మెక్సికో సిటీ : మెక్సికోలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. దక్షిణ మెక్సికోలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టుగా తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.29 గంటలకు ఈ భూకంపం సంభవించిందని పేర్కొంది. ఆక్సాకా స్టేట్ పసిఫిక్ తీరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయినట్టుగా సమాచారం. భూకంప ప్రభావంతో మెక్సికోలో పలు భవనాలు కంపించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి భయంతో పరుగులు తీశారు. మరోవైపు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను అక్కడ నుంచి తరలించారు. కాగా 2017లో మెక్సికోలో భూకంపం కారణంగా 355 మంది మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment