raft accident
-
కాకినాడ తీరంలో తిరగబడ్డ తెప్ప.. ఇద్దరు మత్స్యకారుల మృతి
సాక్షి, కాకినాడ: కాకినాడ తీరంలో తెప్ప తిరగబడటంతో ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో గల్లంతై మృతిచెందారు. సోమవారం రాత్రి సూర్యారావుపేట నుంచి హోప్ ఐల్యాండ్ వరకు అయిదుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. వేటక ముగించుకొని తిరిగి వస్తుండగా కెరటాల ధాటికి తెప్ప తిరగడింది. ఈ ఘటనలో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. బాధితులు దుమ్మలపేటకు చెందిన మైలపల్లి కృపాదాస్, సూర్యరావుపేటకు చెందిన సత్తిరాజుగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తెప్ప తిరగబడి సముద్రంలో పడటంతో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందిన విషయాన్ని కాకినాడ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. మత్స్యకారుల మృతి విషయాన్ని తెలుసుకున్న సీఎం చలించిపోయి వెంటనే ఒక్కొక్కరికి తక్షణ సాయంగా రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షలు నష్టపరిహారం మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు. -
థర్మాకోల్ తెప్ప బోల్తా.. విద్యార్థులు సురక్షితం
కాగజ్‌నగర్ టౌన్: కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం అందవెల్లి పెద్దవాగులో గురువారం ఉదయం ప్రమాదవశాత్తు థర్మాకోల్ తెప్ప బోల్తా పడింది. నలుగురు పాఠశాల విద్యార్థులు, ఇద్దరు కూలీలను తెప్పపై ఒడ్డుకు చేర్చుతుండగా ఒక్కసారిగా ఒకవైపు ఒరగడంతో వాగులో పడిపోయారు. కొందరు వాగులో నడుస్తూ తెప్పపై కూర్చోబెట్టి వాగు దాటిస్తుంటారు. ఇలా దాటిస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. దాటిస్తున్న ముగ్గురు వ్యక్తులు పడిపోయిన వారిని వెంటనే కాపాడి ఒడ్డుకు చేర్చారు. బ్యాగులు, కూలీల సెల్ఫోన్లు వాగులో పడిపోయాయి. ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అందవెల్లి పెద్దవాగుపై ఉన్న వంతెన ఇటీవలి భారీ వర్షాలకు కుంగిపోయింది. అధికారులు ఆ వంతెన మార్గాన్ని మూసివేయడంతో గత్యంతరం లేక ఇలా తెప్పలపై దాటుతున్నారు. తహసీల్దార్ ప్రమోద్ తెప్పలపై తరలింపును నిలిపి వేయించారు. -
తెప్ప ప్రమాదంలో 14కు చేరిన మృతుల సంఖ్య
అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వై. తిమ్మన చెరువు గ్రామంలో తెప్ప తిరగబడిన ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. గల్లంతైన చిన్నారి శివ మృతదేహం శనివారం లభించింది. 14 మృతదేహాలకు గుంతకల్లు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వైటి చెరువు, బంతెర్ల, చెంచెలపాడు గ్రామాలకు తరలించారు. మృతుల్లో 10 మంది చిన్నారులు, నలుగురు మహిళలు ఉన్నారు. తెప్పలో పరిమితికి మించి ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగింది. తెప్ప ప్రమాదం ఘటనపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 3 లక్షల పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: గుండె ‘చెరువు’!