న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. గంటలు గడిచేకొద్దీ రోగుల సంఖ్య, మరణాల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 14 లక్షలు దాటిపోగా... మరణాలు 82వేలు దాటిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 3లక్షల మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. ఒకవైపు అమెరికా, మరోవైపు యూరప్ కరోనా తీవ్రతకు గడగడలాడిపోతున్నాయి.
అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు దాదాపు 4లక్షలు దాటిపోగా.. 12వేల 857 మంది మృతిచెందినట్టు తెలుస్తోంది. స్పెయిన్‌లో లక్షా 41వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదుకాగా 14వేలకుపైగా మరణించారు. ఇటలీలో లక్షా 35వేలకుపైగా కేసులు ఉండగా 17వేల మందికిపైగా మరణించారు. ఫ్రాన్స్, జర్మనీలోనూ పాజిటివ్ కేసులు లక్ష దాటిపోయాయి. ఫ్రాన్స్‌లో కరోనాతో 10వేల మందికిపైగా మరణించగా, జర్మనీలో 2వేల మందికిపైగా చనిపోయారు. ఇక చైనాలో 81వేలకుపైగా పాజిటివ్ కేసులు ఉండగా 3వేల 331 మంది మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment