వనౌటులో భారీ భూకంపం | Death toll expected to rise in Vanuatu after earthquake | Sakshi
Sakshi News home page

వనౌటులో భారీ భూకంపం

Dec 18 2024 5:07 AM | Updated on Dec 18 2024 5:08 AM

Death toll expected to rise in Vanuatu after earthquake

పసిఫిక్‌ ద్వీప దేశంలో తీవ్ర నష్టం

వెల్లింగ్టన్‌(న్యూజీలాండ్‌): పసిఫిక్‌ ద్వీప దేశం వనౌటులో మంగళవారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 7.3గా నమోదైన ఈ భూకంపం తాకిడి తీవ్ర నష్టం సంభవించింది. పోర్ట్‌ విలాలోని వివిధ దేశాల దౌత్యకార్యా యాలున్న భవన సముదాయం సహా నేల మట్టమైన పలు భవనాల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష మయ్యా యి. పోర్ట్‌ విలాలోని నౌకాశ్రయం దెబ్బతింది. అక్కడి విమానాశ్రయంలో రాకపోకలు నిలిచిపోయాయి. 

పోర్ట్‌ విలా దౌత్య కార్యా లయంలోని తమ సిబ్బంది అందరూ సురక్షి తంగానే ఉన్నారని, ప్రస్తుతానికి కా ర్యాల యాన్ని మూసి వేశామని అమెరికా, ఆస్ట్రేలి యా తెలిపాయి. క్షతగాత్రులతో ఆస్పత్రులు నిండిపోయాయి. పలువురు మృతి చెందినట్లు చెబుతున్నారు. 

విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతినడంతో పూర్తి వివరాలు తెలియడం లేదు. ప్రజలను తీర ప్రాంతాలకు దూరంగా వెళ్లాలని హెచ్చరించారు. నష్ట సమాచారం సామాజిక మాధ్యమాల్లో మాత్రమే కొంతమేర సమాచారం బయ టకు వస్తోంది. పోర్ట్‌ విలాకు 30 కిలోమీటర్ల దూరంలో భూమికి 37 కిలోమీటర్ల లోతులో మధ్యాహ్నం ఒంటిగంట సమ యంలో ఒక్కసారిగా తీవ్ర ప్రకంపనలు మొదలయ్యాయి. అనంతర ప్రకంపనల తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.5గా నమోదైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement