కిన్‌షాసా: కాంగోలో పడవ మునిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 86కు పెరిగింది. 271 మంది ప్రయాణికులతో కిక్కిరిసిన నాటు పడవ ఇంజన్ వైఫల్యంతో మంగళవారం నీట మునగడం తెలిసిందే. 185 మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు.
దట్టమైన అటవులు, నదుల కారణంగా కాంగోలో రోడ్డు వ్యవస్థ సరిగా లేదు. జనం పడవ ప్రయాణాలకే మొగ్గుచూపుతారు. పడవ ప్రమాదాలు అక్కడ సర్వసాధారణం. ఫిబ్రవరిలోనూ నాటు పడవ మునిగి డజన్లకొద్దీ చనిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment