అఫ్ఘానిస్థాన్లో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో మృతుల సంఖ్య 2,100కు చేరింది. సంఘటన స్థలం మొత్తం ఓ భారీ సమాధిలా మారిపోవచ్చని అక్కడ సహాయ కార్యకలాపాలలో పాల్గొంటున్న అధికారులు తెలిపారు. మృతదేహాలను వెలికితీయడం దాదాపు అసాధ్యం అవుతోంది. ఆర్గో జిల్లాలోని అరబ్ బరీక్ ప్రాంతంలోగల ఓ మారుమూల ప్రాంతంలో ఓ కొండ విరిగి పడటంతో ప్రమాదం సంభవించింది. అఫ్ఘాన్ రాజధాని 315 కిలోమీటర్ల ఈశాన్యంగా ఈ ప్రాంతం ఉంది. అక్కడ దాదాపు 700 కుటుంబాలకు చెందిన 4వేల మంది ఉంటున్నారని,
గత కొద్దిరోజులుగా ఆప్ఘన్ ఈశాన్య ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురిసిన వర్షం కారణంగా బురద, కొండరాళ్లు కదిలిపోయి ప్రవహించాయి. బదక్షన్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి దిగువన ఉన్న గ్రామాలు నేలమట్టం అయ్యాయి.అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని యుద్ద ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టారు.శుక్రవారం శెలవు దినం కావడంతో అంతా ఇంటిలోనే ఉండిపోయారని మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని వారు చెబుతున్నారు. మరో కొండ చరియ కూడా విరిగి పడొచ్చన్న భయం సహాయ కార్యకలాపాలకు అడ్డంగా మారింది.
సమాధిలా మారిన అఫ్ఘానిస్థాన్
Published Sat, May 3 2014 1:42 PM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM
Advertisement
Advertisement