తెప్ప ప్రమాదంలో 14కు చేరిన మృతుల సంఖ్య | Death toll rises to 14 in raft accident | Sakshi
Sakshi News home page

తెప్ప ప్రమాదంలో 14కు చేరిన మృతుల సంఖ్య

Published Sat, Apr 29 2017 9:43 AM | Last Updated on Tue, Sep 5 2017 9:59 AM

తెప్ప ప్రమాదంలో 14కు చేరిన మృతుల సంఖ్య

తెప్ప ప్రమాదంలో 14కు చేరిన మృతుల సంఖ్య

అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వై. తిమ్మన చెరువు గ్రామంలో తెప్ప తిరగబడిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. గల్లంతైన చిన్నారి శివ మృతదేహం శనివారం లభించింది. 14 మృతదేహాలకు గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వైటి చెరువు, బంతెర్ల, చెంచెలపాడు గ్రామాలకు తరలించారు. మృతుల్లో 10 మంది చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. తెప్పలో పరిమితికి మించి ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగింది.

తెప్ప ప్రమాదం ఘటనపై వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 3 లక్షల పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement