కృష్ణకామేశ్వర్ సేకరించిన ‘పోవా’ నాణేలు
అమలాపురం టౌన్: పసిఫిక్ మహా సముద్రంలో ఫ్రెంచి పాలినేషియా, కిరిబాటి, కెయిర్న్ ద్వీపాల మధ్య ఉన్న అందమైన దీవి క్రెసెంట్. ఈ దీవి ప్రభుత్వం విడుదల చేసిన చీకట్లో మెరిసే నాణేలను అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు.
ఈ దీవి ప్రజలు చాలా కాలం డబ్బుకు బదులుగా ముత్యాలనే వాడేవారు. క్రెసెంటీస్ భాషలో ‘పోవా’ అంటే ముత్యమని అర్థం. 2006లో 500, 1,000, 5,000 పోవా ముఖ విలువ కలిగిన నాణేలను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది.
ఈ నాణేలను యాక్రిలిక్ పదార్థంతో తయారు చేశారు. వీటి తయారీలో ఫ్లోరోసెంట్ పదార్థం వాడడంవల్ల అవి చీకట్లో మెరుస్తాయి. నాణేలను 39 మిల్లీమీటర్ల వ్యాసంతో, 5 మిల్లీమీటర్ల మందంతో గుండ్రని ఆకారంలో రూపాందించారు.
వీటిపై ఉదయిస్నున్న సూర్యుడు, కొబ్బరి చెట్టు ముద్రించారు. ఇవి నీలం, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో పారదర్శకంగా ఉండి అక్కడి ప్రజల జీవన శైలిని ప్రతిబింబిస్తాయని కామేశ్వర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment