coins collection
-
విజయవాడలో ఆకట్టుకున్న ఇంటర్నేషనల్ కాయిన్ ఎక్స్పో (ఫొటోలు)
-
వీడియో: నాణేలతో స్కూటర్ కొనుగోలు.. ఎన్ని వేలో తెలుసా?
అదో బైక్ షోరూం.. వర్కర్లు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి తన భుజాన ఓ సంచి వేసుకుని షోరూమ్‌కి వచ్చాడు. తనకు ఓ స్కూటర్ కావాలని అక్కడున్న వారిని కోరాడు. దీంతో, అక్కడున్న స్కూటర్లను చూసి ఒకదాన్ని ఓకే చేసుకున్నారు. అయితే, డబ్బులు చెల్లించే సమయంలో అతడు తన వద్ద ఉన్న 10 రూపాయల నాణేలను ఇవ్వడంతో అక్కడున్న వారు ఒకింత ఆశ్చర్యానికి లోనైనా.. అతడి కోరికను చూసి అభినందించారు. ఏకంగా రూ. 90వేలకు సరిపడే 10 రూపాయల నాణేలను లెక్కించి స్కూటర్‌ను అతడికి అప్పగించారు. వివరాల ప్రకారం.. బైక్ కొనుక్కోవడం ప్రతి సామాన్యుడి కల. దాని కోసం కొంతమంది అప్పు చేసి కొంటారు. మరికొందరు డబ్బులను జమ చేసుకుని కొనుగోలు చేస్తారు. అయితే, అసోంకు చెందిన వ్యక్తి మాత్రం ఐదారేళ్లుగా ద్విచక్రవాహనం కొనేందుకు నాణేలు పోగేశాడు. మెుత్తం రూ.90 వేలు కూడబెట్టి.. చివరికి తనకు ఇష్టమైన ద్విచక్ర వాహనాన్ని కొని ఇంటికి తీసుకెళ్లాడు. #WATCH | Assam: Md Saidul Hoque, a resident of the Sipajhar area in Darrang district purchased a scooter with a sack full of coins he saved. pic.twitter.com/ePU69SHYZO — ANI (@ANI) March 22, 2023 అసోంలోని దరంగ్ జిల్లాలో సిపజార్‌కు చెందిన మహమ్మద్ సైదుల్ హక్ తన చిరకాల కోరికను తీర్చుకున్నాడు. చిన్న షాప్ నడుపుకునే సైదుల్కు స్కూటర్ కొనాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. దీంతో, తనకు ఇష్టమైన బైక్ కోసం ఐదారేళ్లుగా డబ్బును జమ చేసుకుంటున్నాడు. దీని కోసం ప్రతీ రోజు అతడు రూ.10 నాణేలను పోగు చేశాడు. ఇలా 90వేల రూపాయలు పొదుపు చేశాడు. ఇన్ని రోజులు జమ చేసిన నాణేలను కొన్ని డబ్బాల్లో ఓ సంచిలో వేసుకుని షోరూమ్‌కు వెళ్లాడు. అనంతరం, బైక్‌ను కొనుగోలు చేసి ఆనందం వ్యక్తం చేశాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. సైదుల్ను పొగడ్తలతో ముంచెత్తున్నారు. "I run a small shop in Boragaon area and it was my dream to buy a scooter. I started to collect coins 5-6 years ago. Finally, I have fulfilled my dream. I am really happy now," said Md Saidul Hoque pic.twitter.com/Vj4HsOqI3v — ANI (@ANI) March 22, 2023 అయితే, అంతకు ముందు కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కొద్దిరోజుల క్రితం మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు తన డ్రీమ్ బైక్(కేటీఎం) కోసం చిల్లరను జమచేశారు. రూ.2.85 లక్షలకు సరిపడే రూపాయి కాయిన్స్ పొదుపు చేసి బైక్ కొనుగోలు చేశారు. అలాగే, తమిళనాడులోని సేలాం జిల్లాకు చెందిన వెట్రివేల్ అనే వ్యక్తి రూ. 10 నాణేలను జమ చేసి కారును కొనుగోలు చేశాడు. ఈ వార్త సోషల్ మీడియాలో హైలైట్ అయ్యింది. ఇది కూడా చదవండి: గుండె ధైర్యమంటే నీదే భయ్యా.. షాకింగ్ వీడియో -
పాత నాణెం.. బంగారం!
నాణేలను సేకరించే అభిరుచి ఉన్న వారు అరుదుగా కనిపిస్తుంటారు. కానీ, నాణేల సేకరణ అన్నది ఒక చక్కని హాబీగా ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోంది. నాణేల వినియోగానికి 2,800 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. ముఖ్యంగా స్వాతంత్య్రానికి పూర్వం రాజుల కాలం నాటి నాణేలు, బ్రిటిష్ కాలంలో ముద్రించిన నాణేలను కోరుకున్నంత ఇచ్చి తీసుకునేవారు ఉన్నారు. బుద్ధుని రూపాన్ని కనిష్కకాలం నాటి నాణేల్లో చూడొచ్చు. ఇవే మన దేశంలో అత్యంత ఖరీదైన కాయిన్లు. గత కాలపు వైభవాలకు, పాలనకు సాక్షీభూతాలుగా నిలిచే కాయిన్లకు డిమాండ్ చెప్పలేనంత. ఒకప్పుడు అభిరుచిగా సాగిన నాణేల వేట.. నేడు కాసులు కురిపించే పెట్టుబడిగానూ మారిపోయింది. దీంతో గతంలో పాత కాయిన్లను కొనేవారు కొద్ది మందే ఉండగా.. ప్రస్తుతం కొనుగోలుదారులు, విక్రయదారులు కూడా పెరుగుతూ ఉన్నారు. గొప్ప చిత్రకారులు వేసిన పెయింటింగ్‌లు కోట్ల రూపాయలు పలికినట్టే.. మీ బీరువాలోని పూర్వకాలపు నాణెం కూడా కాసులు కురిపించొచ్చు. నేటి కాలపు అరుదైన కాయిన్ కొన్ని తరాల తర్వాతి వారికి అపురూపంగాను అనిపించొచ్చు. అందుకే నాణేల సేకరణ వెనుకనున్న విలువైన కోణాన్ని తరచి చూసే కథనమే ఇది. మన తాతల కాలంలో అయితే నాణేల సేకరణకు పెట్టుబడి కోణం ఉండేది కాదు. ఇష్టంతో వివిధ రకాల కాయిన్లను పోగు చేసుకోవాలన్న అభిలాష కొందరిలో ఉంటే, తమకు ఇష్టమైన గొప్ప వ్యక్తుల చిత్రాలతో ఉండే నాణేల పట్ల కొందరు మక్కువ చూపించేవారు. శతాబ్దాల ఘనచరిత్రకు నిదర్శనంగా నిలిచే ఆ నాణేలకు ఊహించనంత విలువ, డిమాండ్ తోడయ్యాయి. నాణేల సేకరణ తొలుత అభిరుచితో మొదలైనా.. ఆ తర్వాత వాటిపై మరింత అధ్యయనానికి, చరిత్ర ఆధారాల అన్వేషణకు కీలకంగా మారిపోయింది. నాణేల సేకరణదారులు, అధ్యయనకారులను న్యూమిస్మ్యాటిస్ట్గా పేర్కొంటారు. ఇతరులతో పోలిస్తే నాణేల విషయంలో వీరు భారీగా సంపదను గడిస్తున్నారనడంలో సందేహం లేదు. ఎందుకంటే నాణేలు, అంతర్జాతీయంగా వాటి డిమాండ్‌పై వీరికి లోతైన అవగాహన ఉంటుంది. మన దేశంలో నాణేలను సేకరించడం అన్నది అలవాటు నుంచి పెట్టుబడిగా మారుతోంది. కానీ, ఇప్పటికీ ఇది ఆరంభ దశలోనే ఉందంటున్నారు నిపుణులు. ‘‘50 ఏళ్ల క్రితం నాణేలు, మెడల్స్, బ్యాంక్ నోట్లను కొనుగోలు చేసేవారు చాలా కొద్ది మందే ఉండేవారు. కాలక్రమేణా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. 1990ల నుంచి ముంబైలో ఏటా కాయిన్షోను మేము నిర్వహిస్తూ వస్తున్నాం. దీంతో నాణేల పట్ల ఆసక్తి పెరుగుతోంది. ’’ అని టోడీవాలా ఆక్షన్స్ అధినేత ఫారూక్ ఎస్ టోడీవాలా తెలిపారు. సురక్షితమైన పెట్టుబడి నాణేల సేకరణ నేడు సురక్షితమైన, ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా మారిందంటున్నారు నిపుణులు. 2008–2012 కాలంలో నాణేల పెట్టుబడిపై రెట్టింపు రాబడులు వచ్చాయి. దీంతో నాణేలను పెట్టుబడి సాధనంగా చూసే ధోరణి ఏర్పడింది. దీంతో మరింత మంది కొత్తవారు ఈ దిశగా అడుగులు వేసేందుకు కారణమైంది. ‘‘నా వరకు అయితే కాయిన్ల సేకరణ అభిరుచిలో భాగమే. కానీ, కొనుగోలు చేస్తున్న నాణెం విలువ భవిష్యత్తులో పెరుగుతుందా, లేదా అని తెలుసుకునేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తాను. నా తదుపరి తరం వారికి నాణేలపై సరిపడా సమాచారం, విజ్ఞానం ఉండకపోవచ్చు. లేదంటే వారికి ఆసక్తి అయినా ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో నా సేకరణలు అన్నింటినీ విక్రయించేస్తాను’’ అని ముంబైకి చెందిన నాణేల సేకరణకర్త దిన్యర్ మదన్ చెప్పారు. అవగాహనతోనే అడుగు నాణేలను గుర్తించడం, వాటి చారిత్రక నేపథ్యం, విలువపై అవగాహన కల్పించే ఎన్నో పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. నాణేలను సేకరించే వారు వాటికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడమే కాకుండా, పరిజ్ఞానాన్ని పెంచుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు. ‘‘ఏ కాలం నాటిది, చారిత్రకంగా ప్రాధాన్యం ఉన్నదా తదితర విషయ పరిజ్ఙానం అవసరం. అప్పుడు సేకరించిన నాణేనికి కాలం గడుస్తున్న కొద్దీ అనూహ్యమైన విలువ తోడవుతుంది. గుప్తా గోల్డ్ కాయిన్లు, మొఘలుల నాటి కాయిన్లు, రాజ సంస్థానాల నాటివి, బ్రిటిష్ ఇండియా కాయిన్లకు దేశంలో ఎంతో ప్రాచుర్యం ఉంది. అంతర్జాతీయంగా వేరు.. అమెరికా, బ్రిటన్‌లో అయితే నాణేలకు సంఘటిత మార్కెట్ ఉంది. అక్కడ నియంత్రణల పరిధిలోకి వస్తుంది. బ్యాంకులు, కార్పొరేట్లు సైతం నాణేలపై ఇన్వెస్ట్ చేస్తుంటాయి. నాణేల దిగుమతిపై సుంకాలు, ఆంక్షలను కూడా చాలా దేశాలు అమలు చేయడం లేదు. ‘‘కానీ, మనదేశంలో పరిస్థితి వేరు. భారత్‌లో తయారైన భారత్‌కే చెందిన నాణేలు, మెడల్స్, బ్యాంకు నోట్ల దిగుమతికి కస్టమ్స్ విభాగం సులభంగా అనుమతించడం లేదు. వీటి దిగుమతి కోసం ఎన్నో గంటల సమయం వెచ్చించడమే కాకుండా.. విపరీతమైన సుంకాలు, జరిమానాలు కూడా కట్టాల్సిన పరిస్థితి ఉంది’’ అని టోడీవాలా ఆక్షన్స్ అధినేతటోడీవాలా వివరించారు. వీటికి తోడు అసంఘటిత స్థాయిలోనే పరిశ్రమ ఉన్నట్టు పేర్కొన్నారు. విలువను నిర్ణయించే అంశాలు నాణేలకు విలువ కట్టడంలో కీలకంగా చూసేది నాణ్యతే. పాలిష్, గీతలు, ధరించడానికి అనుకూలంగా ఉంటుందా ఇలా ఎన్నో అంశాల ఆధారంగా విలువ నిర్ణయిస్తుంటారు. మంచి, ఎంతో మంచి, శ్రేష్టమైన, ఎంతో శ్రేష్టమైన, అత్యున్నత శ్రేష్టమైన, చెలామణిలోనివి ఇలా పలు విభాగాలుగా నాణేలను వేరు చేస్తారు. చెలామణిలో లేకపోయినా ఫర్వాలేదు కానీ.. ఆ నాణేలపై చిత్రాలు, అక్షరాలు చెదిరిపోకుండా స్పష్టంగా ఉంటే అధిక విలువను చెల్లించేందుకు కొనుగోలుదారులు వెనుకాడరు. మంచి నాణెం అనుకున్నది చెత్తనాణెం కూడా కావచ్చన్నారు కోల్‌కతాకు చెందిన న్యూమిస్మ్యాటిస్ట్ అనింద్య జ్యోతి మజుందార్. ఉదాహరణకు 2,000 సంవత్సరాల కిత్రం నాటి గ్రీక్ కాయిన్‌ను చెక్కుచెదరని స్థితిలో (మింట్ కండీషన్)లో వేలానికి ఉంచితే ఊహించనంత విలువ లభిస్తుందని తెలిపారు. ప్రాచీన కాలం నాటి కాయిన్ల లభ్యత కొత్తగా పెరిగేది కాదంటూ.. అదే సమయంలో డిమాండ్ క్రమంగా పెరుగుతూనే వెళుతుందన్న విషయాన్ని టోడీవాలా ప్రస్తావించారు. అంటే పూర్వ కాలపు కాయిన్ల లభ్యత కొద్దిగా ఉన్నందున వాటికి విలువ క్రమంగా పెరుగుతూనే వెళుతుందని అర్థం చేసుకవోచ్చు. ‘‘అవగాహన పెరుగుతోంది. వ్యక్తుల దగ్గర మిగులు ధనంలోనూ వృద్ధి కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు నాణేల ప్రదర్శనలతో కాయిన్లకు డిమాండ్ అనూహ్యంగా వృద్ధి చెందుతోంది’’ అని టోడీవాలా పేర్కొన్నారు. ఎన్నో వేదికలు వేలం కంపెనీలు, డీలర్‌షిప్‌లు ఉన్నందున ఈ పరిశ్రమ ఎంతో కాలం అసంఘటిత స్థాయిలోనే ఉండదన్నది టోడీవాలా అభిప్రాయం. నాణేల కొనుగోలు, విక్రయాలకు ఆన్లైన్లో ఎన్నో వేదికలు అందుబాటులోకి వచ్చాయి. విక్రయదారులు కోరుతున్నంత ధర పెట్టి కొనేవారు ముందుకు వచ్చినప్పుడే లావాదేవీ నమోదవు తుంది. లేదంటే ఆక్షన్ కంపెనీని సంప్రదించి నాణేన్ని ప్రదర్శనకు ఉంచుకోవచ్చని, లేదంటే ఆన్లైన్ పోర్టళ్లలో విక్రయించుకోవచ్చని టోడీవా లా సూచించారు. ఆన్లైన్లో అయితే విక్రయదారుల వివరాలు, పూర్వపరాలు తెలియడం కష్టం. మోసాలకూ అవకాశం ఉంటుంది. ఇటువంటి సందేహాలతో ఉండేవారికి వేలం కంపెనీలను, డీలర్లను ఆశ్రయించడం చక్కని మార్గం అవుతుంది. ‘‘గతంలో ఒక వేలానికి మూడు నెల పాటు వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ప్రతీ నెలా 7–8 వేలాలు కొనసాగుతున్నాయి’’ అని ముంబై కాయిన్ సొసైటీ సభ్యుడు అజయ్‌గోయల్ తెలిపారు. కాయిన్ బజార్ మీ దగ్గర 1, 2, 5 రూపాయల అరుదైన నాణేలు, నోట్లు ఉంటే రూ.లక్షలు పెట్టికొనే వారు ఉన్నారు. కాయిన్‌బజార్ పోర్టల్‌లో ఇటువంటి వేలాలు కనిపిస్తుంటాయి. మాతా వైష్ణోదేవి చిత్రం ఉన్న రూ.10 నాణెం రూ.లక్షలు పలికిన సందర్భాలున్నాయి. 1977–79 మధ్యకాలం నాటి రూపాయి నోట్‌కు రూ.45,000 చెల్లించిన వారు కూడా ఉన్నారు. కాకపోతే ఆయా నోట్లు, నాణేలపై వివరాలు చెదిరిపోకుండా ఉండాలి. అంతేకాదు ఆర్బీఐ పరిధిలోని ముద్రణ శాల కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేకమైన కాయిన్లను ముద్రిస్తూ ఉంటుంది. వాటికి సైతం మంచి డిమాండ్ ఉంటోంది. -
నాణేల చెలామణీ..ప్రోత్సహకాల్ని పెంచిన ఆర్బీఐ
ముంబై: ‘క్లీన్ నోట్ పాలసీ’లో భాగంగా నాణేల చెలామణీపై బ్యాంకులకు ప్రోత్సహకాలు పెంచుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రటించింది. ఇప్పటి వరకూ బ్యాగ్‌కు రూ.25 ప్రోత్సాహకం ఉంటే దీనిని రూ.65కు పెంచుతున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. గ్రామీణ, చిన్న స్థాయి పట్టణాల విషయంలో అదనంగా మరో రూ.10 ప్రోత్సాహకంగా లభిస్తుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమలవుతుందని ఆర్బీఐ పేర్కొంది. నాణేల పంపిణీ విషయంలో తమ బిజినెస్ కరస్పాండెంట్ల సేవలను మరింత వినియోగించుకోవాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. చదవండి : బ్యాంకింగ్ రుణ వృద్ధి 6.55 శాతం -
ఒక మొహర్ రూ.50 వేలు..
మహాత్మాగాంధీ 150వ జయంతి, నిజాం నవాబుల కాలంలో విడుదల చేసిన పోస్టల్ స్టాంపు 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ ఫిలాటెలిక్ అండ్ హాబీస్ సొసైటీ ఆధ్వర్యంలోశుక్రవారం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. నగరంలోని ఫ్యాప్సీ భవన్లో ఏర్పాటు చేసినఈ ప్రదర్శనలో ఒకప్పటి నాణేలు, కాగితపు కరెన్సీ, స్టాంపులు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.ఆదివారం వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. సాక్షి, సిటీబ్యూరో: చరిత్ర, పురాతన అంశాలు, మన పూర్వీకుల జీవన విధానంపై విద్యార్థులకు, యువతకు అవగాహన కల్పించేందుకు ఫిలాటెలిక్ అండ్ హాబీస్ సొసైటీ నిర్వాహకులు ఈ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. 1961లో ఏర్పడిన ఈ సంస్థ అప్పటి నుంచి ఇప్పటి వరకు వందల కొద్దీ ప్రదర్శనలు నిర్వహించింది. పాత నాణేలు, స్టాంపులను సేకరించే అభిరుచి కలిగిన ఎంతోమందిని ఒక వేదికమీదకు తెచ్చింది.తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాణేల సేకరణ అభిరుచి కలిగిన వ్యక్తులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో వందల ఏళ్ల నాటి నాణేలు, స్టాంపులను వీక్షించడమే కాకుండా ఆసక్తి గల వారు కొనుగోలు చేయవచ్చు. ఈ నాణేలకు రూ.20 నుంచి రూ.50 వేల వరకు కూడా డిమాండ్ ఉండడం గమనార్హం. ఒక మొహర్ రూ.50 వేలు.. గోల్కొండ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన పాలనలో ప్రత్యేక ముద్ర కనబరిచాడు, ‘మొహర్’నాణేన్ని విడుదల చేశాడు. సుమారు 1659 నుంచి 1707 వరకు ఇది మారకంలో ఉంది. ఈ నాణెంపైన ముద్రించిన ‘ గోల్కొండ’ చిహ్నం ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. వరంగల్‌కు చెందిన వైకుంఠాచారి ఈ అరుదైన నాణేన్ని ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. దీనికి ఇప్పుడు రూ.50 వేలకు పైగా డిమాండ్ ఉన్నట్లు చెప్పారు.అలాగే తొలినాటి కరెన్సీ నోట్లకు సైతం రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు డిమాండ్ ఉంది. నాణేల సేకరణ అభిరుచి కలిగిన వ్యక్తులు తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేసి భద్రపరుచుకుంటారు. పైగా అలాంటివి తమ వద్ద ఉండడం అదృష్టంగా కూడా భావిస్తారు. అలాగే ఈ ప్రదర్శనలో నిజాం నవాబుల కాలంలో తయారు చేసిన ‘అణా’పైన ముద్రించిన చార్మినార్ చిహ్నం సైతం అప్పటి పాలకుల వైభవాన్ని చాటుతుంది. దో అణా, చార్ అణా, ఆఠ్ అణాలు ఈ ప్రదర్శనలు కనిపిస్తాయి. అణాలతో పాటు నిజాం కాలంలోనే బాగా ప్రాచూర్యంలో ఉన్న హాలిచిక్కా మరో ప్రత్యేకమైన ఆకర్షణ. చార్మినార్ చిహ్నంతో రూపొందించిన నాణేలు ఎక్కువగా మహబూబ్ అలీఖాన్, నిజాం అలీఖాన్ కాలానికి చెందినవే ఉన్నాయి. వీరి కాలంలోనే కరెన్సీ నోట్లు వినియోగంలోకి వచ్చాయి. వైవిధ్యంగా నాణేల ముద్రణ... వివిధ కాలాల్లో చలామణిలో ఉన్న నాణేలు దేనికదే వైవిధ్యంగా నిలిచాయి. శాతవాహనుల నాటి నాణేలు, కోటి లింగాల వద్ద లభించిన శాతకర్ణి కాలం నాటి స్వస్తిక్ చిహ్నం కలిగిన నాణెం ఈ ప్రదర్శనలో మరో ఆకర్షణగా ఉంది. శాతవాహనుల కంటే ముందు గవ్వలు, చిల్లి గవ్వలు వాడులో ఉండేవి. ఆ తరువాత సత్తు బిల్లలు వినియోగంలోకి వచ్చాయి. కర్ణాటక, తెలంగాణలలో వేముల వాడ కేంద్రంగా పరిపాలించిన పశ్చిమ చాళుక్యుల కాలం నాటి నాణేలను కూడా ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఈ నాణేల పైన ‘ గ’, ‘జ’ వంటి అక్షరాలు కనిపిస్తాయి. ఇవి ఆయా రాజుల పాలనా కాలానికి చెందిన గుర్తులు. ఇక విజయనగర రాజుల కాలంలో ప్రత్యేకించి దేవనాగరి లిపిలో తయారు చేసిన వరహాలు ఈ ప్రదర్శనలో మరో ఆసక్తికరమైన నాణెంగా కనిపిస్తుంది. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 100 రూపాయలు, 500 రూపాయల నాణేలు కూడా ఉన్నాయి. రూపాయి నోటు వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గతేడాది కేంద్రం కొత్త నోటును విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ మొట్టమొదటి గవర్నర్ బెనెగల్ రామారావు సంతకంతో వెలువడిన రెండు రూపాయల నోటు ఈ ప్రదర్శనలో మరో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. స్టాంపులకూ ఓ ప్రత్యేకత ... నిజాం కాలంలో విడుదలైన మొట్టమొదటి పోస్టల్ స్టాంపుతో పాటు, 1840లోనే విడుదలైన మొట్టమొదటి ‘ఇంగ్లాండ్ పెన్నీ బ్లాక్’ స్టాంపు ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. 1787 నుంచి 1987 వరకు అమెరికా రాజ్యాంగానికి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విడుదల చేసిన స్టాంపును కూడా ఈ ప్రదర్శనలో తిలకించవచ్చు. మొత్తం 40 స్టాళ్లలో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆదివారం వరకు ఇది కొనసాగుతుంది. చిన్నప్పటి నుంచి సేకరిస్తున్నా మా నాన్న సత్యనారాయణ చారి నాణేలను సేకరించేవారు. కొన్ని వందల నాణేలను ఆయన సేకరించి పెట్టారు. ఆయనతో పాటు ఈ అభిరుచి నాకూ అలవడింది. చాళుక్యుల కాలం నుంచి ఈ నాటి వరకు అన్ని కాలాలకు చెందిన నాణేలు మా వద్ద ఉన్నాయి. విష్ణుకుండినులు, కాకతీయులు, శ్రీకృష్ణ దేవరాయలు, అసఫ్జాహీలు నాణేలలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. కరెన్సీ నోట్లపైన తొలి రోజుల్లో బ్రిటీష్ చిహ్నాలు చెలామణిలో ఉన్నా ఆ తరువాత ఆ రాజుల స్థానంలో అశోక చక్రతో ముద్రించారు. ప్రతి దశలో వచ్చిన మార్పులు చాలా ఆసక్తిగానే ఉంటాయి.– వైకుంఠచారి, వరంగల్ ప్రదర్శన కోసమే ఢిల్లీ నుంచి వచ్చాను కొంతకాలంగా ఢిల్లీలో ఉంటున్నాను. కానీ హైదరాబాద్‌లో ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసి వచ్చాను. నాణేల సేకరణ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటి వరకు కొన్ని వందల రకాల నాణేలను సేకరించి పెట్టాను. ఎక్కడ ప్రదర్శన జరిగినా వెళ్తాను. బంగారు నాణేలకు సహజంగానే డిమాండ్ బాగా ఉంటుంది. కానీ ఆయా కాలాల్లో వచ్చిన కొన్ని అరుదైన నాణేలు, కరెన్సీ నోట్లపైన రూ.వేలల్లో డిమాండ్ ఉండడం చాలాఇంట్రెస్టింగ్. – పృథ్వీరెడ్డి తుగ్లక్ కాలం నాటి నాణెం కొన్నాను పాతకాలం నాటి నాణేలు ఇంట్లో ఉంచుకోవడం నాకు చాలా ఇష్టం. 20 ఏళ్లుగా సేకరిస్తున్నాను. కొన్ని నాణేలు ఉండడం అదృష్టం కూడా. ప్రస్తుతం తుగ్లక్ కాలం నాటి నాణెం కొన్నాను. డబ్బు ఎంతైనా వెచ్చిస్తా. –దుర్గ -
ఈ నాణేలు ప్రకాశిస్తాయి..
అమలాపురం టౌన్: పసిఫిక్ మహా సముద్రంలో ఫ్రెంచి పాలినేషియా, కిరిబాటి, కెయిర్న్ ద్వీపాల మధ్య ఉన్న అందమైన దీవి క్రెసెంట్. ఈ దీవి ప్రభుత్వం విడుదల చేసిన చీకట్లో మెరిసే నాణేలను అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. ఈ దీవి ప్రజలు చాలా కాలం డబ్బుకు బదులుగా ముత్యాలనే వాడేవారు. క్రెసెంటీస్ భాషలో ‘పోవా’ అంటే ముత్యమని అర్థం. 2006లో 500, 1,000, 5,000 పోవా ముఖ విలువ కలిగిన నాణేలను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నాణేలను యాక్రిలిక్ పదార్థంతో తయారు చేశారు. వీటి తయారీలో ఫ్లోరోసెంట్ పదార్థం వాడడంవల్ల అవి చీకట్లో మెరుస్తాయి. నాణేలను 39 మిల్లీమీటర్ల వ్యాసంతో, 5 మిల్లీమీటర్ల మందంతో గుండ్రని ఆకారంలో రూపాందించారు. వీటిపై ఉదయిస్నున్న సూర్యుడు, కొబ్బరి చెట్టు ముద్రించారు. ఇవి నీలం, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో పారదర్శకంగా ఉండి అక్కడి ప్రజల జీవన శైలిని ప్రతిబింబిస్తాయని కామేశ్వర్ చెప్పారు. -
జీవన పోరాటం
తెప్పలు కుప్పలుగా ఉన్నాయని అందులో ఎంతోకొంత దొరుకుతుందనే ఆశతో కొందరు ఇలా ప్రమాదకర ఫీట్లు చేశారు. అరసవల్లి ఇంద్ర పుష్కరిణిలో చిల్లర వెతుకుతూ కెమెరా కంట పడ్డారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం -
కలెక్షన్ కింగ్
కరెన్సీ కలెక్షన్ రహంతుల్లా హాబీ పురాతనమంటే మక్కువ...సేకరణ ఎక్కువ – ఇప్పటికే 200 దేశాల కరెన్సీనోట్ల సేకరణ – మొగల్, మౌర్య, మగధ, విజయనగర రాజుల కాలం బంగారు, వెండి నాణేలు భద్రపరిచిన వైనం ఒక్కొక్కరిది ఒక్కో హాబీ..కొందరు మొక్కులు పెంచుకుని సంబరపఽడతారు..ఇంకొందరు ట్రావెలింగ్‌ను ఇష్టపడతారు. ఇలా భిన్నమైన అభిరుచితో సమాజంలో తమకంటూ గుర్తింపును తెచ్చుకుంటారు. ఈకోవలోకే వస్తాఽడు హిందూపురానికి చెందిన వ్యాపారి రహంతుల్లా. పాత నాణేలు..కరెన్సీ సేకరించడం ఆయన హాబీ. పదో తరగతి వరకే చదివినా ప్రపంచంలోని అన్ని దేశాల నోట్లు...వాటి ప్రాముఖ్యం...ఎప్పుడు చలామణిలో ఉన్నది చెప్పడంలో ఆయన దిట్ట. హిందూపురం అర్బన్: హిందూపురం పరిగి రోడ్డులో సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసే జీఎం రహంతుల్లాకు చిన్నప్పటి నుంచి పాత వస్తువులను సేకరించడం ఇష్టం. ఈ క్రమంలోనే నాణేలు సేకరించడఽం అలవాటు చేసుకున్నాడు. పాతనాణేలన్నా.. ప్రపంచదేశాల కరెన్సీ నోట్లన్నా అతనికి ప్రాణం. వాటిసేకరణ కోసం ఎంతదూరమైనా..ఎంత ఖర్చుయినా వెనుకాడడు. ఇందుకోసం బెంగళూరు, ముంబాయి, హంపి, మైసూర్, హైదరాబాద్ నగరాలకు తరచూ ప్రయాణం చేస్తుంటాడు. పుస్తకాలసాయంతో గుర్తింపు ప్రాచీనకాలం నాటి నాణేలను గుర్చించేందుకు రహంతుల్లా ప్రపంచ దేశాల కరెన్సీపై పలువురు రచయితలు వివిధ బాషల్లో రాసిన పుస్తకాలను సేకరించి పెట్టుకున్నాడు. ఇతర భాషల్లోని పుస్తకాలను ఆ భాష తెలిసిన వారి వద్దకు వెళ్లి అందులోని విషయాలను తెలుగులోకి అనువాదం చేసుకుంటాడు. దాని సాయంతో నాణ౾ేల ముద్రలు, వాటి నాణ్యతను బాగా çపరీక్షించి అవి ఏ కాలం నాటివో నిర్ధారించుకుంటాడు. ప్రపంచదేశాల కరెన్సీనోట్లు రహంతుల్లా వద్ద సుమారు 200 దేశాలకు సంబంధించిన కరెన్సీ నోట్లు ఉన్నాయి. రూ.1 నుంచి రూ.50 వేలు, రూ.లక్ష వరకు విలువైన నోట్లు కూడా ఉన్నాయి. ఇందులో డాలర్, దినార్, బహాట్, షిల్లింగ్, వాటూస్, డౌగ్స్, క్యాట్స్, కోపేక్స్, సెనౌటాస్, ఫెసోస్, పోల్స్, రియల్స్, దిర్హం, ఓర్స్, హాలర్ట్, యాన్స్, మోస్, పుంగ్, కునా, లిపా, ఎస్కూడ్, బోబిబారిస్, రూపాయి ఇన్ని పేర్లతో ఉన్న కరెన్సీనోట్లు ఉన్నాయి. ఇలా 1850 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చలామణిలో ఉన్న అన్నిరకాల కరెన్సీ నోట్లు భద్రపర్చుకున్నాడు. చారిత్రక నేపథ్యం గల నాణేలు ఎక్కువే సువిశాల భారత సామాజ్యాన్ని పాలించిన చక్రవర్తుల కాలంలో వినియోగించిన నాణేలు, శాసనాలు కూడా రహంతుల్లా సంపాదించాడు. అలాగే అప్పటికాలంలో చలమణిలో ఉన్న బంగారు, వెండి, సీసం వంటి లోహాలతో తయారు నాణేలు కూడా సేకరించి భద్రం చేశాడు. ఇందులో మొగల్ చక్రవర్తులు, మగధ, మౌర్య, ఢిల్లీసుల్తాన్, గుజరాత్, గుల్బార్గా సుల్తాన్స్, విజయనగర చక్రవర్తులు, మేవార్, మరాఠా, కాబ్, చోళ, సిలోన్, చతుస్ బనవాసీ, కోబ్ బిహార్, కాంచే, శతవాహన సామ్రాజ్యాధీశుల కాలంలో ఉన్న నాణేలు అనేకం ఉన్నాయి. త్వరలోనే ఎగ్జిబిషన్ నాకు పురాతన వస్తువులు, పుస్తకాలు, నాణేలు సేకరించడం ఇష్టం. కొన్నేళ్లుగా ఇలా వివిధ దేశాల కరెన్సీని సేకరించాను. ఇప్పటి వరకు ఎక్కడా ప్రదర్శన ఏర్పాటు చేయలేదు. మరిన్ని పురాతన నాణేలు...నోట్లు సేకరించి త్వరలోనే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని ఉంది. భావి తరాలకు మన సంస్కృతి తెలిజెప్పేందుకు నాణేలు కూడా తోడ్పడతాయన్నది నా నమ్మకం. - రహంతుల్లా, హిందూపురం -
ఆకట్టుకున్న పురాతన నాణేల ప్రదర్శన
అత్తిలి :స్థానిక ఎస్వీఎస్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన పాతనాణేలు, కరెన్సీనోట్లు, తపాలా బిళ్లల ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లికి చెందిన రిటైర్డు ఉద్యోగి అల్లుకృష్ణకుమారి తాను సేకరించిన 70 దేశాలకు చెందిన 150 కరెన్సీనోట్లు, 900 నాణేలు, 600 తపాలా బిళ్లలను ప్రదర్శనలో ఉంచారు. ఇండియాలో 18వ శతాబ్దం నాటి నాణేలను ప్రదర్శించారు. విద్యార్థులకు అవగాహన కల్పించారు. కృష్ణకుమారి సర్పంచ్ కందుల కల్పన, జెడ్పీటీసీ మేడపాటి కృష్ణకుమారి సత్కరించారు. హెచ్ఎం కామర్సు నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు