్రతీ 100 రోడ్డు ప్రమాదాల్లో 2014లో 34 మంది చనిపోతే, 2015లో 33మంది, 2016లో 31మంది, 2017లో 29 మంది మృతి చెందారని తెలిపారు.
ఉల్లం‘ఘనమే’..: నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనదారులు భారీస్థాయిలోనే జరిమానాలు చెల్లిస్తున్నా రు. ఏటా జరిమానాల చెల్లింపులు 20–30శాతం పెరిగిపోతే గతేడాది మాత్రం 50శాతానికి పైగా పెరిగిన ట్టు రోడ్డు భద్రత విభాగం అధ్యయనంలో తేలింది.
Comments
Please login to add a commentAdd a comment