
కీవ్:రష్యాతో యుద్ధంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికా మద్దతు లేకుండా రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ బతికి బట్టకట్టడం కష్టమేనన్నారు.డొనాల్డ్ ట్రంప్,పుతిన్‌ల మధ్య ఇటీవల జరిగిన ఫోన్ చర్చలపై జెలెన్‌స్కీ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.అమెరికా మద్దతు లేకుండా తాము జీవించే అవకాశాలు చాలా తక్కువ అని జెలెన్‌స్కీ అన్నారు.
తమతో యుద్ధాన్ని ముగించాలని పుతిన్ కోరుకోవడం లేదన్నారు. విరామ సమయంలో యుద్ధానికి ఆయన మరింతగా సంసిద్ధమవుతున్నారని చెప్పారు.ఇంతేకాక రష్యాతో యూరప్‌కు ప్రమాదం పొంచి ఉందన్నారు. యూరప్ ఇప్పటికైనా మేల్కొని,సొంతంగా సైన్యాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. త్వరలో యూరప్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.మరోవైపు రష్యాతో ట్రంప్ జరుపుతున్న చర్చల్లో ఉక్రెయిన్ భాగస్వామ్యం లేకపోవడంపై జెలెన్‌స్కీ అసంతృప్తి వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment