Pacific Island
-
వనౌటులో భారీ భూకంపం
వెల్లింగ్టన్(న్యూజీలాండ్): పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో మంగళవారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైన ఈ భూకంపం తాకిడి తీవ్ర నష్టం సంభవించింది. పోర్ట్ విలాలోని వివిధ దేశాల దౌత్యకార్యా యాలున్న భవన సముదాయం సహా నేల మట్టమైన పలు భవనాల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష మయ్యా యి. పోర్ట్ విలాలోని నౌకాశ్రయం దెబ్బతింది. అక్కడి విమానాశ్రయంలో రాకపోకలు నిలిచిపోయాయి. పోర్ట్ విలా దౌత్య కార్యా లయంలోని తమ సిబ్బంది అందరూ సురక్షి తంగానే ఉన్నారని, ప్రస్తుతానికి కా ర్యాల యాన్ని మూసి వేశామని అమెరికా, ఆస్ట్రేలి యా తెలిపాయి. క్షతగాత్రులతో ఆస్పత్రులు నిండిపోయాయి. పలువురు మృతి చెందినట్లు చెబుతున్నారు. విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతినడంతో పూర్తి వివరాలు తెలియడం లేదు. ప్రజలను తీర ప్రాంతాలకు దూరంగా వెళ్లాలని హెచ్చరించారు. నష్ట సమాచారం సామాజిక మాధ్యమాల్లో మాత్రమే కొంతమేర సమాచారం బయ టకు వస్తోంది. పోర్ట్ విలాకు 30 కిలోమీటర్ల దూరంలో భూమికి 37 కిలోమీటర్ల లోతులో మధ్యాహ్నం ఒంటిగంట సమ యంలో ఒక్కసారిగా తీవ్ర ప్రకంపనలు మొదలయ్యాయి. అనంతర ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. -
చెలియలికట్ట దాటేస్తోంది..!
వాతావరణ సంక్షోభం సముద్రాలనూ అల్లకల్లోలం చేస్తోంది. వినాశకరమైన మార్పులకు కారణమవుతోంది. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు సముద్ర మట్టాల పెరుగుదల ఊపందుకుంది. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో ఈ ధోరణి నానాటికీ కలవరపెడుతోంది. ఏకంగా ‘ప్రపంచ విపత్తు’ స్థాయికి చేరి పసిఫిక్ దీవుల అస్తిత్వానికే ముప్పుగా పరిణమించింది! దీనిపై ఐరాస తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘మనిషి చేజేతులా తెచి్చపెట్టుకున్న సంక్షోభమిది. ఇది గనుక పరాకాష్టకు చేరితే మనం సురక్షితంగా బయటపడేందుకు లైఫ్‌బోట్ కూడా మిగలదు’’ అని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. పరిస్థితి పూర్తిగా చేయి దాటకముందే ప్రపంచం స్పందించాలని పిలుపునిచ్చారు... పసిఫిక్ ద్వీప దేశం టోంగా రాజధాని నుకులోఫాలో ఇటీవల పసిఫిక్ ఐలండ్స్ ఫోరం సమావేశం జరిగింది. ఆ వేదిక నుంచే, ‘మన సముద్రాలను కాపాడండి (సేవ్ అవర్ సీస్)’ పేరిట అంతర్జాతీయ స్థాయి పెనుప్రమాద హెచ్చరిక (గ్లోబల్ ఎస్ఓఎస్)ను ఐరాస చీఫ్ విడుదల చేశారు. ‘‘పసిఫిక్ ఉప్పొంగిపోతోంది. అక్కడి బలహీన దేశాలు అస్తిత్వ ముప్పును ఎదుర్కొంటున్నాయి. వాటికి ఆర్థిక సాయాన్ని, మద్దతును భారీగా పెంచండి’’ అంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. మూడింతల ముప్పు! నైరుతీ పసిఫిక్‌లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 1980 నుంచి ప్రపంచ సగటు కంటే ఏకంగా మూడు రెట్లు వేగంగా పెరిగినట్టు ప్రపంచ వాతావరణ సంస్థ స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ పేర్కొంది. దీంతో గత 30 ఏళ్లలో అక్కడ సముద్ర మట్టాలు ప్రపంచ సగటు కంటే రెట్టింపు పెరిగాయట. సముద్ర వడగాలులూ రెట్టింపయ్యాయి. మున్ముందు అవి మరింత తీవ్రంగా, మరింత సుదీర్ఘకాలం కొనసాగుతాయి’’ అని నివేదిక హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధన ఉద్గారాల తాలూకు వేడిలో ఏకంగా 90 శాతం సముద్రాలే గ్రహించాయని నివేదిక వెల్లడించింది. దాంతో సముద్రపు ఉష్ణోగ్రతలు, ఫలితంగా సముద్ర మట్టం ప్రమాదకరంగా పెరిగిపోతున్నాయి. వేగంగా కరిగిపోతున్న హిమానీ నదాలు, భారీ మంచు పలకలు ఇందుకు తోడవుతున్నాయి! ‘‘మున్ముందు సముద్రాలు కోలుకోలేని మార్పులకు లోనవుతాయి. మనుగడ కోసం మనిషి చేస్తున్న వినాశనమే ఈ ముప్పుకు కారణం’’ – డబ్ల్యూఎంఓ ప్రధాన కార్యదర్శి సెలెస్టే సౌలో‘‘ఇప్పుడు పసిఫిక్ వంతు. మున్ముందు అన్ని సముద్రాలకూ ఈ ముప్పు పొంచి ఉంది. ఇప్పుడే కళ్లు తెరిచి పసిఫిక్‌ను కాపాడు కుంటే మొత్తం మానవాళినీ కాపాడుకున్నవాళ్లం అవుతాం. అందుకే ప్రపంచం పసిఫిక్ వైపు చూడాలి. ఈ హెచ్చరికల్ని వినాలి’’ – ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్మహానగరాలకూడేంజర్ బెల్స్... సముద్రమట్టం పెంపు తాలూకు ముప్పు ప్రభావం ప్రస్తుతానికి పసిఫిక్ ద్వీపాలపైనే కన్పిస్తున్నా అతి త్వరలో ప్రపంచవ్యాప్తంగా లోతట్టు ద్వీపాలన్నింటికీ పాకుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అత్యధిక జనసాంద్రతతో కిక్కిరిసిపోతున్న తీర ప్రాంత మహా నగరాలు, ఉష్ణమండల వ్యవసాయ డెల్టాలు తదితరాల భద్రతకు పెను ముప్పు పొంచి ఉన్నట్టేనని అంటున్నారు. ‘‘ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచాలి. అంతకంటే ముందు ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీ సెల్సియస్ లోపుకు పరిమితం చేయడంపై మరింత దృష్టి పెట్టాలి. అందుకోసం కర్బన ఉద్గారాలను భారీగా తగ్గించాలి’’ అని రెండు నివేదికలూ ముక్త కంఠంతో పేర్కొన్నాయి.ఆ దీవులకు పెను ముప్పే..వాతావరణ సంక్షోభం, సముద్ర మట్టాల పెరుగుదల వల్ల పసిఫిక్‌కు త్వరలోనే పెను ముప్పు పొంచి ఉందని ఐరాస వాతావరణ కార్యాచరణ బృందం మంగళవారం ప్రచురించిన రెండో నివేదికలో కూడా పేర్కొంది. అందులో ఏం చెప్పిందంటే... 👉 దీనివల్ల తువలు, మార్షల్ ఐలాండ్స్ వంటి పసిఫిక్ దీవులు ప్రభావితమవుతున్నాయి. 👉 సముద్ర తాపం, సముద్ర మట్టం పెరుగుదల, ఆమ్లీకరణ... ఇలా ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నాయి. 👉 ఫలితంగా పర్యావరణ వ్యవస్థలు, పంటలు దెబ్బ తినడమే గాక మంచినీటి వనరుల కలుషితమవుతున్నాయి. 👉 జీవనోపాధి కూడా భారీగా దెబ్బ తింటోంది. 👉 తీవ్ర వరదలు, ఉష్ణమండల తుఫాన్లు ఇప్పటికే ఆ ద్వీపాలను నాశనం చేస్తున్నాయి. 👉 2023లో 34 భారీ తుఫాన్లు, వరద సంబంధిత ఘటనలు భారీ సంఖ్యలో మరణాలకు దారితీశాయి. 👉 ఈ ప్రాంతంలో ఏకంగా 2.5 కోట్ల మందిని తీవ్రంగా ప్రభావితం చేశాయి. 👉 సముద్ర మట్టానికి కేవలం 1 నుంచి 2 మీటర్ల ఎత్తులో ఉన్న పసిఫిక్ ప్రాంతంలో 90 శాతం ప్రజలు తీరానికి 5 కి.మీ. పరిధిలోనే నివసిస్తున్నారు. 👉 ఇక్కడి మౌలిక సదుపాయాల్లో సగానికి సగం సముద్రానికి 500 మీటర్ల లోపలే ఉన్నాయి. 👉 ప్రస్తుత 3 డిగ్రీల సెల్సియస్ వేడి పెరుగుదల ఇలాగే కొనసాగితే 2050 నాటికి పసిఫిక్ దీవుల వద్ద సముద్ర మట్టం మరో 15 సెంటీమీటర్లు పెరుగుతుంది. 👉 ఏటా 30 రోజులకు పైగా తీరప్రాంత వరదలు ముంచెత్తుతాయి. 👉 సముద్ర మట్టం పెరుగుదల అనుకున్న దానికంటే వేగవంతమవుతుంది. 👉 ఫలితంగా పసిఫిక్ దీవులకు ముంపు ముప్పు కూడా వేగవంతమవుతుంది. -
పపువా న్యూ గినియా విషాదం.. మరణాలు 670కి పైనే..
మెల్బోర్న్: పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియాలో శుక్రవారం కొండచరియలు విరిగిపడి గ్రామాన్ని నేలమట్టం చేయడం తెల్సిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 670కిపైనే అని ఐరాసకు చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్(ఐవోఎం) ఆదివారం తెలిపింది. ఎంగా ప్రావిన్స్ అధికారులు, బాధిత యంబలి గ్రామస్తులు అందించిన సమాచారాన్ని బట్టి 150కిపైగా ఇళ్లు భూస్థాపితం కాగా వాటిలోని 670 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు ఐవోఎం అంచనా వేసింది. క్షతగాత్రులు, గల్లంతైన వారి సంఖ్యలో స్పష్టత రాలేదని పేర్కొంది. ఆదివారం ఐదు మృతదేహాలను వెలికి తీసినట్లు స్థానిక అధికారులు చెప్పారు. మట్టి, బండరాళ్లు, చెట్లు మూడు నుంచి నాలుగు ఫుట్‌బాల్ మైదానాలంత విస్తీర్ణంలో 6 నుంచి 8 మీటర్ల లోతున గ్రామాన్ని భూస్థాపితం చేశాయని, లోపల చిక్కుకున్న వారు బతికి బట్టకట్టేందుకు అవకాశాలు తక్కువని ఐవోఎం అంటోంది. మరోవైపు స్థానిక గిరిజన తెగల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. శనివారం జరిగిన ఘర్షణలో ఎనిమిది మంది చనిపోయారు. దాంతో సహాయక సిబ్బంది, అత్యవసరాలను చేరవేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. -
అమెరికాలో భారతీయుడికి కీలక పదవి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగంలో మరో భారత సంతతి అమెరికన్‌కు కీలక పదవి లభించనుంది. ప్రముఖ ఆర్థికరంగ నిపుణుడు ప్రేమ్ పరమేశ్వరన్(50) ‘ఏషియన్–అమెరికన్స్, పసిఫిక్ ఐలాండర్స్ అడ్వైజరీ కమిషన్’లో సభ్యుడిగా నియమించేందుకు ట్రంప్ అంగీకరించినట్లు అధ్యక్ష భవనం వైట్‌హౌస్ తెలిపింది. న్యూయార్క్‌లో స్థిరపడ్డ పరమేశ్వరన్ ప్రస్తుతం ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఉత్తర అమెరికా విభాగం అధ్యక్షుడిగా, గ్రూప్ సీఎఫ్‌వోగా పనిచేస్తున్నారు. ఇండో–అమెరికన్లతో పాటు అగ్రరాజ్యంలో స్థిరపడ్డ పసిఫిక్ ద్వీపవాసుల ఆరోగ్యం, విద్య, ఆర్థిక వృద్ధిని మెరుగుపర్చేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ సలహా కమిషన్‌ను తొలుత ఏర్పాటుచేశారు. ఇందులో వాణిజ్యం, ఆరోగ్యం, విశ్వవిద్యాలయాలు, ఎన్జీవోలు సహా వేర్వేరు రంగాలకు చెందిన నిపుణులు సభ్యులుగా ఉంటారు. -
‘బిడ్డకు పాలివ్వడం కోసం.. ఇంత సొమ్ము వృధానా’
విల్లింగ్టన్ : దేశాధినేత హోదాలో ఉండి బిడ్డకు జన్మనిచ్చిన రెండో మహిళగా రికార్డుకెక్కిన న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డర్న్ ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటున్నారు. ‘బ్రెస్ట్‌ఫీడింగ్ పేరు చెప్పి ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తున్నారంటూ’ న్యూజిలాండ్ పౌరులు ఆమెపై మండిపడుతున్నారు. విషయమేంటంటే.. రెండు నెలల క్రితం ఆర్డర్న్ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆమె కూడా అందరిలానే సాధరణ మహిళ అయితే మెటర్నటి లీవ్ పెట్టి ఇంటి వద్దనే ఉంటూ తన చిన్నారి ఆలన పాలన చూసుకునేవారేమో. కానీ దేశాధ్యక్షురాలు కావడంతో కేవలం రెండు నెలలు మాత్రమే మెటర్నటి సెలవులు తీసుకుని, అనంతరం తన చిన్నారితో కలిసి విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 1 - 9 వరకూ నౌరులో జరగనున్న ‘పసిఫిక్ ఐస్‌ల్యాండ్స్ సమ్మిట్’కి ఆర్డర్న్ తన చిన్నారితో కలిసి హాజరయ్యారు. అయితే ఈ సమ్మిట్‌కి ఆర్డర్న్తో పాటు ఉప ప్రధాని విన్స్టన్ పీటర్స్ కూడా హాజరయ్యారు. ఒకే కార్యక్రమానికి హాజరవుతోన్న ప్రధాని, ఉప ప్రధాని మాత్రం రెండు వేర్వేరు విమానాల్లో ప్రయాణించారు. ప్రయాణంలో తన బిడ్డకు పాలివ్వడానికి వీలుగా ఉంటుందని భావించి ఆర్డర్న్ ఇలా చేశారు. సమావేశానికి హాజరయ్యే సమయంలో ఆర్డర్న్ తన బిడ్డకు పాలు ఇస్తూ ఉండి పోవడం వల్ల.. పీటర్స్ అక్కడి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒకే సమావేశానికి హాజరవ్వడం కోసం ప్రధాని, ఉప ప్రధాని ఇలా రెండు వేర్వేరు విమానాల్లో ప్రయాణించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై 50,000(మన కరెన్సీలో దాదాపు 35 లక్షల రూపాయలు) డాలర్లు అదనపు భారం పడిందని హెరాల్డ్ పత్రిక కథనాన్ని ప్రచురించింది. దీనిపై కివి ప్రజలు స్పందిస్తూ.. ‘ఇంత డబ్బు ఖర్చు చేసి మీరు ఆ కార్యక్రమానికి హాజరవ్వడం అంత అవసరమా.. ఒక వేళ మీ డిప్యూటీ వెళ్తే సరిపోయేది అనుకుంటే అతన్నే పంపిస్తే అయిపోయేదిగా’ అంటూ ఆర్డర్న్‌ని విమర్శిస్తున్నారు. కానీ ఆమెకు మద్దతు తెలిపే వారు మాత్రం.. ‘ఆర్డర్న్ తల్లిగా, దేశాధ్యక్షురాలిగా రెండు బాధ్యతలను చాలా చక్కగా నిర్వర్తించించార’ని మెచ్చుకుంటున్నారు. ఈ విషయం గురించి ఆర్డర్న్‌ని వివరణ కోరగా.. ‘నేను ప్రత్యేక విమానంలో సమావేశానికి హాజరయినందుకు ఇంత రాద్ధంతం చేస్తున్నారు కదా.. ఒకవేళ నేను హాజరుకాకపోయినా ఇలానే విమర్శించేవారు. వీటన్నింటిని పట్టించుకుంటే మనం ముందుకు సాగలేమ’ని తెలిపారు. -
మనిషి పాపం.. వాటికి శాపం..
వాషింగ్టన్ : మనిషి సృష్టిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల కాలుష్యం జనావాసంలోని వారినే కాకుండా.. మనిషికి దూరంగా బతుకుతున్న మూగ జీవాల ప్రాణాలను కూడా తీస్తోంది. గత కొద్ది నెలలుగా పసిఫిక్ సముద్ర తీరంలోని మిడ్వే ఐలాండ్‌లో కొన్ని వేల పక్షులు ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా ప్రాణాలు విడిచాయి. ఈ ఐలాండ్‌లో ఎక్కువగా ఆల్బట్రాస్ జాతి పక్షులు జీవిస్తుంటాయి. తీరాల వెంట చేపలను వేటాడి తింటూ బతికేస్తుంటాయి. కానీ సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన ప్లాస్లిక్ వ్యర్థాలను పోల్చుకోలేక వాటిని చేపలుగా భావించి అవి తినటమే కాకుండా వాటి పిల్లలకు కూడా తినిపిస్తున్నాయి. దీంతో తిన్న వ్యర్థాలను అరాయించుకోలేక భారీ సంఖ్యలో పక్షులు మరణిస్తున్నాయి. అమెరికా ఫోటోగ్రాఫర్ క్రిస్ జార్డన్ హోప్స్ తీసిన ఫోటోలు ప్రజల్ని కదిలించాయి. చనిపోయిన పక్షి కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్న ఆ చిత్రంతో అక్కడి పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఫొటో గ్రాఫర్ జార్డన్ మాట్లాడుతూ.. ‘ప్లాస్టిక్ వస్తువులను మనం ఒకసారి వాడేసిన తర్వాత పడేస్తున్నాం. అవి భూమిలో కలిసిపోవడం చాలా కష్టం. ప్లాస్టిక్‌ను నివారించడం ఒక్కరితో అయ్యే పని కాదు. మార్పు తీసుకురావాలంటే అందరిలోనూ చైతన్యం రావాలి’ అని అన్నారు. ప్రతి మనిషి ఒక రోజులో 130 అతిచిన్న ప్లాస్టిక్ వ్యర్థాలను శ్వాసిస్తున్నాడని ఓ పరిశోధనలో తేలింది. -
ఈ నాణేలు ప్రకాశిస్తాయి..
అమలాపురం టౌన్: పసిఫిక్ మహా సముద్రంలో ఫ్రెంచి పాలినేషియా, కిరిబాటి, కెయిర్న్ ద్వీపాల మధ్య ఉన్న అందమైన దీవి క్రెసెంట్. ఈ దీవి ప్రభుత్వం విడుదల చేసిన చీకట్లో మెరిసే నాణేలను అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. ఈ దీవి ప్రజలు చాలా కాలం డబ్బుకు బదులుగా ముత్యాలనే వాడేవారు. క్రెసెంటీస్ భాషలో ‘పోవా’ అంటే ముత్యమని అర్థం. 2006లో 500, 1,000, 5,000 పోవా ముఖ విలువ కలిగిన నాణేలను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నాణేలను యాక్రిలిక్ పదార్థంతో తయారు చేశారు. వీటి తయారీలో ఫ్లోరోసెంట్ పదార్థం వాడడంవల్ల అవి చీకట్లో మెరుస్తాయి. నాణేలను 39 మిల్లీమీటర్ల వ్యాసంతో, 5 మిల్లీమీటర్ల మందంతో గుండ్రని ఆకారంలో రూపాందించారు. వీటిపై ఉదయిస్నున్న సూర్యుడు, కొబ్బరి చెట్టు ముద్రించారు. ఇవి నీలం, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో పారదర్శకంగా ఉండి అక్కడి ప్రజల జీవన శైలిని ప్రతిబింబిస్తాయని కామేశ్వర్ చెప్పారు. -
ఆ నాలుగు అక్షరాలు.. ముగ్గుర్ని రక్షించాయి
ఓ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ఇది ఓ వాణిజ్య ప్రకటన. ఆపదలో ఉన్న ముగ్గురు వ్యక్తులకు వచ్చిన ఓ ఉపాయం వారిని కాపాడింది. గత సోమవారం పసిఫిక్ మహా సముద్రంలో చిన్న పడవలో విహారానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నారు. పెద్ద అల తాకిడికి వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడి మునిగిపోయింది. వారు ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈతకొట్టడం మినహా మరో మార్గం కనిపించలేదు. సముద్రంలో రెండు మైళ్ల దూరం ఈతకొట్టి ఫనాడిక్ అనే ద్వీపం తీరానికి చేరుకున్నారు. ఒడ్డుకు అయితే చేరుకున్నారు కానీ అక్కడి నుంచి ఎలా బయటపడాలో తెలియలేదు. మూడు రోజులు అక్కడే ఉండిపోయారు. ముగ్గురూ తప్పిపోయిన విషయాన్ని కోస్ట్ గార్డ్ సిబ్బంది మంగళవారం గుర్తించారు. నావీ సిబ్బంది సాయంతో వారిని గుర్తించేందుకు రంగంలోకి దిగారు. రెండు కార్గో పడవలతో 17 గంటల పాటు గాలించినా వారి ఆచూకీ కనుగొనలేకపోయారు. ఇంతలో ఆ ముగ్గురికి ఓ ఉపాయం వచ్చింది. సముద్ర తీరంలోని ఇసుకపై తాటి ఆకులను HELP (హెల్ప్) పెద్ద అక్షరాల్లో కనిపించేలా పరిచారు. నావీ విమానంలో గాలిస్తున్న సిబ్బంది గురువారం ఈ దృశ్యాన్ని గుర్తించడంతో వారి కష్టాలు తీరాయి. ఫనాడిక్ ద్వీపంలో చిక్కుకుపోయిన ముగ్గురు సురక్షితంగా పులాప్కు వెనుదిరిగి వచ్చేందుకు ఓ పడవను ఏర్పాటు చేశారు. ఈ ముగ్గురూ సురక్షితంగా తిరిగివచ్చారు. తమను కాపాడిన నావీ, కోస్ట్ గార్డ్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. రెండు వారాల్లో కోస్ట్ గార్డ్ సిబ్బంది ఆపదలో ఉన్న 15 మందిని రక్షించారు.