రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఏడో రోజు కొనసాగుతోంది. 6 రోజుల్లో సుమారు 6000 మంది రష్యన్లు మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్‌స్కీ వెల్లడించాడు. ఈ విషయంలో ధీటుగా ఎదుర్కుంటున్న ఉక్రెయిన్ సైన్య పోరాట పటిమను ఆయన కొనియాడారు. కొన్నిచోట్ల రష్యాను చావుదెబ్బ తీశామని, రష్యా మాత్రం లెక్కలు దాస్తోందని ప్రకటించారు జెలెన్‌స్కీ. ఇదిలా ఉండగా దక్షిణ ఉక్రెయిన్ నగరమైన ఖెర్సన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు రష్యా సైన్యం బుధవారం తెలిపింది. (చదవండి: ఉక్రెయిన్ నుంచి రష్య దళాలు వైదొలగేలా తీర్మానం! )
రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ.. సాయుధ దళాల రష్యన్ విభాగాలు ఖెర్సన్ ప్రాంతీయ కేంద్రాన్ని పూర్తి నియంత్రణలోకి తీసుకున్నాయని తెలిపారు. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ గవర్నర్ ఖేర్సన్ కూడా ధృవీకరించారు. మరో వైపు ఉక్రెయిన్‌పై దాడికి బదులుగా రష్యా విమానాలకు అమెరికా తన గగనతలాన్ని మూసివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బుధవారం ప్రకటించారు. ఈ సమస్యకు పరిష్కారం దిశగా రెండు దేశాల మధ్య రెండో విడత చర్చలు బుధవారం జరగనున్నాయి. గత 24 గంటల్లో ఉక్రెయిన్ నుంచి 1,377 మంది పౌరులను భారతదేశం తరలించినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ బుధవారం సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
VIDEO: Footage of a Russian helicopter-borne assault on Hostomel town in Kyiv Oblast - @Caucasuswar pic.twitter.com/DImELO2lqA
— Conflict News (@Conflicts) February 24, 2022
Comments
Please login to add a commentAdd a comment