న్యూఢిల్లీ: విదేశాల్లో భారతీయ విద్యార్థుల మరణాలపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంటులో ప్రకటించింది. గత ఐదేళ్లలో.. విదేశాలలో 403 మంది భారతీయ విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ వెల్లడించారు.
మూడోరోజు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో ఒక ప్రశ్నకు మంత్రి మురళీధరన్ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. 2018 నుంచి విదేశాల్లో 403 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందగా.. అత్యధికంగా 91 మంది కెనడా దేశంలో మరణించినట్లు తెలిపారు. ఇంగ్లండ్‌లో 48, రష్యాలో 40 మంది, అమెరికాలో 36, ఉక్రెయిన్‌లో 21 మంది భారతీయ విద్యార్థులు మృతి చెందారని పేర్కొంది.
అయితే ఇటీవల అమెరికాలో వరుసగా నలుగురు భారతీయ విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశాలల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఏ దేశంలో ఇప్పటివరకు అసలు ఎంత మంది విద్యార్థులు విదేశాల్లో మృతి చెందారన్న విషయంపై స్పష్టత ఇచ్చింది కేంద్రం.
Comments
Please login to add a commentAdd a comment