powerful Earthquake
-
రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు కూడా జారీ..
-
మెక్సికోలో భారీ భూకంపం
మెక్సికో సిటీ : మెక్సికోలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. దక్షిణ మెక్సికోలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టుగా తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.29 గంటలకు ఈ భూకంపం సంభవించిందని పేర్కొంది. ఆక్సాకా స్టేట్ పసిఫిక్ తీరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయినట్టుగా సమాచారం. భూకంప ప్రభావంతో మెక్సికోలో పలు భవనాలు కంపించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి భయంతో పరుగులు తీశారు. మరోవైపు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను అక్కడ నుంచి తరలించారు. కాగా 2017లో మెక్సికోలో భూకంపం కారణంగా 355 మంది మృతి చెందారు. -
ఇటలీలో భారీ భూకంపం: 247కి చేరిన మృతుల సంఖ్య
- ఇటలీలో పర్వత ప్రాంతాల్లో భారీ భూకంపం - 247కి చేరిన మృతుల సంఖ్య, 368మందికి పైగా గాయాలు - శిథిలాల కింద మృతదేహాలు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం అక్యుమోలి: ఇటలీలో భారీ భూకంపం ధాటికి గురువారం నాటికి మరణించిన వారి సంఖ్య 247కి చేరగా, 368మందికి పైగా గాయాలు అయ్యాయి. నిన్న (బుధవారం) తెల్లవారుజామున ఇటలీలోని కేంద్ర పర్వత ప్రాంతాల్లో 6.0 నుంచి 6.2 తీవ్రతతో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూ ప్రకంపనలు సంభవించిన సంగతి తెలిసిందే. దీని ఫలితంగా మధ్య ఇటలీలోని పర్వత ప్రాంతాల్లో ఉన్న పలు గ్రామాలు కకావికలమయ్యాయి. నిన్నటివరకూ 120 మంది మృతి చెందినట్లు ఇటలీ ప్రధాని రెంజీ ప్రకటించారు. అయితే నేటివరకూ మృతుల సంఖ్య దాదాపు 159వరకు చేరినట్టు అధికారులు వెల్లడించారు. పలువురు శిథిలాల్లో చిక్కుకోగా.. మరికొంతమంది గల్లంతయ్యారు. భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కాగా, 2009లో ఇటలీలోని అకీలా ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపంలో 300 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి విధితమే. అదేవిధంగా మయన్మార్‌లో 6.8 తీవ్రతతో.. మయన్మార్‌నూ భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ మయన్మార్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. సుమారు 84 కిలోమీటర్ల వరకు వ్యాపించిన ప్రకంపనాలు పొరుగున ఉన్న థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, భారత్ తదితర దేశాలలో ప్రభావం చూపాయి. -
ఇటలీలో భారీ భూకంపం
-
ఇటలీలో భారీ భూకంపం
- 120 మంది మృతి రిక్టర్‌స్కేలుపై 6.2 తీవ్రత - మయన్మార్‌లోనూ ప్రకంపనలు అక్యుమోలి: ఇటలీలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 6.0 నుంచి 6.2 తీవ్రతతో దేశంలో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూ ప్రకంపనలు తలెత్తాయి. ఫలితంగా మధ్య ఇటలీలోని పర్వత ప్రాంతాల్లో ఉన్న పలు గ్రామాలు కకావికలమయ్యాయి. 120 మంది మృతి చెందినట్లు ఇటలీ ప్రధాని రెంజీ ప్రకటించారు. 368 మందికిపైగా గాయాలయ్యాయి. పలువురు శిథిలాల్లో చిక్కుకోగా.. మరికొంతమంది గల్లంతయ్యారు. భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 2009లో ఇటలీలోని అకీలా ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపంలో 300 మంది ప్రాణాలు కోల్పోయారని.. ఆ తర్వాత ఆ స్థాయిలో భూకంపం సంభవించడం ఇదేనని అధికారులు చెబుతున్నారు. భూకంపం ధాటికి ఎమాట్రిస్ నగరం పూర్తిగా ధ్వంసమైందని నగర మేయర్ సర్జియో పిరోజీ తెలిపారు. నగరం నడిబొడ్డున భారీ భవనాలు కుప్పకూలిపోయాయని, విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని వివరించారు. భూకంప తీవ్రతను ముందుగా గుర్తించే యూఎస్జీఎస్ పేజర్ సిస్టమ్ ఇటలీలో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇటలీ ప్రధాన మంత్రి మాటో రెంజి ఫ్రాన్స్ పర్యటనను రద్దు చేసుకున్నారు. కాగా కూలిపోయిన భవ నాల శిథిలాల కింద చిక్కుకున్న పలువురు సహాయ చర్యల కోసం ఎదురు చూస్తున్నారు. ఇలికా గ్రామస్తుడు 69 ఏళ్ల గిడో బోర్డో మీడియాతో మాట్లాడుతూ ‘నేనిక్కడ లేను. భూకంపం రాగానే హుటాహుటిన ఇక్కడికి వచ్చాను. చూస్తే.. మా సోదరి, ఆమె భర్త శిథిలాల్లో చిక్కుకుపోయారు. వారిని వెలికితీసేవారి కోసం ఎదురు చూస్తున్నాం. ఎలాగోలా వారి పిల్లల్ని రక్షించుకోగలిగాం. వారిప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు’ అని వివరించారు. బాధితుల్లో తొమ్మిది నెలల పాప కూడా ఉంది. వారి తల్లిదండ్రులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఓ మామ్మ చేసిన తెలివైన పని వల్ల ఆమె మనవలిద్దరూ బతికి బయటపడ్డారు. ప్రకంపనలు ప్రారంభం కాగానే ఆ మామ్మ ఆ పిల్లల్ని మంచం కిందకి విసిరేయడంతో వారికేం కాలేదు. మృతుల కుటుంబాలకు మోదీ సంతాపం ఇటలీలో భూకంపంతో పెద్ద ఎత్తున ప్రజలు మృతిచెందడంపై భారత ప్రధాన మంతి నరేంద్ర మోదీ విచారం వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. ఈ ఘటనలో ఇటలీలో నివసించే భారతీయులకు ఎలాంటి ప్రమాదం జరగలేద ని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మయన్మార్‌లో 6.8 తీవ్రతతో.. మయన్మార్‌నూ భారీ భూకంపం కుదిపేసింది. సెంట్రల్ మయన్మార్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. సుమారు 84 కిలోమీటర్ల వరకు వ్యాపించిన ప్రకంపనాలు పొరుగున ఉన్న థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, భారత్ తదితర దేశాలలో ప్రభావం చూపాయి. భూకంపం ధాటికి 22 ఏళ్ల యువకుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఓ స్పానిష్ పర్యాటకుడు గాయపడ్డాడు. పలు భవనాలు, ప్రాచీన ఆలయాలు, పురాతన నగరం బగాన్‌లో 60 ప్రసిద్ధ పగోడాలు కుప్పకూలాయి. జనం భయంతో బయటికి పరుగులు తీశారు. -
శిథిలాల్లో చిన్నారులు.. మిన్నంటిన ఆర్తనాదాలు!
అది తెల్లవారుజాము 3.30 గంటల సమయం. అందరూ గాఢమైన నిద్రలో ఉన్నారు. ఇంతలో భూమి ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. భారీ భూకంపం. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత. నిద్రలో ఉన్నవారు నిద్రలోనే కన్నుమూశారు. ఇళ్లూ, భవనాలు నేలమట్టమయ్యాయి. గ్రామాలకు గ్రామాలు శిథిలాల గుట్టలుగా మారిపోయాయి. దాదాపు 73 మంది ప్రాణాలు విడిచారు. 150 మంది గల్లంతయ్యారు. శిథిలాల కింద వందలమంది చిక్కుకున్నారు. శిథిలాల కింద ఉన్నవారిని కాపాడటానికి సహాయ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నది. శిథిలాల కింద నుంచి చిన్నారుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని, చాలాచోట్ల గాయాలైన స్థానికులు శిథిలాలలోని తమ చిన్నారులను కాపాడుకోవడానికి వట్టి చేతులతో మట్టిపెళ్లలను తొలగిస్తున్నారని సహాయక సిబ్బంది తెలిపారు. భూకంప కేంద్రం సమీపంలోని చాలా గ్రామాల్లో, పట్టణాల్లో హృదయావిదారకమైన పరిస్థితులు నెలకొన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇది బుధవారం తెల్లవారుజామున ఇటలీలో సంభవించిన భారీ భూకంపం సృష్టించిన పెనువిలయం. సెంట్రల్ ఇటలీ అంబ్రియాలోని నొర్షియా సమీపంలో సంభవించిన ఈ భూకంపం ధాటికి ఇటలీ రాజధాని రోమ్‌లోనూ భవనాలు వణికిపోయాయి. భూకంప కేంద్ర స్థానానికి 100 మైళ్ల దూరంలోని క్రొషియాలోనూ ప్రభావం కనిపించింది. అంబ్రియన్ పరత్వాల సమీపంలో ఉన్న అమెట్రిస్, అక్యుమోలి, అర్కాట డెల్ ట్రోంటో, పెస్కారా డెల్ టోరంటో తదితర గ్రామాలు, పట్టణాలు పూర్తిగా నేలమట్టమై.. శిథిలాల దిబ్బగా కనిపిస్తున్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర విషాద పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, ఈ భూకంపంలో భారతీయ బాధితులెవరూ లేరని, ఇటలీలోని ప్రవాస భారతీయులందరూ క్షేమంగా ఉన్నట్టు సమాచారం అందుతోందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్లో తెలిపారు.