‘రాయ్‌’ బీభత్సం.. ఫిలిప్పీన్స్‌లో 146 మంది బలి | Typhoon Rai: Death Toll Rises In Philippines More Than 100 Videos Viral | Sakshi
Sakshi News home page

Typhoon Rai: ‘రాయ్‌’ తుపాను బీభత్సం.. ఫిలిప్పీన్స్‌లో 146 మంది బలి

Dec 19 2021 6:15 PM | Updated on Dec 20 2021 10:46 AM

Typhoon Roy: Death Toll Rises In Philippines More Than 100 Videos Viral - Sakshi

ఇప్పటి వరకు 146 మంది చనిపోయినట్లు సమాచారం. తుపాను తీవ్ర ప్రభావం చూపిన ఒక్క బొహోల్‌ ప్రావిన్స్‌లోనే 72 మంది చనిపోగా, మరో 10 మంది

మనీలా: ఫిలిప్పీన్స్‌ను గురు, శుక్రవారాల్లో అతలాకుతలం చేసిన రాయ్‌ తుపాను తాకిడికి మృతి చెందిన వారి సంఖ్య 146కు చేరింది. గంటకు 195 నుంచి 270 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల ప్రభావం 7.80 లక్షల మంది ప్రజలపై పడిందని ప్రభుత్వం తెలిపింది. లక్షలాది మందికి నిలువ నీడలేకుండా చేసిందని తెలిపింది. సుమారు 3 లక్షల మందిని ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది.

పలు ప్రాంతాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వివిధ ఘటనల కారణంగా ఇప్పటి వరకు 146 మంది చనిపోయినట్లు సమాచారం. తుపాను తీవ్ర ప్రభావం చూపిన ఒక్క బొహోల్‌ ప్రావిన్స్‌లోనే 72 మంది చనిపోగా, మరో 10 మంది జాడ తెలియడం లేదని గవర్నర్‌ ఆర్థర్‌ చెప్పారు.  


 

 


 


 


(చదవండి: బంగారు గనుల తవ్వకాల్లో బయటపడ్డ వెయ్యికాళ్ల ప్రాణి!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement