వనౌతులో భూకంపం
సిడ్నీ: వనౌతులోని పసిఫిక్ మహాసముద్రంలో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.3గా నమోదు అయిందని భూకంప శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే సునామీ వచ్చే అవకాశం లేదని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
భూకంప కేంద్రం వనౌతు రాజధాని పోర్ట్ విల్లాకు 335 కిలోమీటర్ల దూరంలో... 80 మైళ్ల అడుగున గుర్తించినట్లు తెలిపింది. ఫసిపిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియా - హవాయి దేశాల మధ్య 65 దీవుల సముదాయమే వనౌతు. ఈ చిన్న ద్వీపదేశంలో మూడు లక్షల జనాభా నివసిస్తుంటారు.