అంకారా: టర్కీ, సిరియాలో సంభవించిన భారీ భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రకృతి విలయంలో ఇప్పటి వరకు రెండు దేశాల్లో 50,000పైగా మృతి చెందారు. ఒక్క టర్కీలోనే 44,218 మంది మరణించినట్లు డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారులు శుక్రవారం వెల్లడించారు. అదే విధంగా సిరియాలో 5,914 మంది మృతి చెందినట్లు తెలిపారు. దీంతో రెండు దేశాల్లో కలిపి మరణించిన వారి సంఖ్య 50 వేలు దాటింది.
కాగా ఫిబ్రవరి 6న తుర్కియే, సిరియాలో సెను భూకంపాలు వచ్చిన విషయం తెలిసిందే. అత్యంత హృదయ విదారకమైన ప్రకృతి వైపరీత్యాల్లో ఇదీ ఒకటి. తెలవారుతూండగానే 7.8 తీవ్రతతో నమోదైన భూకంపం వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది.
ఘోర విపత్తులో ఎత్తైన భవనాలు నెలకొరిగాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో 1,60,000 భవనాలు, 5,20,000 అపార్టుమెంట్లు ధ్వంసమవడం లేదా దెబ్బతినడం జరిగిందని అక్కడి ప్రభుత్వాలు వెల్లడించాయి. అయితే ఇంతటి విషాదం తర్వాత కూడా టర్కీలో పలుమార్లు మళ్లీ భూకంపాలు నమోదవ్వడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment