పోర్ట్ విల్లా : పసిఫిక్ మహాసముద్రంలోని వనౌతు ద్వీపదేశంలో శుక్రవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7గా నమోదు అయింది. ఈ మేరకు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మలేకులా ద్వీపంలో నర్సప్ వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొంది. వనౌతు రాజధాని పోర్ట్విల్లాకు భూకంప కేంద్రం 208 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది.