రెండు చర్చిలు, యూదు ప్రార్థనా మందిరంపై దాడి
15 మంది పోలీసులు సహా 20 మంది మృతి
మాస్కో: రష్యాలోని ముస్లిం ప్రాబల్య దక్షిణ ప్రాంత దగెస్తాన్ రిపబ్లిక్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ఆదివారం సాయంత్రం ఏకకాలంలో దగెస్తాన్ రాజధాని మఖచ్కాలా లోని ఓ చర్చి, ఓ ట్రాఫిక్ పోలీస్ పోస్ట్‌పైనా కాల్పులు జరపడంతోపాటు డెర్బెంట్ నగరంలోని ఒక చర్చి, ఒక యూదు ప్రార్థనా మందిరంలో దాడి చేసి నిప్పుపెట్టారు. ఉగ్రవాదులు డెర్బెంట్ ట్రినిటీ సండే చర్చిలో ఉన్న రెవరెండ్ నికోలాయ్ కొటెల్నికోవ్ (66)గొంతుకోసి చంపడంతోపాటు ఆ చర్చికి నిప్పుపెట్టారని అధికా రులు తెలిపారు.
రెండు ఘటనల్లో 15 మంది పోలీసులు, ఒక బోధకుడు సహా 20 మంది చనిపోయారు. క్షతగాత్రులైన 46 మందిలో 13 మంది పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. నలుగురు పోలీసు అధికారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భద్రతా బలగాల ఎదురు దాడిలో ఆరుగురు ఉగ్రవా దులు హతమ య్యారన్నా రు. అయితే, ఈ ఘటనల్లో ఎందరు ఉగ్రవా దులు పాల్గొన్నదీ వారు వివరించలేదు. హతమైన వారిలో ఉగ్రవాదుల్లో ముగ్గురిని రష్యాలోని ప్రధాన యునైటెడ్ రష్యా పార్టీకి దగెస్తాన్ హెడ్‌గా ఉన్న మగొమెద్ ఒమరోవ్ ఇద్దరు కుమారులు, బంధువుగా అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment